STOCKS

News


పెట్టుబడులకు భారత్‌ గొప్ప మార్కెట్‌

Friday 30th November 2018
Markets_main1543574040.png-22532

మూడు నుంచి ఐదేళ్లు లేదా దీర్ఘకాలంలో ఇన్వెస్ట్‌మెం‍ట్లకు భారత్‌ గొప్ప మార్కెట్‌ అని ఐఐఎఫ్‌ఎల్‌ చైర్మన్‌, ఫౌండర్‌ నిర్మల్‌ జైన్‌ తెలిపారు. చాలా మంది ఇన్వెస్టర్లు భారత్‌ మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరించారని పేర్కొన్నారు. వ్యాల్యుయేషన్స్‌, స్థిరత్వం వంటి వాటి రూపంలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. 
ఇండియన్‌ మార్కెట్లు 2014 నుంచి మంచి పనితీరు కనబరుస్తున్నాయని నిర్మల్‌ జైన్‌ పేర్కొన్నారు. ఒకటి లేదా రెండు త్రైమాసికాల వరకు ఒడిదుడుకులు ఉంటాయని, వీటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే దీర్ఘకాలంలో చూస్తే భారత్‌ పెట్టుబడులకు గొప్ప మార్కెట్‌ అని పేర్కొన్నారు. స్టాక్‌ మార్కెట్‌ పనితీరు, దేశ ఆర్థిక వ్యవస్థపై బుల్లిష్‌గా ఉన్నానని తెలిపారు. ఇటీవలి కరెక‌్షన్‌ కారణంగా వ్యాల్యుయేషన్స్‌ ఆమోదయోగ్యంగా మారాయని పేర్కొన్నారు. దీర్ఘకాల ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశమని, ఈక్విటీ అసెట్స్‌లో వెయిటేజీ పెంచుకోవచ్చని సూచించారు. అంతర్జాతీయ పరిస్థితులు, దేశీ రాజకీయ అంశాలు కొంత కాలమే ప్రభావం చూపుతాయని తెలిపారు.
మొండి బకాయిలు నుంచి బయట పడటానికి, స్థిర వృద్ధికి బ్యాంకులు మూలధనం కోసం ఎదురు చూస్తున్నాయని నిర్మల్‌ జైన్‌ పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం మళ్లీ అధికారంలో వస్తే పీఎస్‌యూ బ్యాంకులు వృద్ధి చెందోచ్చని తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీ రంగం కూడా ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అయితే ఇటీవలి పరిణామాలు మేలు కొలుపు లాంటివని తెలిపారు. అయితే పరిస్థితులు సద్దుమణిగాక నాణ్యమైన కంపెనీలు మంచి పనితీరు కనబరుస్తాయని పేర్కొన్నారు. ఇక ప్రైవేట్‌ రంగ బ్యాంకులు మంచి పనితీరు చూపుతున్నాయని తెలిపారు. 
క్యాపిటల్‌ గూడ్స్‌ రంగం వైవిధ్యమైనదని నిర్మల్‌ జైన్‌ పేర్కొన్నారు. ఇందులో ఎంఎన్‌సీలు, దేశీ కంపెనీలు ఉన్నాయని, అలాగే ఉప-విభాగాలున్నాయని తెలిపారు. కొన్నింటికి దిగుమతిదారుల నుంచి పోటీ ఉంటుందని, కొన్నింటికి దేశీయంగా డిమాండ్‌ ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల ఈ రంగంపై ఒక అభిప్రాయాన్ని వ్యక్తీకరించలేమని తెలిపారు. అయితే ఇందులోనూ మంచి కంపెనీలు, నాణ్యమైన స్టాక్స్‌ ఉన్నాయని పేర్కొన్నారు. 
గ్లోబల్‌ ఫండ్స్‌ భారత్‌ మార్కెట్‌పై జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని నిర్మల్‌ జైన్‌ తెలిపారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు సమయంలో చాలా వరకు ఫండ్స్‌ అమెరికాకు వెళ్లిపోయాయని గుర్తు చేశారు. అమెరికా, చైనా సహా ఇతర దేశాల్లో ఏం జరుగుతోందో ఈ ఫండ్స్‌ గమనిస్తుంటాయని, అలాగే దేశీయంగా చోటుచేసుకుంటోన్న అంశాలకు ప్రాధాన్యమిస్తాయని తెలిపారు. చాలా మంది విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌లో జరుగుతోన్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. You may be interested

పీఈ మల్టిపుల్‌ డీరేటింగ్‌ జరగొచ్చు..!

Friday 30th November 2018

చైనా ఆర్థిక వ్యవస్థ రికవరీ సాధించడంలో విఫలమైతే అభివృద్ధి చెందున్న దేశాల మార్కెట్లకు రిస్క్‌ తప్పదని ఎమర్జింగ్‌ ఈక్విటీ మార్కెట్‌ ఫండ్‌ ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌ అడ్రియన్ మోవట్‌ వ్యాఖ్యానించారు. భారత మార్కెట్లలో ఫార్వార్డ్‌ మల్టీపుల్స్‌ ప్రస్తుతం అధికస్థాయిలో ఉన్నాయన్న ఆయన ప్రస్తుత ఏడాదిలో పీఈ మల్టిపుల్‌ డీరేటింగ్‌కు జరగవచ్చని అంచనావేశారు. ఎమర్జింగ్‌ మార్కెట్ల కరెన్సీల విలువలు రికవరీ బాట పడతాయని, వచ్చే ఏడాదిలో ఇది ప్రధాన అంశంగా ఉండనుందన్నారు. అంతర్జాతీయ

స్వల్పలాభాలతో ముగింపు..!

Friday 30th November 2018

ఆరంభలాభాల్ని హరించిన బ్యాంక్‌, మెటల్‌ షేర్లు ఫార్మా, ఐటీ, అటో షేర్ల అండతో సూచీలు వరుసగా ఐదోరోజూ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 24 పాయింట్ల లాభంతో 36,194 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 10,877 వద్ద ముగిశాయి. ముడిచముర ధరల పతనం, రూపాయి ర్యాలీ కారణంగా మార్కెట్‌ మిడ్‌సెషన్‌ వరకు ర్యాలీ చేసింది. మిడ్‌సెషన్‌ నుంచి నెలకొన్న అమ్మకాలతో సూచీలు ఆరంభ లాభాలను నిలుపుకోవడంలో విఫలయ్యాయి. ముఖ్యంగా నిఫ్టీ 10900 పాయింట్ల

Most from this category