STOCKS

News


ఐడీఎఫ్‌సీ గ్రూప్‌ షేర్ల ర్యాలీ..

Thursday 22nd November 2018
Markets_main1542874646.png-22308

  • 7 శాతానికిపైగా అప్‌

ఐడీఎఫ్‌సీ గ్రూప్‌ షేర్లు గురువారం ర్యాలీ చేస్తున్నాయి. ఐడీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, క్యాపిటల్‌ ఫస్ట్‌ షేర్లు నిఫ్టీ ఎఫ్‌అండ్‌వో సెక్యూరిటీస్‌ విభాగంలో టాప్‌ గెయినర్లుగా ఉన్నాయి. మధ్యాహ్నం 1:22 సమయంలో క్యాపిటల్‌ ఫస్ట్‌ షేరు 7.4 శాతం పెరుగుదలతో రూ.533 వద్ద, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు 7.01 శాతం వృద్ధితో రూ.39 వద్ద, ఐడీఎఫ్‌సీ షేరు 4.25 శాతం పెరుగుదలతో రూ.40 వద్ద ట్రేడవుతున్నాయి. 

ఎందుకీ ర్యాలీ?
ఐడీఎఫ్‌సీకి చెందిన బ్రోకరేజ్‌ సంస్థ బ్రోకరేజ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ డివిజన్‌ (ఐబీడీ) కొనుగోలుకు సంబంధించి . యాక్సిస్‌ క్యాపిటల్‌ ఎండీ, సీఈవో ధర్మేశ్‌ మెహతా, ఎడిల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ మాజీ సీఈవో వికాశ్‌ ఖెమాని నుంచి బిడ్లు అందాయనే వార్తలు వెలువడ్డాయి. బిడ్ల స్వీకరణ ప్రక్రియ నవంబర్‌ 20న ముగిసింది. ముంబైలోని పలు ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీలు కూడా ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరచాయి. 
నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ క్యాపిటల్‌ ఫస్ట్‌ విలీనం తర్వాత తన నాన్‌-కోర్‌ అసెట్స్‌ను విక్రయించాలని ఐడీఎఫ్‌సీ నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఐబీడీ వ్యాపారాన్ని విక్రయిస్తోంది. డీల్‌ విలువ రూ.500 కోట్లు ఉండొచ్చని అంచనా. 
ఐడీఎఫ్‌సీ అలాగే మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారాన్ని కూడా విక్రయిస్తోంది. దీని ఏయూఎం విలువ రూ.70,000 కోట్లుగా ఉంది. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలకు వాటి ఏయూఎం విలువలో 4-5 శాతానికి సమానమైన కొనుగోలు ఆఫర్లు లభిస్తుంటాయి. 
కాగా మెహతా.. క్యాపిటల్‌ మార్కెట్‌ వెటరన్‌. ఈయన యాక్సిస్‌ క్యాపిటల్‌లో పనిచేస్తున్నారు. ఇక ఖెమాని.. ఎడిల్‌వీజ్‌లో 17 ఏళ్లు పనిచేశారు. ఇటీవలే రాజీనామా చేశారు. 



You may be interested

నష్టాల్లో మెటల్‌ షేర్లు

Thursday 22nd November 2018

 గురువారం మిడ్‌సెషన్‌ సమయానికి మెటల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ సూచీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది. ముఖ్యంగా హిందాల్కో, నాల్కో, ఎంఎండీసీ, టాటాస్టీల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవ్వడం సూచీ పతనానికి కారణమైంది. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు( 3,272.70)తో పోలిస్తే 1.60శాతం నష్టంతో 3,220.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో భాగమైన మొత్తం 15 షేర్లలో 13

రీకవరీ బాటలో ఐటీ షేర్లు

Thursday 22nd November 2018

గత ట్రేడింగ్‌లో సూచీల పతనానికి కారణమైన ఐటీ షేర్లు గురువారం ర్యాలీ చేస్తున్నాయి. ముఖ్యంగా టెక్‌ మహీంద్రా ర్యాలీ ఐటీ షేర్ల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించింది. బ్రోకరేజ్‌ సంస్థల రేటింగ్‌ పెంపుతో ఇంట్రాడేలో టెక్‌మహీంద్రా షేరు​3శాతం లాభపడిన సంగతి తెలిసిందే. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ దాదాపు 2శాతం పెరిగింది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(13,879.15)తో పోలిస్తే 1.20శాతం లాభంతో 14070ల వద్ద ట్రేడ్‌

Most from this category