STOCKS

News


ఐఐఎఫ్‌ఎల్‌ దివాళీ స్టాక్‌ రెకమండేషన్లు ఇవే...

Saturday 27th October 2018
Markets_main1540579079.png-21504

ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ఐఐఎఫ్‌ఎల్‌ దీపావళి సందర్భంగా స్టాక్‌ సిఫారసులను వెల్లడించింది. ఆర్తి ఇండస్ట్రీస్‌, మైండ్‌ట్రీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎంఫసిస్‌ తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి.

ఆర్తి ఇండస్ట్రీస్‌
టార్గెట్‌ రూ.1,517. 2017-18 ఆదాయంలో 48 శాతం ఎగుమతుల నుంచే వచ్చింది. వచ్చే రెండేళ్ల పాటు ఏటా 12-15 శాతం వృద్ధికి అవకాశాలున్నాయి. కంపెనీ రూ.14,000 కోట్ల విలువైన 10 ఏళ్లు, 20 ఏళ్ల కాలవ్యవధికి రెండు కాంట్రాక్టులను సొంతం చేసుకుంది. దీంతో దీర్ఘకాలంలో బలమైన ఫలితాలను నమోదు చేసుకునే అవకాశం కలిగింది. ఎగుమతి ఆధారిత కంపెనీ కావడంతో రూపాయి బలహీనతతో ప్రయోజనం లభిస్తుంది. వచ్చే రెండేళ్ల పాటు ఆదాయం ఏటా 18 శాతం చొప్పున, లాభం 24 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా.
బయోకాన్‌
టార్గెట్‌ రూ.768. బయోకాన్‌/మైలాన్ ట్రాస్టుజుమాబ్‌(ఓగివ్రి)/పెగ్‌ఫిల్‌గ్రాస్టిమ్‌(ఫుల్‌ఫిలా)కు అమెరికాలో, యూరోప్‌లో ఇన్సులిన్‌ గ్లార్గిన్‌కు అనుమతులు వచ్చాయి. ఈ రెండింటినీ వచ్చే కొన్ని నెలల్లో యూరోప్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఫుల్‌ఫిలాను సెప్టెంబర్‌ త్రైమాసికంలోనే అమెరికాలో విడుదల చేసింది. ఓగివ్రిని వచ్చే మార్చిలోపు విడుదల చేయనుంది. బయోకాన్‌ రీసెర్చ్‌ సబ్సిడరీ అయిన సింజీన్‌ రూపాయి తరుగుదల, ఆర్‌అండ్‌డీ అవుట్‌సోర్సింగ్‌ విస్తరణ ధోరణి పెరగడం వంటివి కలిసిరానున్నాయి. సింజీన్‌ ఆదాయం, లాభాలు ఏటా 37-30 శాతం స్థాయిలో వచ్చే రెండేళ్ల పాటు పెరిగేందుకు అవకాశం ఉంది. 
కోటక్‌ బ్యాంకు
టార్గెట్‌ రూ.1,380. కీలక వ్యాపారాల్లో మార్కెట్‌ వాటాను పెంచుకుంటోంది. సబ్సిడరీల నుంచి వచ్చే మొత్తం కన్సాలిడేటెడ్‌ లాభంలో 36 శాతం నుంచి 2020 ఆర్థిక సంవత్సరానికి 40 శాతానికి పెరగనుంది. పోటీ సంస్థలతో పోలిస్తే మార్కెట్‌ షేరును, లాభాలను పెంచుకునేందుకే అవకాశాలు ఉన్నాయి.
ఎంఫసిస్‌
టార్గెట్‌ రూ.1,328. కొత్త తరహా సేవల విభాగంలో ఆర్డర్లను దక్కించుకుంది. దీంతో భవిష్యత్తులో మంచి ఆదాయాలకు అవకాశం ఉంది. ప్రధాన వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం రానున్న రెండేళ్లలో 14 శాతం చొప్పున పెరుగుతుందని కంపెనీ అంచనా. మొత్తం ఆదాయం, లాభం అన్నవి ఏటా 17 శాతం, 23 శాతం చొప్పున 2018-20 ఆర్థిక సంవత్సరాల మధ్య పెరుగుతుందని తాము అంచనా వేస్తున్నట్టు ఐఐఎఫ్‌ఎల్‌ తెలిపింది. 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
టార్గెట్‌ రూ.1,310. రిఫైనరీ ఆఫ్‌ గ్యాస్‌ క్రాకర్‌ ఆరంభం కానుండడం, పాలిస్టర్‌, ఫైబర్‌ డిమాండ్‌ బలంగా ఉండడంతో పెట్రోకెమికల్స్‌ పనితీరు మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నాం. అతిపెద్ద పెట్‌కోక్‌ గ్యాసిఫికేషన్‌ యూనిట్‌ జామ్‌నగర్‌లో ప్రారంభించే క్రమంలో ఉంది. దీంతో చమురు రిఫైనరీ మార్జిన్‌ బ్యారెల్‌కు 2 డాలర్ల మేర పెరగనుంది. జియో కొత్త చందాదారులను ఇకపైనా చేర్చుకోవడం ద్వారా లాభాలను మెరుగుపరచుకోగలదు. వీటితోపాటు... మదర్సన్‌ సుమిసిస్టమ్స్‌, మైండ్‌ట్రీ, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ షేర్లను కూడా ఐఐఎఫ్‌ఎల్‌ సంస్థ సిఫారసు చేసింది.



You may be interested

ఇన్వెస్టర్ల సంగతేమో... ఫండ్స్‌కు అయితే లాభాలే!

Saturday 27th October 2018

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో (టీఈఆర్‌)ను సెబీ ఇటీవల తగ్గించింది. ఇది ఆయా సంస్థల భవిష్యత్తు ఆదాయాలపై ప్రతిఫలించనుంది. అయితే, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలకు (ఏఎంసీలు) లాభాలు, ఆస్తుల విలువ వృద్ధి పరంగా గడిచిన ఆర్థిక సంవత్సరం (2017-18) గుర్తుండిపోతుంది. ఏఎంసీలు అన్నింటికీ కలిపి వచ్చిన ఆదాయం రూ.14,000 కోట్లు.    ఎస్సెల్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఇన్వెస్కో మ్యూచువల్‌

‘పోర్ట్‌ఫోలియో రెడీ చేసుకుని రైడ్‌ చేయడమే’

Saturday 27th October 2018

ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులు ఇన్వెస్టర్లకు అనుకూలమని, దీన్ని అవకాశంగా తీసుకుని ఇన్వెస్ట్‌మెంట్‌పై దృష్టి సారించాలని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ సూచించారు. శుక్రవారం మార్కెట్‌ పతనం నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ఏం సూచిస్తారన్న ప్రశ్నకు... ‘‘గత రెండేళ్లలోనే నిరాశావాదం చాలా ఎక్కువగా ఉంది. చాలా రంగాల స్టాక్స్‌ బేర్‌ మార్కెట్లోకి ప్రవేశించాయి. మంచి ధరల అవకాశాలు అనేవి ఉండవు. మూడు స్థూల ఆర్థిక అంశాలు మనకు అనుకూలంగా మారాయి.

Most from this category