STOCKS

News


నిఫ్టీలో మార్పులు!

Wednesday 30th January 2019
Markets_main1548841583.png-23902

త్వరలో నిఫ్టీ ఇండెక్స్‌లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం రెండు మార్లు నిఫ్టీ50ని రివ్యూ చేస్తారు. షేర్ల పనితీరును బట్టి కొన్నింటి చేర్చడం కొన్నింటిని తీసివేయడం చేస్తుంటారు. జనవరి నుంచి జూన్‌, జూన్‌ నుంచి జనవరి మధ్య కాలాన్ని పరిశీలించి నిఫ్టీలో మార్పులు చేస్తారు. ఈ దఫా గతంలోలాగా షేరు పనితీరు పరిశీలనకు  ఆరునెలల సమయాన్ని కాకుండా మూడు నెలల సమయాన్నే తీసుకోనున్నారు.

ఈ నేపథ్యంలో నిఫ్టీలో జరగబోయే మార్పులపై ఐడీబీఐ క్యాపిటల్‌ అంచనాలు...
- హెచ్‌పీసీఎల్‌ షేరు నిఫ్టీ సూచీ నుంచి బయటకు రావచ్చు. దీని స్థానంలో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ను చేర్చవచ్చు.
- ఆగస్టులో ప్రకటించినట్లు లుపిన్‌ను నిఫ్టీ నుంచి తీసివేయనున్నారు. దీని స్థానంలో జేఎస్‌డబ్ల్యు స్టీల్‌ చేరనుంది.
- నిఫ్టీ జూనియర్‌ సూచీలో బ్రిటానియాను చేర్చవచ్చు. గోద్రేజ ప్రాపర్టీస్‌ను చేర్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 
ఈ మార్పులన్నీ ఐఎంఎస్‌ఈ ఆఫ్‌ ఎన్‌ఎస్‌ఈ ప్రకటిస్తుంటుంది. అనేక పారామీటర్స్‌ ఆధారంగా ఈ రివ్యూ జరుగుతుంది.

 



You may be interested

ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

Wednesday 30th January 2019

జనవరి డెరివేటివ్స్‌ కాంట్రాక్టు రేపు(గురువారం) ముగియనుండటం, అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై నేడు నిర్ణయాన్ని ప్రకటించనుండటం, కేంద్రం ప్రభుత్వం ఎల్లుండి(శుక్రవారం) మధ్యంతర ఒడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న అంశాల నేపథ్యంలో బుధవారం ఆద్యంతం స్టాక్‌ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనై, చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 1 పాయింటు కోల్పోయి 35,591 వద్ద, నిఫ్టీ అరపాయింట్ల నష్టపోయి 10,651.50 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 359 పాయిం‍ట్ల రేంజ్‌ 35,491 - 35,850 పాయింట్ల రేంజ్‌ కదలాడింది.

రూరల్‌ థీమ్‌ స్టాక్స్‌కు పాజిటివ్‌

Wednesday 30th January 2019

బడ్జెట్‌పై రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ అంచనా గ్రామీణ, వినిమయ థీమ్స్‌కు చెందిన కంపెనీలకు బడ్జెట్‌లో మంచి లబ్ది చేకూరవచ్చని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ నవీన్‌ కులకర్ణి అంచనా వేశారు. బడ్జెట్లో ఈ రంగాలకు కేటాయింపులు భారీగా పెరగవచ్చన్నారు. హెచ్‌యూఎల్‌తో సహా రూరల్‌ థీమ్‌కు సంబంధించిన డాబర్‌, ఐటీసీ, ఎస్కార్ట్స్‌, కోల్గోట్‌ వంటి కంపెనీల షేర్లపై పాజిటివ్‌గా ఉన్నట్లు చెప్పారు. గతేడాది బడ్జెట్‌కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్‌ చేసిందన్నారు. ఈ దఫా

Most from this category