STOCKS

News


మోదీ తక్కువ మెజారిటీతో వస్తే మార్కెట్‌కు ఇబ్బందే: శర్మ

Tuesday 26th February 2019
Markets_main1551122499.png-24325

రానున్న నెలల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు ఎన్నికలు పెద్ద అనిశ్చితి అంశంగా ప్రముఖ ఇన్వెస్టర్‌, ఫస్ట్‌ గ్లోబల్‌ జాయింట్‌ ఎండీ శంకర్‌ శర్మ పేర్కొ‍న్నారు. ఎన్నికలతో ముడిపడి ఉన్న రిస్క్‌ను ఇన్వెస్టర్లు నిర్లక్ష్యం చేయడానికి లేదన్నారు. ‘‘ఇది చాలా పెద్ద కార్యక్రమం. దీని ప్రాధాన్యతను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. మార్కెట్‌పై చాలా పెద్ద ప్రభావం చూపించే అంశం. గత ఎన్నికల్లో ప్రచారం ప్రారంభించినప్పుడు అంతా అనుకూలంగా ఉంది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు’’అని శంకర్‌ శర్మ అన్నారు. 

 

ప్రస్తుత ప్రభుత్వమే బలహీన గణాంకాలతో (సంకీర్ణం) అధికారంలోకి రావచ్చని, దీన్ని మార్కెట్లు నచ్చకపోవచ్చన్నారు. ఏం జరుగుతుందన్న దానిపై సంకేతం లేదంటూనే... మార్కెట్లపై మాత్రం పెద్ద ప్రభావమే ఉంటుందన్నారు. ఇటీవలి కరెక్షన్‌తో మిడ్‌క్యాప్స్‌ బోటమ్‌ అవుట్‌ అయ్యాయని చెప్పడం కష్టమేనన్నారు. అమ్మకాల ఒత్తిడి సూచీలపై కనిపించలేదని, కానీ, మిగతా మార్కెట్‌ అంతటా ఈ నష్టాలు ఎక్కువే ఉన్నాయని చెప్పారు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి వరకు అర శాతం నష్టపోగా, మిడ్‌క్యాప్‌ 8 శాతం, స్మాల్‌క్యాప్‌ 8 శాతానికి పైగా నష్టపోయాయన్నారు. ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీలు, ఆటోరంగ కంపెనీలు అంత ఆకర్షణీయంగా లేవని అభిప్రాయపడ్డారు. ఎన్‌బీఎఫ్‌సీలను తాను గతంలోనూ నమ్మని విషయాన్ని ప్రస్తావించారు. ‘‘ప్రస్తుతం వాటిని చూసినట్టయితే చాలా ఎక్కువగా దిద్దుబాటుకు లోనయ్యాయి. హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకూ (సెక్యూర్డ్‌ విధానంలో నడిచేవి) నష్టాలే. కానీ, బోటమ్‌ ఎక్కడో తెలియడం లేదు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో ఇదే సమస్య’’ అని శర్మ పేర్కొన్నారు. ఆటోమొబైల్‌ రంగంలో మారుతి సుజుకీ పట్ల ఇప్పటి వరకు ఎంతో కాలంగా సానుకూలంగా ఉన్నప్పటికీ వాటి ఫలితాలు బుల్లిష్‌గా భావించేందుకు అనుకూలంగా లేవన్నారు. టాటా మోటార్స్‌ విషయానికొస్తే... మార్కెట్లో పోటీనిచ్చేందుకు సరిపడా నిధుల్లేవని తెలిపారు. కంపెనీ మోడళ్లు సైతం పాతబడినవేనని, టెక్నాలజీకి కాలం చెల్లిందన్నారు. కనుక పెద్ద ఎత్తున మూలధన నిధులు అవసరం ఉంటుందన్నారు. బ్రెగ్జిట్‌ ఆచరణలోకి వచ్చినా, చైనా తిరిగి పెద్ద చోదకంగా (జేఎల్‌ఆర్‌కు) ఉంటుందని చెప్పడం కష్టమేనని, కాకపోతే మంచి యాజమాన్యం కావడంతో ఎప్పుడో అప్పుడు గాడిలో పెడతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.You may be interested

భారీ నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Tuesday 26th February 2019

భారత్‌, పాకిస్తాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న ఉద్రికత్త వాతవరణానికి తోడు ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌తో మంగళవారం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ తీవ్ర నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఉదయం గం.8:45లకు ఇండెక్స్‌ 83.50 పాయింట్ల భారీ నష్టంతో 10809.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి  10887.05 పాయింట్లతో పోలిస్తే 88 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతిఘటనగా భారత వైమానిక

10 బీఎస్‌ఈ కంపెనీల నికర లాభం రెట్టింపు

Tuesday 26th February 2019

డిసెంబర్‌ త్రైమాసికం ఫలితాల సీజన్‌ ముగిసింది. నిఫ్టీ-50 విక్రయాలు, ఎబిట్డా, పన్ను అనంతరం లాభాలు 19 శాతం, 2.3 శాతం, ఒక శాతం చొప్పున పెరిగాయి. ముఖ్యంగా లాభాల్లో త్రైమాసికం వారీగా, వార్షికంగా మంచి పనితీరు చూపించిన స్టాక్స్‌ కొన్ని ఉన్నాయి. అవి ఏసీసీ, యాక్సిస్‌ బ్యాంకు, బీఈఎంఎల్‌, భారత్‌ డైనమిక్స్‌, గుజరాత్‌ గ్యాస్‌, ఐనాక్స్‌ లీజర్‌, షాపర్స్‌ స్టాప్‌, సుందరం క్లేటాన్‌. మరి ఈ స్టాక్స్‌ను ప్రస్తుత సమయంలో

Most from this category