STOCKS

News


ఐసీఐసీఐ బ్యాంక్‌కు మోర్గాన్‌స్టాన్లీ బూస్ట్‌

Thursday 9th August 2018
Markets_main1533805978.png-19100

దేశీయ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్‌ గురువారం ట్రేడింగ్‌లో సుమారు 8 శాతం దూసుకుపోయింది. అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ తాజాగా ఐసీఐసీఐ బ్యాంకును తోటి బ్యాంకుల్లో మేటిగా అభివర్ణించింది. దీంతో ఒక్కసారిగా బ్యాంకు కౌంటర్లో కొనుగోళ్లు జోరందుకున్నాయి. బ్యాంకు మొండిపద్దుల విషయమై స్పష్టత రావడంతో షేరుపై ఇన్వెస్టర్లు మక్కువ చూపారు. వార్షిక నివేదికలో తమ బ్యాడ్‌ లోన్స్‌, ఎన్‌పీఏల గురించి పూర్తి వివరాలు పొందుపరిచనట్లు బ్యాంకు తెలిపింది. తమ అకౌంట్లను నిపుణులైన ఆడిటర్లు పర్యవేక్షించారని, పూర్తి ఆడిట్‌ రిపోర్టును బహిర్గతం చేస్తున్నామని బ్యాంకు తెలిపింది. ఆర్‌బీఐ నియమావళికి అనుగుణంగా మొండి బకాయిలకు కేటాయింపులు జరిపామని తెలిపింది. ఎన్‌పీఏ నిబంధనలకు అనుగుణంగానే రైటాఫ్స్‌ చేశామని వెల్లడించింది. రైటాఫ్‌లు రుణ వర్గీకరణను దెబ్బతీయవని, కొత్తగా ఎన్‌పీఏలను పెంచవని వివరించింది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకును ఆసియాలో అత్యుత్తమ విత్త సంస్థగా ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ కొనియాడింది. బ్యాంకు షేరుపై ఓవర్‌ వెయిట్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నామని, టార్గెట్‌ ధర రూ. 460గా ఉంచామని తెలిపింది. వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నట్లు తెలిపింది. తోటి బ్యాంకుల్లో మేటిగా ఉందని, కాసా నిష్పత్తి 50 శాతం, రిటైల్‌ లోన్స్‌ వాటా 58 శాతానికి పెరిగాయని వివరించింది. ఇవన్నీ కలిపి ఆర్‌ఓఈని మరింత బలోపేతం చేస్తాయని అంచనా వేసింది. రాబోయే కాలంలో బ్యాంకు ఎన్‌ఐఎం మరింత మెరుగుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. 



You may be interested

అపోలో టైర్స్‌పై ఆనంద్‌రాఠి బుల్లిష్‌

Thursday 9th August 2018

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: అపోలో టైర్స్‌ ఇండస్ట్రీ: ఆటో రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర రూ.270 టార్గెట్‌ ప్రైస్‌: రూ.314 బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి.. అపోలో టైర్స్‌పై బుల్లిష్‌గా ఉంది. దీర్ఘకాలంలో మంచి రాబడి అందుకోవచ్చని అంచనా వేస్తోంది. స్టాక్‌పై బై కాల్‌ను కొనసాగిస్తోంది. ట్రక్స్‌ టైర్లలో బలమైన డిమాండ్‌ నమోదవ్వడం, సామర్థ్యం పెంపు, యూరోపియన్‌ వ్యాపారం పుంజుకోవడం, కార్యకలాపాల విస్తరణ, ఆదాయ వృద్ధి అంచనాలు ఇందుకు కారణంగా పేర్కొంది. అదే సమయంలో రబ్బరు ధరలు అధికంగా ఉండటం, సామర్థ్యం

ఇమామి కొనొచ్చు..

Thursday 9th August 2018

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: ఇమామి ప్రస్తుత ధర: రూ.579 టార్గెట్‌ ప్రైస్‌: రూ.634 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఇమామి షేరు కొనుగోలు చేయవచ్చని సిపార్సు చేస్తోంది. కంపెనీ పనితీరుపై సానుకూలముగా ఉన్నామని పేర్కొంది. ఇమామి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో మంచి ఫలితాలను ప్రకటించిందని, ఇవి అంచనాలు అనువుగా ఉన్నాయని తెలిపింది. హోల్‌సెల్‌ సహా సీఎస్‌డీ వ్యాపార విభాగాల్లో రివకరీ అంచనా వేస్తున్నామని పేర్కొంది. అలాగే గ్రామీణ డిమాండ్‌ పెరుగుదల, కొత్త ప్రొడక్టుల

Most from this category