STOCKS

News


స్టాక్‌ ఎంపికకు మార్కెట్‌ క్యాప్‌తో పనేంటి?

Tuesday 10th July 2018
Markets_main1531247147.png-18192

మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఈ ఏడాది ధరల పరంగా ఎక్కువ దిద్దుబాటుకు గురయ్యాయి. అంతకుముందు వరుసగా మూడేళ్ల పాటు ఇవి భారీ ర్యాలీ చేశాయి మరి. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ అంశాలు, కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం, ఎఫ్‌ఐఐల అమ్మకాలు ఇలా ఎన్నో అంశాలు కరెక్షన్‌ వెనుక ఉన్నాయి. కొనుగోలుకు మంచి అవకాశంగా భావించిన మార్కెట్‌ పార్టిసిపెంట్స్‌ మాత్రం బాగా పడిపోయిన స్మాల్‌, క్యాప్‌ స్టాక్స్‌లో విలువైన వాటి కోసం అన్వేషిస్తున్నారు. అయితే, సీనియర్లు మాత్రం మార్కెట్‌ వ్యాల్యూషన్‌ అన్నది కేవలం స్థితిని మాత్రమే సూచిస్తుందని, మంచి స్టాక్‌ ఎంపికకు మార్కెట్‌ క్యాప్‌ను చూడక్కర్లేదంటున్నారు.  

 

‘‘సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉన్నప్పటికీ... స్మార్ట్‌ ఇన్వెస్టర్లు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగంలో విలువైన వాటి కోసం అన్వేషించడం మొదలైంది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో సంబంధం లేకుండా స్టాక్‌ను ఎంచుకోవడం దీర్ఘకాలానికి మెరుగైన విధానం’’ అని ప్రముఖ ఇన్వెస్టింగ్‌ నిపుణుడు పొరింజు వెలియాత్‌ పేర్కొన్నారు. ఇక మిడ్‌క్యాప్‌ విభాగంలో పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సేవల్లోకి (పీఎంఎస్‌) పెట్టుబడులను తీసుకోవడం ప్రారంభించినట్టు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఏఎంసీ ఎండీ ఆశిష్‌ సోమానియా తెలిపారు. ఆరు నెలల క్రితంలో పోలిస్తే స్టాక్స్‌ విలువలు ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది అత్యంత దారుణంగా పతనమైన స్టాక్స్‌ను గమనిస్తే వాటిలో వక్రంగీ, డైమండ్‌ పవర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, కేఎస్‌కే ఎనర్జీ, క్వాలిటీ లిమిటెడ్‌ ఉన్నాయి. ఇక, ఎక్సెల్‌ ఇండస్ట్రీస్‌, విమార్ట్‌ రిటైల్‌, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌, మెర్క్‌, ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌ ఈ ఏడాది ఇప్పటి వరకు 103 శాతం వరకు ర్యాలీ చేయడం విశేషం. 

 

దీర్ఘకాలంలో మంచి రాబడులు...
‘‘ప్రతికూల పరిస్థితులు స్మాల్‌ క్యాప్‌, మిడ్‌క్యాప్‌ షేర్లు 25-30 శాతం మేర పడిపోవడానికి కారణం. కొన్ని స్టాక్స్‌ 50 శాతం వరకూ దిద్దుబాటుకు గురయ్యాయి. ‘ఓ గొర్రె ఎటు వెళితే మిగిలిన గొర్రెలు కూడా అటే వెళ్లినట్టు’ అదే తరహా పరిస్థితుల్లో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో మంచివి కూడా సహేతుక స్థాయికి పడిపోయాయి. ఇవి అధిక రాబడులను ఇవ్వగలవు’’ అని శామ్కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమీత్‌మోదీ తెలిపారు. ‘‘విలువలు తగ్గుముఖం పట్టనంత వరకు ఈ సమయంలో ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌పై ఎక్కువగా ఆధారపడడం మంచిది కాదు. మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో మంచి దిద్దుబాటు జరిగినప్పటికీ లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌తో పోలిస్తే ఇవి మెరుగైన స్థితిలో ఉన్నాయని నేను భావించడం లేదు’’ అని బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ సంపత్‌రెడ్డి తెలిపారు.You may be interested

టాటా  మోటార్స్‌ మళ్లీ వెలిగిపోతుంది: అగర్వాల్‌

Tuesday 10th July 2018

టాటా మోటార్స్‌ స్టాక్‌ ఈ ఏడాది 40 శాతం తగ్గిపోయింది. టాటా గ్రూపులో భాగమైన ఈ బ్లూచిప్‌ కంపెనీ ఇలా పడిపోవడంతో చాలా మందికి భవిష్యత్తుపై సందేహాలు తలెత్తాయి. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి వారిలో ఉంది. అయితే, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సహ వ్యవస్థాపకుడు రామ్‌దియో అగర్వాల్‌ మాత్రం టాటా మోటార్స్‌ పతనం కేవలం ధరల పరంగా జరిగిందేనని, దాని అంతర్గత విలువ తగ్గిపోవడం వల్ల

మన్‌పసంద్‌ బేవరేజేస్‌లో తగ్గిన విదేశీ ఇన్వెస్టర్ల వాటా

Tuesday 10th July 2018

న్యూఢిల్లీ: మన్‌పసంద్‌ బేవరేజేస్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) తమ వాటాను తగ్గించుకున్నాయి.. ఈ ఏడాది మార్చి నాటికి 21.56 శాతంగా ఉన్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)ల వాటా ఈ ఏడాది జూన్‌ నాటికి 13.35 శాతానికి తగ్గింది. నొముర గ్రూప్‌ 4.86 శాతం వాటాను, పార్వెస్ట్‌ ఈక్విటీ 1.07 శాతం వాటాను విక్రయించడం ద్వారా మన్‌పసంద్‌ బేవరేజేస్‌ నుంచి వైదొలిగాయి. మరో ఎఫ్‌పీఐ సంస్థ, ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఫండ్‌

Most from this category