STOCKS

News


గరిష్టస్థాయి నుంచి ఐసీఐసీఐ బ్యాంక్‌ క్షీణత

Thursday 31st January 2019
Markets_main1548920319.png-23925

 ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రితం రోజు వెల్లడించిన ఫలితాలు...మార్కెట్‌ అంచనాల్ని చేరకపోవడం, ఆ బ్యాంక్‌ మాజీ సీఈఓ చందాకొచ్చార్‌పై బ్యాంకు చర్యలు తీసుకోవడం వంటి అంశాల నేపథ్యంలో గురువారం ఈ కౌంటర్లో గరిష్టస్థాయి వద్ద అమ్మకాలు వెల్లువెత్తాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో 2 శాతం జంప్‌చేసి రూ. 376 స్థాయికి చేరిన తర్వాత ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీయడంతో ఆ స్థాయి నుంచి మధ్యాహ్నం 12.45 గంటల సమయానికి రూ. 356 స్థాయికి పడిపోయింది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే 2.5 శాతం తక్కువ. ఈ సమయానికే ఎన్‌ఎస్‌ఈలో ఈ కౌంటర్లో రికార్డుస్థాయిలో 6 కోట్లకుపైగా షేర్లు ట్రేడయ్యాయి. బుధవారం ఈ షేరు భారీ ర్యాలీ జరిపిన సంగతి తెలిసిందే. కానీ ఆ రోజు మొత్తంమీద 3.5 కోట్ల షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి. ఇది మూడు నెలల సగటు ట్రేడింగ్‌ పరిమాణంకంటే ఎక్కువే అయినప్పటికీ, గురువారం ఈ కౌంటర్లో కేవలం నాలుగు గంటల ట్రేడింగ్‌ సమయంలోనే అంతకు రెట్టింపు ట్రేడింగ్‌ పరిమాణం జరగడం గమనార్హం. క్యూ3లో ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ. 1,600 కోట్ల నికరలాభాన్ని సాధించింది. రూ. 1,900 కోట్ల నికరలాభాన్ని ఆర్జించవచ్చనే అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి. 



You may be interested

27000పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 31st January 2019

మార్కెట్లో జోరుగా ట్రేడయ్యే బ్యాంక్‌ నిఫ్టీ....జనవరి డెరివేటివ్స్‌ కాంట్రాక్టులకు చివరిరోజైన గురువారం మధ్యాహ్న సమయానికి 27,000 పాయింట్ల స్థాయిని అధిగమించింది. 26,900 పాయింట్ల సమీపంలో ట్రేడైన ఈ సూచీ హెవీవెయిట్‌ బ్యాంకింగ్‌ షేర్లయిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు బాసటతో కీలకమైన సాంకేతిక స్థాయి 27,000 పాయింట్లను దాటి మధ్యాహ్నం 1 గంట సమయానికి 27,044 పాయింట్ల వద్దకు చేరింది. బ్యాంక్‌ నిఫ్టీలో భాగమైన

కొన్ని ప్రధాన కంపెనీల క్యూ3 ఫలితాల వివరాలు

Thursday 31st January 2019

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లాభం 25% అప్‌ ముంబై: ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నికర లాభం డిసెంబర్‌ క్వార్టర్లో 25.5 శాతం వృద్ధి చెంది రూ.596 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదేకాలానికి కంపెనీ లాభం రూ.475 కోట్లుగా నమోదైంది. ఈ క్యూ3లో ఆదాయం రూ.4,439 కోట్లు కాగా, వడ్డీ ఆదాయం రూ.4,414 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారంలో తెలియజేసింది. వ్యయం రూ.2,908 కోట్ల నుంచి ఈసారి

Most from this category