STOCKS

News


ఫండ్‌ రివ్యూ: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌

Monday 7th January 2019
Markets_main1546849410.png-23450

పన్ను ఆదా కోసం ఎన్నో పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ, ఎఫ్‌డీలు, ఈల్‌ఎస్‌ఎస్‌ తదితర పథకాలు ఇందుకు ఉపయోగపడతాయి. వీటిల్లో ఈక్విటీల్లో పెట్టుబడులకు అవకాశం కల్పించేవి ఈఎల్‌ఎస్‌ఎస్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు. సెక్షన్‌ 80సీ కింద వార్షికంగా రూ.1.5 లక్షల ఆదాయపన్ను మినహాయింపు అవకాశాన్ని ఈఎల్‌ఎస్‌ఎస్‌లో పెట్టుబడుల ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఒకవైపు పన్ను ఆదా, మరోవైపు ఈక్విటీల్లో దీర్ఘకాలంలో అధిక రాబడులు... రెండు రకాల ప్రయోజనాలు ఈఎల్‌ఎస్‌ఎస్‌లో లభిస్తాయి. ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో పనితీరు పరంగా మెరుగ్గా ఉన్న వాటిల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌ కూడా ఒకటి. 
పనితీరు
పన్ను ఆదాకు ఉపకరించే ఈఎల్‌ఎస్‌ఎస్‌ విభాగంలో ఎన్నో పథకాలు ఉన్నాయి. కానీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌ పథకం పనితీరును గమనిస్తే... పదేళ్ల కాలంలో అత్యుత్తమ రాబడులతో ఈ విభాగంలో టాప్‌లో నిలిచింది. వార్షికంగా 19.53 శాతం చొప్పున  లాభాలను పంచింది. ఈ పథకం ప్రారంభమైన దగ్గర్నుంచి చూస్తే వార్షికంగా రాబడులు 20.36 శాతంగా ఉన్నాయి. ప్రతీ నెలా రూ.10,000ను సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే మూడేళ్లలో రూ.4.7 లక్షలు, ఏడేళ్లలో అయితే రూ.14.3 లక్షలు, పదేళ్లలో రూ.27.3 లక్షలు, 15 ఏళ్లలో రూ.67.3 లక్షలు సమకూరేవి. గత ఏడాది కాలంలో మార్కెట్లలో తీవ్ర అస్థిరతల నేపథ్యంలో రాబడులు ఫ్లాట్‌గా ఉన్నాయి. అంటే నష్ట, లాభాలేమీ లేవు. కానీ, ఈ పథకం పనితీరుకు ప్రామాణిక సూచీ అయిన నిఫ్టీ500 మాత్రం గత ఏడాది కాలంలో 3.52 శాతం నష్టాలను మిగిల్చింది. ఇలా చూస్తే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌ నష్టాలను కట్టడి చేసినట్టు తెలుస్తోంది. మూడేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు వార్షికంగా 10 శాతంగా ఉన్నాయి. ఐదేళ్లలో అయితే వార్షికంగా 15.71 శాతం రాబడులు ఇచ్చింది. 
పెట్టుబడుల విధానం 
ఈ పథకం డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. పెట్టుబడులకు మల్టీక్యాప్‌ విధానాన్ని అనుసరిస్తుంది. ప్రస్తుతానికి 47 స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంది. 10 స్టాక్స్‌లోనే 44 శాతానికి పైగా ఇన్వెస్ట్‌ చేసి ఉంది. ఫార్మా, ఇంధనం, ఆటో, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఎఫ్‌ఎంసీజీ, టెక్నాలజీ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మార్కెట్‌ విలువలో అగ్ర స్థాయిలో ఉండే కంపెనీల్లోనే 66 శాతానికి పైగా పెట్టుబడులు పెట్టింది. మిడ్‌క్యాప్‌కు 27 శాతం, స్మాల్‌క్యాప్‌నకు 6 శాతానికి పైగా కేటాయించింది. దీర్ఘకాలంలో మంచి వృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో సరైన ధరల కంటే తక్కువకు లభించే వాటిని గుర్తించి ఇన్వెస్ట్‌ చేయడమనే విధానాన్ని అనుసరిస్తుంది. 

టాప్‌ హోల్డింగ్స్‌
కంపెనీ    పెట్టుబడుల శాతం
ఐటీసీ    6.61
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు    5.67
ఎన్‌టీపీసీ    5.24
హెచ్‌డీఎఫ్‌సీ    4.41
ఎస్‌బీఐ    4.06
ఓఎన్‌జీసీ    3.79
హీరో మోటోకార్ప్‌    3.76
భారతీ ఎయిర్‌టెల్‌    3.71
ఇన్ఫోసిస్‌    3.65
ఇప్కా ల్యాబ్‌    3.26You may be interested

నార్నోలియా టాప్‌ సిఫార్సులు

Monday 7th January 2019

స్వల్పకాలానికి మంచి రాబడినిచ్చే ఐదు స్టాకులను నార్నోలియా రికమండ్‌ చేస్తోంది. 1. మనుప్పురం ఫైనాన్స్‌: టార్గెట్‌ రూ. 112. స్టాప్‌లాస్‌ రూ. 85.90. దీర్ఘకాలిక అప్‌మూవ్‌లో ఉంది. దిగువన రూ. 86 వద్ద నుంచి రెండు మార్లు బౌన్స్‌ బ్యాకై డబుల్‌ బాటమ్‌ ఏర్పరిచింది. ప్రస్తుతం అన్ని రకాల డీఎంఏ స్థాయిలకు పైన ట్రేడవుతోంది. ఆర్‌ఎస్‌ఐ సహా ఇండికేటర్లు అప్‌మూవ్‌కు అనుకూలంగా ఉన్నాయి. 2. ఐడీఎఫ్‌సీ బ్యాంకు: టార్గెట్‌ రూ. 52. స్టాప్‌లాస్‌

కొత్త ఏడాది బాగుంటుంది!

Monday 7th January 2019

సమీర్‌ ఆరోరా అంచనా మధ్యమధ్య కొన్ని వారాలు ఆటుపోట్లు కనిపించినా మొత్తం మీద కొత్త ఏడాది మార్కెట్లు బాగుంటాయని మార్కెట్‌ అనలిస్టు సమీర్‌ ఆరోరా అభిప్రాయపడ్డారు. గతేడాదితో పోలిస్తే ఈ దఫా మార్కెట్లు మరింత బాగుండొచ్చన్నారు. గతేడాది తలనొప్పులు తెచ్చిన పలు అంశాలు ఈ ఏడాది క్రమంగా సమసిపోతున్నాయన్నారు. ఎర్నింగ్స్‌ ఒడదుడుకులు, మిడ్‌క్యాప్‌ కరెక‌్షన్‌, ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం, కరెన్సీ పతనం తదితర అంశాలు గతేడాది మార్కెట‍్లను కుంగదీశాయన్నారు. అయితే గత రెండు

Most from this category