STOCKS

News


ఈక్విటీల్లో కాకపోతే.. మరెక్కడ?

Monday 15th October 2018
Markets_main1539589328.png-21162

ఇన్వెస్టర్లు ఇప్పుడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌, బంగారం వంటి సంప్రదాయ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధానాల్లో ఇన్వెస్ట్‌ చేయాలా? లేక ఈక్విటీ మార్కెట్లలోనే పెట్టుబడులను కొనసాగించాలా? అని నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. స్వల్ప కాలం నుంచి మధ్యస్థ కాలంలో ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ఉంటాయనే అంచనాలున్నాయి. దేశీ ఈక్విటీ ఇండెక్స్‌లు ఇటీవల కాలంలో బాగా కరెక‌్షన్‌కు గురయ్యాయి. క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి క్షీణత, అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి డబ్బుల్ని వెనక్కు తీసుకెళ్లడం వంటి అంశాలు ఇందుకు ప్రధాన కారణం. ఆగస్ట్‌ 31-అక్టోబర్‌ 12 మధ్యకాలంలో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌, నిఫ్టీ దాదాపు 11 శాతంమేర పడిపోయాయి. 
‘గత నెలన్నర కాలంలో ఇండియన్‌ మార్కెట్‌ నుంచి సగభాగం పార్టిసిపెంట్లు బయటకు వచ్చేశారు. జూలై-ఆగస్ట్‌ నాటి గరిష్ట స్థాయిల నుంచి చూస్తే బ్యాంక్‌ నిఫ్టీ, నిఫ్టీ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ దాదాపు 40 శాతంమేర క్షీణించింది’ అని శామ్కో సెక్యూరిటీస్‌ ఫౌండర్‌, సీఈవో జిమీత్‌ మోదీ తెలిపారు.
ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు కొందరు ప్రస్తుత ఏడాది ఈక్విటీ ప్రత్యామ్నాయ సాధనాలకు ప్రాధాన్యమివ్వడం ఉత్తమమని సూచిస్తున్నారు. ‘బంగారం ఈ ఏడాది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. వచ్చే 6-8 నెలల కాలంలో బంగారం ధర ఔన్స్‌కు 1,350 డాలర్లకు చేరొచ్చు’ అని నిర్మల్‌ బ్యాంగ్‌ కమోడిటీస్‌ హెడ్‌ (కమోడిటీస్‌ విభాగం) కునాల్‌ షా తెలిపారు. అమెరికా మార్కెట్‌ గత ఆరు నెలలుగా పెరుగుతూ వస్తోందన్నారు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, బలమైన జీడీపీ వృద్ధి రేటు ఇందుకు కారణమని తెలిపారు. ‘సీఎంఈలోని బులియన్‌లో రికార్డ్‌ షార్ట్‌ పొజిషన్‌ ఉంది. గోల్డ్‌కు ఇన్వెస్ట్‌మెంట్‌ డిమాండ్‌ రానున్న రోజుల్లో పెరగొచ్చు. అందువల్ల బంగారంలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు’ అని పేర్కొన్నారు. భారత్‌లో బంగారం ధరలు రానున్న రోజుల్లో రూ.35,000 స్థాయికి చేరొచ్చని అంచనా వేశారు. 
ఈ ఏడాది ఇప్పటి దాకా క్రూడ్‌ ధరలు 35 శాతంమేర పెరిగాయని ఎస్‌ఎంసీ కామ్‌ట్రేడ్‌ కమోడిటీ రీసెర్చ్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వందన భారతీ తెలిపారు. ధరలు మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. కాపర్‌ ధరలు రూపాయి పరంగా చూస్తే నిలకడగానే ఉన్నాయని తెలిపారు. దీనికి కూడా ప్రాధాన్యమివ్వొచ్చని పేర్కొన్నారు. కాపర్‌ ధర కిలోకి రూ.465కు చేరొచ్చని అంచనా వేశారు. క్రూడ్‌ ధర రూ.5,450-5,500 స్థాయికి పెరగొచ్చని తెలిపారు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్స్‌, అల్ట్రా షార్ట్‌ లేదా తక్కువ కాలపరిమితి ఉన్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఉత్తమమని కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐవో (ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ విభాగం) లక్ష్మీ అయ్యర్‌ తెలిపారు.
క్రూడ్‌ ధరల పెరుగుదల, స్థూల ఆర్థికాంశాలు బలహీన పడటం కారణంగా బాండ్‌ ఈల్డ్స్‌ పెరిగాయని అనలిస్ట్‌లు పేర్కొన్నారు. డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే.. ఈల్డ్స్‌ పెరగడం వల్ల ప్రయోజనం పొందొచ్చన్నారు. కార్పొరేట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్స్‌ కూడా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. అయితే ఎన్‌బీఎఫ్‌సీల్లో లిక్విడిటీ సమస్య వల్ల ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వంటి కంపెనీలు మూడేళ్ల డిపాజిట్లకు 8.7 శాతం వరకు వడ్డీ అందిస్తున్నాయని గుర్తుచేశారు. అయితే ఈ డిపాజిట్లకు ఎలాంటి హామీ ఉండదని హెచ్చరించారు. కంపెనీలు డిఫాల్ట్‌ అయితే అంతే సంగతి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.
స్వల్ప కాలం నుంచి మధ్యస్థ కాలంలో ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ఉంటాయనే అంచనాలు ఉన్నప్పటికీ కొందరు అనలిస్ట్‌లు మాత్రం ఈక్విటీ మార్కెట్లకే ఓటేస్తున్నారు. మార్కెట్లు బాగా కరెక‌్షన్‌ గురైనప్పటికీ ఇంకా ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించవచ్చని సలహా ఇస్తున్నారు. మార్కెట్లు పడిపోయినప్పుడు నాణ్యమైన స్టాక్స్‌ ఆకర్షణీయమైన ధరలకు అదుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇలాంటప్పుడే రిస్క్‌-రివార్డ్‌ రేషియో ఆమోదయోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. రూపాయి పతనం ఆగిపోయి, క్రూడ్‌ ధరలు తగ్గితే.. అప్పుడు మార్కెట్లు మళ్లీ బౌన్స్‌బ్యాక్‌ అవుతాయని తెలిపారు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి రిస్క్‌-రివార్డ్‌ రేషియో చాలా ఆమోదయోగ్యంగా ఉందని ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ లవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. దీర్ఘకాల లక్ష్యంతో ఎక్కువ కాలంపాటు నాణ్యమైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే రిస్క్‌ ఉండదని ల్యాడరప్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఎండీ రాఘవేంద్ర నాథ్‌ తెలిపారు. ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో స్టాక్స్‌ కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రిధమ్‌ దేశాయ్‌ పేర్కొన్నారు. You may be interested

అలీబాబా-జొమాటొ డీల్‌.. ఇన్ఫో ఎడ్జ్‌ 6% జంప్‌..

Monday 15th October 2018

ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా షేరు సోమవారం ఇంట్రాడేలో ఏకంగా 6 శాతంమేర ర్యాలీ చేసింది. నిధుల సమీకరణకు సంబంధించి జొమాటొ-అలీబాబా మధ్య ఒప్పందం కుదరడం ఇందుకు ప్రధాన కారణం. గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ.. ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా స్టాక్‌పై ఓవర్‌ వెయిట్‌తో ఉంది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,900గా నిర్ణయించింది. అంటే దాదాపు 28 శాతం అప్‌సైడ్‌ ఉంటుందని పేర్కొంది. తాజా ఇన్వెస్ట్‌మెంట్‌ డీల్‌తో కలుపుకుంటే జొమాటొలో అలీబాబా

‘పొదుపు’ మళ్లీ కళకళ!

Monday 15th October 2018

వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ కళొచ్చింది. సామాన్యుల పొదుపు సాధనాలుగా వర్ధిల్లిన ఈ పథకాలు నాలుగేళ్లుగా వడ్డీ రేట్ల క్షీణతతో కాస్తంత కళ తప్పాయనే చెప్పాలి. అయినప్పటికీ బ్యాంకులతో పోలిస్తే గతంలోనూ, ఇప్పుడు కూడా కాస్తంత ఎక్కువ రాబడి వస్తున్నది చిన్న మొత్తాల పొదుపు పథకాల్లోనేనని నిస్సందేహంగా చెప్పుకోవాలి. అయితే, దేశంలో తిరిగి వడ్డీ రేట్లు పెరుగుతున్న వాతావరణం నెలకొంది. ఫలితంగా... అక్టోబర్‌ 1

Most from this category