STOCKS

News


ఒక్కసారి మార్కెట్‌ను వీడితే అంతే!: శంకర్‌ శర్మ

Saturday 1st December 2018
Markets_main1543602873.png-22534

గత రెండు నెలల్లో ఈక్విటీల్లో అమ్మకాల ఒరవడి కొనసాగుతున్న తరుణంలో తన బ్యాంకు బ్యాలన్స్‌కు భారీ చిల్లు పడిందని, అటువంటి సందర్భాల్లో స్టాక్‌ మార్కెట్‌ను విడిచిపెడదామన్న ఆలోచన ప్రతీ ఒక్కరికీ వస్తుందని, తనకు సైతం వచ్చిందని ఏస్‌ ఇన్వెస్టర్‌, మార్కెట్‌ నిపుణుడు శంకర్‌ శర్మ అన్నారు. అయితే, కఠిన సందర్భాలు వచ్చి, పోతుండడం సహజమేనన్నారు. ఒక్కసారి మార్కెట్‌ను వీడితే తిరిగి రావడానికి మార్గం ఉండదన్నారు. ముంబైలో జరిగిన ఈటీ మార్కెట్స్‌ ప్రపంచ సదస్సులో శంకర్‌ శర్మ మాట్లాడారు. ఫస్ట్‌గ్లోబల్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ ముఖ్య వ్యూహకర్తగానూ శంకర్‌శర్మ పనిచేస్తున్నారు. 30-40 శాతం నష్టాలకు స్టాక్‌ మార్కెట్లో సిద్ధపడకపోతే, ఈ ఆటకు మీరు తగినవారు కాదన్నారు. మరో దాన్ని ఎంచుకోవాలని సూచించారు. 

 

‘‘100 శాతం రాబడి అన్నది నైపుణ్యం. 1,000 శాతం రాబడి అనేది అదృష్టం. నైపుణ్యం లేనివారు 20 స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే ఒక్కటి సరైనది అవుతుంది’’ అని శంకర్‌ శర్మ తన ఇన్వెస్టింగ్‌ అనుభవాలను తెలిపారు. 1980ల నుంచి శర్మ దేశీయ మార్కెట్లలో ఇన్వెస్టర్‌గా  ఉన్నారు. పెట్టుబడిలో 60 శాతం సక్సెస్‌ రేటు ఉంటే తాను సంతోషిస్తానని చెప్పారు. విచారించడమనే దానికి దూరంగా ఉండాలన్నారు. అధ్యయనం అన్నది ఆర్జనకు దారితీస్తుందన్న ఆయన, తన ఇంట్లో పెట్టుబడికి సంబంధించిన 2,000 పుస్తకాలు ఉన్నట్టు చెప్పారు. ఇన్ఫోసిస్‌ షేర్లను షార్ట్‌ చేయడం ద్వారా ఒకప్పుడు తాను సైతం నష్టపోయినట్టు చెప్పారు. స్టాక్‌ మార్కెట్‌ను విడిచి పెట్టి వెళ్లాలని చాలా తీవ్రంగా ఆలోచించిన సందర్భం అది కూడా ఒకటన్నారు. ‘‘ఇప్పుడు నేను ట్రేడ్‌ చేయను. కానీ, 15 ఏళ్ల క్రితం నేను ట్రేడ్‌ మాత్రమే చేసేవాడిని’’ అని శర్మ తెలిపారు. 

 

తాను ఇన్వెస్ట్ చేసేప్పుడు స్టాక్‌ వ్యాల్యూషన్‌ చూడనని, ఏ స్థాయిలోనయినా సహేతుకమేనని చెప్పొచ్చన్నారు. ‘‘స్టాక్‌ ఇన్వెస్టింగ్‌లో నాకంటూ హీరో ఎవరూ లేరు. ఎవరూ కూడా అసాధారణ తెలివితేటలు కలిగి లేరు. స్టాక్స్‌లో డబ్బులు సంపాదించాలంటే అదృష్టం ఉండాలి. స్టాక్‌ ఇన్వెస్టింగ్‌కు రిటైర్మెంట్‌ లేదు. జీవితంలో ఇదో మజిలీ లాంటిది. వయసుతోపాటు పెరుగుతూ ఉంటుంది’’ అని శర్మ పేర్కొన్నారు. ఎవరికివారు తమ జీవనశైలిని పోలిన ఇన్వెస్టింగ్‌ శైలిని పాటించాలే కానీ, ఇతరులు చెప్పేదాన్ని పట్టించుకోరాదన్నారు. మంచి స్టాక్స్‌ బేర్‌మార్కెట్లో 30-40 శాతం మధ్యే పతనం అవుతాయని, అందుకే మారుతి సుజుకి మంచి బెట్‌గా పేర్కొన్నారు.



You may be interested

మూడేళ్లలో 15 శాతం... పదేళ్లలో 25 శాతం...?

Saturday 1st December 2018

వార్షికంగా 15 శాతం రాబడులను పదేళ్ల కాలంలో ఇచ్చిన మ్యూచువల్‌ ఫండ్‌ పథకం ఒకటి. వార్షికంగా 25 శాతం చొప్పున రాబడులను అందించినది మరో పథకం. మరి ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి? అన్న సందేహం ఇన్వెస్టర్లకు రావడం సహజం. నిజానికి ఈ రెండింటిలో రెండో పథకం పనితీరు ఆచరణ సాధ్యమే. కానీ, మొదటి పథకం పనితీరు దీర్ఘకాలానికి చూడాల్సి ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు వార్షికంగా 15 శాతం

పీఈ మల్టిపుల్‌ డీరేటింగ్‌ జరగొచ్చు..!

Friday 30th November 2018

చైనా ఆర్థిక వ్యవస్థ రికవరీ సాధించడంలో విఫలమైతే అభివృద్ధి చెందున్న దేశాల మార్కెట్లకు రిస్క్‌ తప్పదని ఎమర్జింగ్‌ ఈక్విటీ మార్కెట్‌ ఫండ్‌ ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌ అడ్రియన్ మోవట్‌ వ్యాఖ్యానించారు. భారత మార్కెట్లలో ఫార్వార్డ్‌ మల్టీపుల్స్‌ ప్రస్తుతం అధికస్థాయిలో ఉన్నాయన్న ఆయన ప్రస్తుత ఏడాదిలో పీఈ మల్టిపుల్‌ డీరేటింగ్‌కు జరగవచ్చని అంచనావేశారు. ఎమర్జింగ్‌ మార్కెట్ల కరెన్సీల విలువలు రికవరీ బాట పడతాయని, వచ్చే ఏడాదిలో ఇది ప్రధాన అంశంగా ఉండనుందన్నారు. అంతర్జాతీయ

Most from this category