STOCKS

News


ఎంఎస్‌సీఐ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లో మార్పులు

Tuesday 14th May 2019
Markets_main1557811672.png-25720

ఎంఎస్‌సీఐ తాజాగా తన ఇండియా ఇండెక్స్‌, ఇండియా స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ల రివ్యూను పూర్తి చేసింది. రివ్యూలో భాగంగా కొన్ని మార్పులను చేపట్టింది. తాజా మార్పులు ఈ నెల 29 నుంచి అమల్లోకి వస్తాయి. మార్పులో భాగంగా ఎంఎస్‌సీఐ డొమెస్టిక్‌ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ నుంచి కాడిలా హెల్త్‌కేర్‌ను తొలగించి, ఐసీఐసీఐ లుంబార్డ్‌కు స్థానం కల్పించింది. దీంతో పాటు కొత్తగా 14 స్టాకులను స్మాల్‌క్యాప్‌ సూచీకి కలిపింది. ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌, అబాట్‌ ఇండియా, అదానీ గ్యాస్‌, ఆస్త్రాజెన్‌కా, బలరామ్‌పూర్‌ చిని, చాలెట్‌ హోటల్స్‌, క్రెడిట్‌ యాక్సిస్‌ గ్రామీణ్‌, ఇండోస్టార్‌ క్యాపిటల్‌, ఎల్‌అండ్‌టీ టెక్‌ సర్వీసెస్‌, మహారాష్ట్ర స్కూటర్స్‌, ఓఐఎల్‌, ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌, సనోఫి ఇండియా, టీసీఎన్‌ఎస్‌ క్లోతింగ్‌ షేర్లు సూచీలో కొత్తగా చేరాయి. సీఈఎస్‌సీ వెంచర్స్‌, గుజరాత్‌ మినరల్‌, డీసీఎం శ్రీరామ్‌, ఆర్‌కామ్‌, ఆర్‌పవర్‌, ఎస్‌హెచ్‌ కేల్కర్‌, శంకర్‌బిల్డింగ్‌, స్పెన్సర్‌రిటైల్‌, సుప్రీమ్‌ పెట్రో, త్రివేణి టర్బైన్‌ షేర్లను స్మాల్‌క్యాప్‌ సూచీ నుంచి ఎంఎస్‌సీఐ తొలగించింది. ఇండియా ఇండెక్స్‌లో లార్జ్‌క్యాప్స్‌, మిడ్‌క్యాప్స్‌ ఉంటాయి. ప్రతి ఫిబ్రవరి, మే, ఆగస్టు, నవంబర్‌లో ఈ సూచీల రివ్యూ జరుగుతుంది. ఈక్విటీ మార్కెట్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా సూచీలను రివ్యూ చేస్తారు. ఇండియా ఇండెక్స్‌లో 80 కంపెనీల షేర్లున్నాయి. ఇవి మొత్తం ఇండియన్‌ ఈక్విటీ ప్రపంచంలో 85 శాతాన్ని కవర్‌ చేస్తాయి. రంగాల వారీగా ఫైనాన్షియల్స్‌ రంగానికి సూచీలో ఎక్కువ వెయిటేజ్‌ ఉంది. ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, యాక్సిస్‌బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ, ఎల్‌అండ్‌టీలే ఇండియా ఇండెక్స్‌లో వెయిటేజ్‌ పరంగా టాప్‌ టెన్‌లో ఉన్నాయి. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ ఏఎంసీలకు సెబి నోటీసులు

Tuesday 14th May 2019

ఎస్సెల్‌ గ్రూప్‌లో పెట్టుబడులకు సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు సెబి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. రుణాలు చెల్లించేందుకు ఎస్సెల్‌గ్రూప్‌నకు సెప్టెంబర్‌ దాకా గడువునిచ్చేలా ఎంఎఫ్‌లు కుదుర్చుకున్న ఒప్పంద చట్టబద్ధతను సెబి ప్రశ్నించింది. ఇలాంటి ఒప్పందాల కారణంగా ఈ ఎంఎఫ్‌ల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులు తమ పథకం మెచ్యూర్‌ అయినా పూర్తి మొత్తం పొందలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్సెల్‌గ్రూప్‌ డెట్‌ సెక్యూరిటీస్‌లో ఈ ఎంఎఫ్‌లకు సంబంధించిన అన్ని

నెల గరిష్టానికి పసిడి

Tuesday 14th May 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర నెలరోజుల గరిష్టానికి చేరుకుంది. అమెరికా - చైనాల మధ్య వాణిజ్య యుద్దం మరింత ముదరడం, పశ్చిమ ఆసియా సముద్రజలాల్లో ఇరాన్‌, అమెరికాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రికత్త వాతవరణ పరిస్థితులు ఇందుకు కారణమయ్యాయి. ఇందుకు కారణమైంది. ఆసియాలో ఉదయం ఔన్స్‌ పసిడి ధర 1,301.80 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గత వారం ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు విఫలమవడంతో అమెరికా రూ.14

Most from this category