STOCKS

News


ఎర్నింగ్స్‌ బాగుంటే.. రిలీఫ్‌ ర్యాలీ!!

Tuesday 9th October 2018
Markets_main1539069928.png-20975

కంపెనీల ఎర్నింగ్స్‌ బాగుంటే మార్కెట్‌లో రిలీఫ్‌ ఉంటుందని సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ జగనాథం తునుగుంట్ల తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. రూపాయి పతనం వల్ల ఐటీ, ఫార్మా కంపెనీలు ఏమేరకు ప్రయోజనం పొందాయనే విషయాన్ని త్వరలో చూడబోతున్నామని తెలిపారు. రెండు విభాగాలు బాగానే ర్యాలీ చేశాయని పేర్కొన్నారు. రూపాయి క్షీణత వల్ల ఈ కంపెనీల ఈపీఎస్‌ వృద్ధిపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనని మార్కెట్‌లో ఇప్పటికే అధిక అంచనాలున్నాయని తెలిపారు. ఇది పాజిటివ్‌గా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మిగతా కంపెనీల విషయానికి వస్తే క్రూడ్‌ ధరల పెరుగుదల వల్ల వాటి ఆదాయంలో ఏమేర పెరుగుదల ఉంటుందో చూడాల్సి ఉందన్నారు. అధిక క్రూడ్‌ ధరల వల్ల ప్రాఫిట్‌ మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. మార్కెట్‌కు ప్రస్తుత ఎర్నింగ్స్‌ సీజన్‌ చాలా కీలకమని పేర్కొన్నారు. ఇప్పటికే మార్కెట్లు బాగా పడిపోయాయన్నారు. ఎర్నింగ్స్‌ బాగుంటే మార్కెట్‌లో రిలీఫ్‌ ర్యాలీ ఉంటుందని తెలిపారు. రానున్న కాలంలో ఆర్థిక వృద్ధి, జీడీపీ వృద్ధి, కార్పొరేట్‌ వృద్ధి ఎలా ఉంటుందో చూడబోతున్నామని పేర్కొన్నారు. 
ఎన్‌బీఎఫ్‌సీలతో జాగ్రత్తగా ఉండాలని జగనాథం తునుగుంట్ల హెచ్చరించారు. ఆర్‌బీఐ కొత్త నిబంధనలను తీసుకురావొచ్చని, ఎన్‌బీఎఫ్‌సీల పనితీరు సంబంధిత విధానాలను కఠినతరం చేయవచ్చని అంచనా వేశారు. బ్యాంకులతో పోలిస్తే ఎన్‌బీఎఫ్‌సీలపై నియంత్రణ తక్కువగా ఉందని పేర్కొన్నారు. గత నెల రోజుల్లో చోటుచేసుకున్న పరిస్థితులను గమనిస్తే ఆర్‌బీఐ.. ఎన్‌బీఎఫ్‌సీల నిబంధనలను కఠినతరం చేయవచ్చని తెలిపారు. ఆర్‌బీఐ ప్రధానంగా హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ఫైనాన్స్‌ విభాగాలపై అధికంగా దృష్టి కేంద్రీకరించొచ్చని పేర్కొన్నారు. వీటిల్లో అసెట్‌-లయబిలిటీ మధ్య అంతరం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అందువల్ల రానున్న కాలంలో గతంలో మాదిరిగా లోన్‌ బుక్‌ వృద్ధి, ప్రాఫిట్‌ మార్జిన్లు ఉండకపోవచ్చని అంచనా వేశారు. 
రూపాయి క్షీణత కొనసాగవచ్చని జగనాథం తునుగుంట్ల తెలిపారు. ప్రస్తుతం రూపాయి క్షీణత అంశంపై ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం 2013లో మాదిరిగా ఎక్కువగా ఆందోళన చెందటం లేదన్నారు. ఆర్‌బీఐ తాజా సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించిందని తెలిపారు. దీని ద్వారా మార్కెట్లకు ఆందోళనకరమైన సాంకేతాలు పంపడం తనకు ఇష్టంలేదనే సందేశాన్ని ఆర్‌బీఐ వెల్లడించిందని పేర్కొన్నారు. ఆర్‌బీఐ వద్ద ఫారెక్స్‌ నిల్వలు 400 బిలియన్‌ డాలర్లకుపైగా ఉన్నాయని, ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఇవి 350-370 బిలియన్‌ డాలర్ల స్థాయికి తగ్గితే.. అప్పుడు రూపాయి గురించి ఆలోచించాల్సి ఉంటుందని తెలిపారు. రూపాయి క్షీణత వల్ల ఎగుమతి ఆధారిత కంపెనీలకు ప్రయోజనం కలిగినప్పటికీ, ఇది కొంతకాలమే అని పేర్కొన్నారు. అలాగే భారత్‌ దిగుమతి ఆధారిత దేశామని గుర్తుచేశారు. భారత్‌లో ఎగుమతులకు, దిగుమతులకు చాలా అంతరం ఉందని తెలిపారు. నికరంగా చూస్తే భారత్‌లో దిగుమతులు ఎక్కువని పేర్కొన్నారు. అందువల్ల రూపాయిని అలాగే పడనిస్తూ పోనీకూడదని తెలిపారు.  You may be interested

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ షేర్లు: లోయర్‌ సర్య్కూట్‌

Tuesday 9th October 2018

ముంబై:- తీవ్ర చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంస్థ మరోసారి వార్తల్లోకెక్కింది. ఐఎల్‌అండ్ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ మాతృ సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తాజాగా రూ. 20 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలమైనట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ గ్రూప్‌ కంపెనీలకు చెందిన కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి.ఫలితంగా నేడు బీఎస్‌ఈలో గ్రూప్‌నకు చెందిన షేర్లన్నీ లోయర్‌ సర్క్యూట్లను తాకాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ లిమిటెడ్‌:- నేడు బీఎస్‌ఈలో రూ.9.81ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం‍లోనే

షార్ట్‌ టర్మ్‌ కోసం ఐదు సిఫార్సులు

Tuesday 9th October 2018

వచ్చే ఒకటి రెండు నెలల కాలంలో 15 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.  1. రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 320. స్టాప్‌లాస్‌ రూ. 400. ఏడాదిగా లోయర్‌ టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తూ డౌన్‌ట్రెండ్‌లో ఉంది. రూ. 500- 900 మధ్య మల్టీఇయర్‌ టాపింగ్‌ ఫార్మేషన్‌ ఏర్పరిచింది. ఈ పాటర్న్‌ను తాజాగా అధోముఖంగా ఛేదించి నెగిటివ్‌ బ్రేక్‌డౌన్‌ చూపింది. ఇండికేటర్లు సైతం మరింత

Most from this category