STOCKS

News


ఈ ఫార్మా షేర్లపై బుల్లిష్‌..

Friday 24th August 2018
Markets_main1535099215.png-19600

ఫార్మా రం‍గంలో ర్యాలీ మిడ్‌క్యాప్స్‌కు విస్తరిస్తోందంటున్నారు ఐఐఎఫ్‌ఎల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (రీసెర్చ్‌) అభిమన్యు సొఫత్‌. అందువల్ల రంగంలో ఎంపిక చేసిన స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. అమెరికాలోని జెనరిక్‌ మార్కెట్‌ ఇంకా బలహీనంగా ఉందని పేర్కొన్నారు.
అరబిందో ఫార్మాను కొనుగోలు చేయవచ్చని అభిమన్యు సిఫార్సు చేశారు. పీఈకి 12.5 రెట్లు వద్ద ఈ స్టాక్‌ ట్రేడవుతోందని తెలిపారు. ఈ కంపెనీ ఏఎస్‌ఎఫ్‌డీఏ నుంచి చాలా వాటికి ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొన్నారు. సన్‌ ఫార్మా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ స్టాక్‌లో బుల్లిష్‌ ట్రెండ్‌ ఉందన్నారు. అయితే రానున్న కాలంలో మార్జిన్ల పెరుగుదలపై ఒత్తిడి ఉండొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం సన్‌ ఫార్మా, లుపిన్‌ స్టాక్స్‌ కన్నా అరబిందో ఫార్మా, సిప్లా, టొరెంట్‌ స్టాక్స్‌పై పాజిటివ్‌గా ఉన్నామని తెలిపారు. 
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌పై కూడా సన్‌ ఫార్మా ధోరణిలోనే ఉన్నామని అభిమన్యు పేర్కొన్నారు. ఈ కంపెనీ ఇది వరకు రష్యా మార్కెట్‌ నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొందని, చాలా ఎఫ్‌డీఏ అంశాలు పరిష్కామయ్యాయని తెలిపారు. అయితే ప్రస్తుతం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 
ఐటీ రంగంలో టెక్‌ మహీంద్రాపై బుల్లిష్‌గా ఉన్నామని అభిమన్యు తెలిపారు. టెలికం విభాగంలో వృద్ధి పుంజుకోనుందని పేర్కొన్నారు. 5జీపై కొత్త ఇన్వెస్ట్‌మెంట్లు ఇందుకు కారణమని తెలిపారు. అలాగే లార్జ్‌ క్యాప్స్‌లో ఇన్ఫోసిస్‌.. టీసీఎస్‌తో పోలిస్తే 30 శాతం డిస్కౌంట్‌లో ట్రేడవుతోందని పేర్కొన్నారు. రానున్న కాలంలో ఈ డిస్కౌంట్‌ అంతరం తగ్గొచ్చని తెలిపారు. అమెరికాలోని బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంలో మెరుగుదల ఐటీకి కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు. అందువల్ల రానున్న కాలంలోనూ ఈ రంగంపై ఓవర్‌వెయిట్‌తో ఉన్నామని తెలిపారు. 
స్వరాజ్‌ ఇంజిన్స్‌ స్టాక్‌ను ఎంపిక చేసుకోవచ్చని అభిమన్యు సిఫార్సు చేశారు. మహీంద్రా అండ్‌ మహీంద్రాకు ఇది ఇంజిన్లను సరఫరా చేస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే అంచనాలు సానుకూలమని తెలిపారు. రానున్న కాలంలో వృద్ధి అంచనాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. వ్యాల్యుయేషన్స్‌ పరంగా చూస్తే స్టాక్‌ ఆకర్షణీయంగా ఉందని తెలిపారు. వచ్చే ఏడాది కాలంలో ఈ స్టాక్స్‌ 20 శాతం దాకా రిటర్న్‌ ఇవ్వొచ్చని అంచనా వేశారు. అధిక డివిడెండ్‌ చెల్లింపులు, రుణ రహితంగా ఉండటం పాజిటివ్‌ అంశాలని పేర్కొన్నారు. You may be interested

క్షీణించిన ఫార్మా షేర్లు

Friday 24th August 2018

ముంబై:- ఇటీవల రూపాయి పతనంతో లాభాల ర్యాలీ చేసిన ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా నేడు ఫార్మా షేర్లు నష్టాల బాట పట్టాయి. ఫార్మా సూచీలోని హెవీవెయిటైజ్‌ షేర్లైన సిప్లా, సన్‌ఫార్మా షేర్లు 2శాతం క్షీణించడంతో ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 2శాతం వరుకు నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(10077)తో పోలిస్తే 1శాతం (100 పాయింట్లు) నష్టపోయి 9,971 పాయింట్ల వద్ద ట్రేడ్‌

ఎల్‌ఐసీ పోర్టుఫోలియోలో కీలక స్టాకులివే!

Friday 24th August 2018

అతిపెద్ద స్వదేశీ సంస్థాగత ఇన్వెస్టర్‌ ఎల్‌ఐసీ పోర్టుఫోలియోలో దాదాపు 344 కంపెనీలకు పైగా స్టాకులున్నాయి. ఆగస్టు 21 నాటికి ఎల్‌ఐసీ పోర్టుఫోలియో విలువ దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. వందల కొద్దీ కంపెనీల్లో ఎల్‌ఐసీకి ఒక శాతానికి మించిన వాటాకు సమానమైన షేర్లున్నాయి. అయితే ఎల్‌ఐసీ మొత్తం పోర్టుఫోలియోలో మూప్పాతిక శాతం వాటా కేవలం 25 బడా కంపెనీలదే కావడం విశేషం. ఎఫ్‌ఎంసీజీ, చమురు, ఐటీ, ఫైనాన్స్‌,

Most from this category