News


ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంఘటన షాకింగ్‌

Tuesday 25th September 2018
Markets_main1537868222.png-20559

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంఘటన షాకింగ్‌ లాంటిదన్నారు మీర్‌ అసెట్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ హెడ్‌ (ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌) మహేంద్రా జాజో. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం వల్ల ఇన్వెస్టర్లు వారి పోర్ట్‌ఫోలియోలోని ఇన్వెస్ట్‌మెంట్లను తిరిగి మరోసారి అంచనా వేసుకుంటున్నారని తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఘటనను ఎవ్వరూ అంచనా వేసి ఉండరని పేర్కొన్నారు. ఇది ఒక షాకింగ్‌ లాంటిదన్నారు. సంస్థ రుణ భారంలో ఎక్కువ భాగం బ్యాంకింగ్‌ రంగానిదేనని తెలిపారు. మ్యూచువల్‌ ఫండ్స్‌కు కూడా కొంత వాటా ఉందని పేర్కొన్నారు. మార్కెట్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఘటన వల్ల చాలా ఆందోళనకరమైన పరిస్థితులు తలెత్తాయని తెలిపారు. దీనివల్ల భయపడే ఇన్వెస్టర్లు మార్కెట్ల నుంచి బయటకు వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.  
గత కొన్నేళ్లుగా ఎన్‌పీఏలు కేంద్ర బిందువుగా సమస్యలు ఉండేవని, అందువల్ల పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు మంచి పనితీరు కనబర్చలేకపోయాయని మహేంద్రా పేర్కొన్నారు. అయితే ఎన్‌పీఏ సమస్యల పరిష్కారమౌతోందని మార్కెట్‌ రెండు నెలల క్రితమే పనిగట్టిందన్నారు. అందువల్ల మళ్లీ ఇన్వెస్టర్లు పీఎస్‌యూ బ్యాంకుల రికవరీపై అధిక అంచనాలను ఏర్పరచుకున్నారని తెలిపారు. అయితే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ వంటి బ్లూచిప్‌ కంపెనీ గడ్డు పరిస్థితుల్లో చిక్కుకుంటుందని ఎవ్వరు ఊహించి ఉండరని పేర్కొన్నారు. ఈ కంపెనీకి బలమైన షేర్‌ హోల్డర్లు ఉన్నారని తెలిపారు. ఈ అంశం ఇన్వెస్టర్ల అంచనాలపై నెగటివ్‌ ప్రభావం చూపిందని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఎక్కువ రుణాలు ఇచ్చింది బ్యాంకులు కావడం ఇందుకు కారణమని తెలిపారు. ఇన్వెస్టర్లలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తర్వాత మళ్లీ ఎలాంటి కొత్త సమస్యలు ఉత్పన్నమౌతాయోననే ఆందోళనలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చూస్తే లిక్విడిటీ తగ్గుతోందని తెలిపారు. వచ్చే పాలసీ సమావేశంలో మరోమారు రేట్ల పెంపు ఉండొచ్చనే అంచనాలున్నాయని పేర్కొన్నారు. దేశీయంగా కూడా లిక్విడిటీ తగ్గొచ్చని తెలిపారు. ప్రస్తుతం ఆర్‌బీఐ తటస్థ ద్రవ్య విధానాన్ని అనుసరిస్తోందని పేర్కొన్నారు.  
దేశ ఆర్థిక వ్యవస్థపై క్రూడ్‌ ధరలు ప్రభావం చూపుతున్నాయని మహేంద్రా తెలిపారు. కరెంట్‌ అకౌంట్‌ లోటు, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై దీని ప్రభావం స్పష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 80 డాలర్లను అధిగమించిందన్నారు. ప్రస్తుతం క్రూడ్‌ ధర నాలుగేళ్ల గరిష్ట స్థాయిలో ఉందని తెలిపారు. రానున్న కాలంలో 100 డాలర్లకు కూడా చేరొచ్చనే అంచనాలున్నాయని పేర్కొన్నారు. దేశీ ఈల్డ్స్‌కు ఇది నెగటివ్‌ అని తెలిపారు. క్రూడ్‌ ధర పెరిగే కొద్ది ఈల్డ్స్‌ కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.  You may be interested

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ని రక్షిస్తాం: ఎల్‌ఐసీ

Tuesday 25th September 2018

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ కాకుండా ఆదుకుంటామని ఎల్ఐసీ హామీనిచ్చింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో వాటా పెంచుకోవడం సహా అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, మార్కెట్‌లో ఆందోళనలకు కారణమైన సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని ఎల్‌ఐసీ భరోసానిచ్చింది. కాగా ఎల్‌ఐసీకి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో 25 శాతానికిపైగా వాటాలున్నాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌న పతనం కానివ్వమని ఎల్‌ఐసీ చైర్మన్‌ వీకే శర్మ తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఆగస్ట్‌ నుంచి చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అవుతూ వస్తోంది. దీంతో గ్రూప్‌ ఎండీ, సీఈవో రాజీనామా

ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ ఐపీఓకు అప్లయ్‌ చేస్తున్నారా?

Tuesday 25th September 2018

ముంబై: రిటైల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ లిమిటెడ్‌ ఐపీఓ మంగళవారం(25న) ప్రారంభమైంది. గురువారం (27న) ముగిసే ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1734 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఈ ఐపీఓకు ధరల శ్రేణి రూ. 818-821ల మధ్య నిర్ణయించింది. ఈ ఐపీఓలో భాగంగా కంపెనీ మొత్తం రూ. 400 కోట్ల విలువైన 16.21 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచింది. ఈ ఐపీఓకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, సిటీగ్రూప్‌

Most from this category