STOCKS

News


మోదీ మళ్లీ వస్తే నిఫ్టీ@ 13,000!

Saturday 23rd March 2019
Markets_main1553333198.png-24770

ఇండియా బుల్స్‌ వెంచర్స్‌ అంచనా
మార్కెట్లో నెలకొన్న పాజిటివ్‌ సెంటిమెంట్‌ ఏడాది మొత్తం కొనసాగవచ్చని ఇండియా బుల్స్‌ వెంచర్స్‌ అనలిస్టు ఫొరమ్‌ పరేఖ్‌ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలకు ముందే నిఫ్టీ 12 వేల పాయింట్లను తాకవచ్చని, ఒకవేళ ఎన్నికల్లో ప్రస్తుత అధికార పక్షం మరలా గెలిస్తే నిఫ్టీ 13వేల పాయింట్లను చేరవచ్చని అంచనా వేశారు. ప్రస్తుత ర్యాలీ మోదీ ప్రభుత్వం భారీ విజయం సాధిస్తుందన్న అంచనాలను డిస్కౌంట్‌ చేస్తోందన్నారు. ఈ ఏడాది ఎర్నింగ్స్‌లో రికవరీ, వడ్డీరేట్ల తగ్గింపు లాంటి కారణాలు మార్కెట్లను పాజిటివ్‌గా ఉంచుతాయన్నారు. గతేడాది హైబీటా స్టాకుల్లో భారీ పతనం వచ్చిందని, దీంతో అల్ప బీటా, అధిక బీటా స్టాకుల మధ్య అంతరం పెరిగిందని చెప్పారు. డీబీ కార్‌‍్ప, బిర్లా కార్‌‍్ప, కేఈఐ ఇండస్ట్రీస్‌ లాంటి స్టాకులు ప్రస్తుతం ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉన్నాయన్నారు. ఈ కంపెనీల ఎర్నింగ్స్‌ సైతం మెరుగుపడ్డాయని చెప్పారు. అందువల్ల ఇలాంటి స్టాకులను పోర్టుఫోలియోలో చేర్చుకోవాలని సూచించారు. కంపెనీల ఎర్నింగ్స్‌ ఒక్కో త్రైమాసికానికి మెరుగుపడుతున్నాయని పరేఖ్‌ చెప్పారు. అయితే బడ్జోట్లో ప్రవేశ పెట్టిన నిర‍్ణయాలు కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచిచూడాల్సిఉందన్నారు.

ఎర్నింగ్స్‌లో మెరుగుదల లేకపోతే ఎంత పెద్ద ర్యాలీఅయినా ఒక్కమారుగా చల్లారిపోతుందని, ఎర్నింగ్స్‌ క్రమంగా పురోగమిస్తుంటో ర్యాలీ కూడా ముందుకు సాగుతుందని వివరించారు. ఉదాహరణకు గతేడాది అనేక స్టాకులు బేర్స్‌ పట్టులో విలవిల్లాడుతుంటే ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, బాటా ఇండియా లాంటి షేర్లు మాత్రం కొత్త గరిష్ఠాలను చూశాయని, ఇందుకు వాటి ఎర్నింగ్స్‌ బాగుండడమే కారణమని తెలిపారు. లిక్విడిటీ ఆధారిత ర్యాలీలు స్వల్పకాలమే ఉంటాయన్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో దీర్ఘకాలిక ర్యాలీనే కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. You may be interested

2శాతం పతనమైన అమెరికా మార్కెట్లు

Saturday 23rd March 2019

అంతర్జాతీయ వృద్ధి మందగమన ఆందోళనలు, బలహీన ఆర్థిక గణాంకాలు అమెరికా మార్కెట్లపై నెగిటివ్‌ ప్రభావం చూపాయి. ఫలితంగా ఈ దేశ ప్రధాన సూచీలు శుక్రవారం రాత్రి 2శాతానికిపైగా నష్టపోయాయి. అమెరికా, యూరప్‌ దేశాల్లో వెలువడిన బలహీన ఆర్థిక గణాంకాల నేపథ్యంలో అమెరికా 10ఏళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 10బేసిస్‌ పాయింట్లు నష్టపోయి 2.439 శాతం స్థాయికి పతనమైంది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఏవరేజ్‌ ఇండెక్స్‌ 460 పాయింట్లు నష్టపోయి 25,502 వద్ద, ఎస్‌ అండ్‌ పీ

చల్లారుతున్న క్రూడ్‌ ధర

Saturday 23rd March 2019

ఆర్థిక వృద్ధి మందగమన భయాలతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధర మరో రెండు శాతం పతనమైంది. యూఎస్, చైనా ట్రేడ్‌ చర్చల్లో పురోగతి లేకపోవడం, జర్మనీ ఉత్పత్తి డేటా పేలవంగా ఉండడం, గ్లోబల్‌ ఎకానమీ నెమ్మదిస్తోందన్న ఫెడ్‌ అంచనాలు.. చమురు ధరలపై ‍ప్రభావం చూపాయి. దీంతో శుక్రవారం యూఎస్‌ సూచీలు సైతం భారీ నష్టాలను నమోదు చేశాయి. వారం ముగింపు వేళ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 67.30 డాలర్ల వద్ద

Most from this category