STOCKS

News


ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ 12 శాతం క్రాష్‌

Wednesday 23rd January 2019
Markets_main1548235553.png-23756

ప్రైవేట్‌ రంగ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేరు బుధవారం 12శాతం క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాల ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడం షేరు పతనానికి కారణమైంది. నేడు బీఎస్‌ఈలో షేరు రూ.333.05ల వద్ద ప్రారంభమైంది. కంపెనీ ఇంట్రాడేలో మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ3లో కంపెనీ పన్ను అనంతర లాభం 34.4శాతం క్షీణించి రూ.296.77 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 84శాతం క్షీణించి రూ.1,047.77 కోట్లకు పరిమితమైంది. నికర ప్రీమియం ఆదాయం మాత్రం రూ.6,795 కోట్ల నుంచి రూ.7,483 కోట్లకు చేరింది. ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడంతో అమ్మకాలు పెరిగాయి. ఫలితంగా షేరు ఇంట్రాడేలో 12శాతం నష్టపోయి రూ.302.45ల కనిష్టస్థాయికి పతనమైంది. మధ్యాహ్నం గం.2:30ని.కు షేరు గతముగింపు ధర (రూ.344)తో పోలిస్తే దాదాపు 11శాతం నష్టంతో రూ.307 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.302.45 రూ.336.30లుగా ఉన్నాయి.



You may be interested

బడ్జెట్‌ వేళ వీటిపై కన్నేయండి!

Wednesday 23rd January 2019

మరో పదిరోజుల్లో సార్వత్రిక బడ్జెట్‌ పార్లమెంట్‌ ముందుకు రానుంది. బడ్జెట్‌ తరుణంలో వినియోగరంగ స్టాకులపై ఎక్కువ ఫోకస్‌ పెట్టాలని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు ప్రైవేట్‌బ్యాంకులు, ఇన్‌ఫ్రా, వ్యవసాయ, గ్రామీణ రంగాల షేర్లను కూడా పరిశీలించవచ్చని సూచిస్తున్నారు. బడ్జెట్‌ నేపథ్యంలో బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్న రంగాలు, షేర్లు ఇలా ఉన్నాయి.. - షేర్‌ఖాన్‌: బాటా ఇండియా, బ్రిటానియా, సెంచరీ ప్లైబోర్డ్స్‌, డాబర్‌, ఎస్కార్ట్స్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, జీఎన్‌ఏ, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ,

11150 పాయింట్ల దిశగా నిఫ్టీ!

Wednesday 23rd January 2019

నిఫ్టీ క్రమంగా 11150 పాయింట్ల దిశగా అడుగులు వేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెరివేటివ్స్‌ డేటా ఈ విషయాన్ని ధృవీకరిస్తోందన్నారు. ఈ వారం పాజిటివ్‌గా ఆరంభమైన నిఫ్టీ 11000 పాయింట్ల నిరోధాన్ని దాటలేక వెనుకంజ వేసింది. ప్రస్తుతం 10900 పాయింట్ల వద్ద కదలాడుతోంది. అయితే నిఫ్టీ తన స్వల్ప, మధ్యకాలిక డీఎంఏ స్థాయిలకు పైన ట్రేడవుతోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెప్పారు. దీనికితోడు చార్టుల్లో హయ్యర్‌ హై, హయ్యర్‌ బాటమ్‌ ఏర్పరుస్తోందని తెలిపారు.

Most from this category