News


ఐఎల్‌ ఎఫ్‌ఎస్‌ ‍గ్రూప్‌ షేర్లు రికవరీ..!

Wednesday 3rd October 2018
Markets_main1538547811.png-20817

దివాళా దశకు చేరిన ఐఎల్ఎఫ్ఎస్ సంస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకోవడంతో ఆ గ్రూప్‌ కంపెనీల షేర్లు బుధవారం రికవరీ బాట పట్టాయి. ఐల్‌ఎల్అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్స్‌ నెట్‌వర్క్స్‌, ఐఎల్‌అండ్ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్స్‌ షేర్లు ఇంట్రాడే 10-20శాతం లాభపడ్డాయి. తీవ్ర చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ మేనేజ్‌మెంట్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోంది. పాత బోర్డును రద్దు చేస్తూ కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. ఆరుగురు సభ్యులతో ఏర్పాటైన ఈ బోర్డుకు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎండీ, సీఈవో ఉదయ్‌ కోటక్‌ అధ్యక్షత వహించనున్నారు. ఈ నెల 8న కొత్త బోర్డు సమావేశం కానుంది. కొత్త బోర్డు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసి తదుపరి విచారణ జరిగే అక్టోబర్ 31లోగా అందజేయనుంది.
ఐఎల్అండ్‌ఎఫ్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌:- నేటి బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో రూ.9.43 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ప్రారంభంలోనే 10శాతం లాభపడి రూ.9.43 వద్దకు చేరుకుంది. ఉదయం గం.11:15లకు ఇండెక్స్‌ షేరు గత ముగింపు(రూ.8.58) ధరతో పోలిస్తే 9శాతం లాభంతో రూ.9ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.6.81లు, రూ.35.15లుగా నమోదయ్యాయి.
ఐఎల్అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్స్‌ నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌:- నేటి బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో రూ.31.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 20శాతం లాభపడి రూ.32.30 వద్దకు చేరుకుంది. ఉదయం గం.11:25లకు ఇండెక్స్‌ షేరు గత ముగింపు(రూ.26.95) ధరతో పోలిస్తే 19శాతం లాభంతో రూ.32ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.19.10లు రూ.97.35లుగా నమోదయ్యాయి.
ఐఎల్అండ్‌ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్చన్స్‌ కంపెనీ:- నేటి బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో ప్రారంభంలోనే  20శాతం లాభపడి రూ.19.22ల అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద లాక్‌ అయ్యింది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.11.55లు రూ.59.25లుగా నమోదయ్యాయి.You may be interested

అమెరికా జోరు ఇప్పుడే తగ్గదు...

Wednesday 3rd October 2018

అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై చాలా విశ్వాసంతో ఉన్నామని ఫెడరల్‌ రిజర్వు చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ తెలిపారు. భవిష్యత్‌ వృద్ధి అంచనాలు సానుకూలముగా ఉన్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగిత నాలుగు శాతానికి దిగువున ఉందని, ఇది శుభపరిణామని, ఇదే ట్రెండ్‌ వచ్చే 2 ఏళ్ల వరకు కొనసాగవచ్చని అంచనా వేశారు. వేతనాలు పెరిగినా కూడా ద్రవ్యోల్బణం మోస్తారుగా ఉందని, అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇది ఒక ప్రత్యేకమైన అంశమని అభిప్రాయపడ్డారు. తక్కువ

ఇచ్చిన అప్పులో 10- 15 శాతం ఆవిరి?!

Wednesday 3rd October 2018

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు బ్యాంకులిచ్చిన రుణాలపై అంచనా రుణభారంతో సతమతమవుతున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఎస్‌బీఐ, బీఓఐ, పీఎన్‌బీ తదితర బ్యాంకులన్నీ కలిపి దాదాపు 35వేల కోట్ల రూపాయల మేర అప్పులిచ్చిఉన్నాయి. వీటిలో అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2,388 కోట్ల రూపాయల మేర కంపెనీకి రుణాలిచ్చింది. తాజాగా ప్రభుత్వం కంపెనీ పరిస్థితి చక్కదిద్దేందుకు మేనేజ్‌మెంట్‌లో పలు కీలక మార్పులు చేసింది. ఈ మార్పుల కారణంగా తమ రుణాలు వసూలయ్యే ఛాన్సులు కాస్త మెరుగుపడ్డాయని బ్యాంకులు భావిస్తున్నాయి.

Most from this category