STOCKS

News


ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ షేర్లు: లోయర్‌ సర్య్కూట్‌

Tuesday 9th October 2018
Markets_main1539072075.png-20976

ముంబై:- తీవ్ర చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంస్థ మరోసారి వార్తల్లోకెక్కింది. ఐఎల్‌అండ్ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ మాతృ సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తాజాగా రూ. 20 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలమైనట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ గ్రూప్‌ కంపెనీలకు చెందిన కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి.ఫలితంగా నేడు బీఎస్‌ఈలో గ్రూప్‌నకు చెందిన షేర్లన్నీ లోయర్‌ సర్క్యూట్లను తాకాయి.
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ లిమిటెడ్‌:- నేడు బీఎస్‌ఈలో రూ.9.81ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం‍లోనే 5శాతం నష్టంతో రూ.9.32ల వద్ద లోయర్‌ సర్క్యూట్‌ను నమోదు చేసింది.
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌:- నేడు బీఎస్‌ఈలో రూ.24.60ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం‍లోనే 10శాతం నష్టంతో రూ.24.55ల వద్ద లోయర్‌ సర్క్యూట్‌ను నమోదు చేసింది. ఏడాది కాలంలో ఈ షేరు 65శాతం నష్టపోయింది.
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్స్‌:- నేడు బీఎస్‌ఈలో రూ.21.05ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం‍లోనే 10శాతం నష్టంతో రూ. 20.43ల వద్ద లోయర్‌ సర్క్యూట్‌ను నమోదు చేసింది. ఏడాది కాలంలో ఈ షేరు 58.6శాతం నష్టపోయింది.



You may be interested

అమ్మకాల ఒత్తిడిలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు

Tuesday 9th October 2018

ముంబై:- మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా మంగళవారం మిడ్‌సెషన్‌ సమయానికి ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2శాతం నష్టపోయింది. అత్యధికంగా సెంట్రల్‌ బ్యాంక్‌ 5శాతం నష్టపోయింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3శాతం పతనమవ్వగా, విజయా బ్యాంక్‌ 1.50శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1శాతం, ఎస్‌బీఐ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, యూనియన్‌

ఎర్నింగ్స్‌ బాగుంటే.. రిలీఫ్‌ ర్యాలీ!!

Tuesday 9th October 2018

కంపెనీల ఎర్నింగ్స్‌ బాగుంటే మార్కెట్‌లో రిలీఫ్‌ ఉంటుందని సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ జగనాథం తునుగుంట్ల తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. రూపాయి పతనం వల్ల ఐటీ, ఫార్మా కంపెనీలు ఏమేరకు ప్రయోజనం పొందాయనే విషయాన్ని త్వరలో చూడబోతున్నామని తెలిపారు. రెండు విభాగాలు బాగానే ర్యాలీ చేశాయని పేర్కొన్నారు.

Most from this category