STOCKS

News


ట్రెండ్‌ మారింది....నిఫ్టీ ఏడాది టార్గెట్‌ 13,000

Tuesday 16th April 2019
Markets_main1555409619.png-25168

ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా

లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో నిఫ్టీ స్థాయిని పరిశీలిస్తే మార్కెట్‌ దిశ మారినట్లు పరిగణిస్తున్నామని, ప్రస్తుత 2019-2020 ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ టార్గెట్‌ను 13,000 పాయింట్లకు పెంచుతున్నట్లు ప్రముఖ సెక్యూరిటీస్‌ సంస్థ ఐసీఐసీఐ డైరెక్ట్‌ పేర్కొంది. నిఫ్టీ ‘గోల్డెన్‌క్రాస్‌’ను నమోదుచేసినందున, మార్కెట్‌ దిశ అప్‌సైడ్‌కు మారినట్లు తెలిపింది. మీడియం టెర్మ్‌ మూవింగ్‌ ఏవరేజ్‌ (50 రోజుల సగటు)...లాంగ్‌టెర్మ్‌ మూవింగ్‌ ఏవరేజ్‌ను (200 రోజుల సగటు) క్రాస్‌ చేయడానికి గోల్డెన్‌క్రాస్‌గా వర్ణిస్తారు. ఇలాంటి సందర్భంలో ఆయా ఆస్తుల విలువలు జోరుగా పెరిగే అవకాశాలుంటాయి. ఈ తరహా గోల్డెన్‌ క్రాస్‌ నిఫ్టీ-50 సూచీలోనే కాకుండా ఆ సూచీలో భాగమైన సగం షేర్ల ధరల్లో జరిగిందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ వివరించింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ టార్గెట్‌ను 12,800-13,000 పాయింట్లకు పెంచుతున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ ప్రకటించింది. 2003 జూన్‌ తర్వాత తొమ్మిది సందర్భాల్లో ఇలా గోల్డెన్‌క్రాస్‌ నమోదయ్యిందని, అలా జరిగినపుడల్లా తదుపరి సంవత్సరంలో 15 శాతం ర్యాలీ సంభవించిందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ వివరించింది. అలాగే నిఫ్టీలో భాగంగా వున్న 50 శాతం షేర్లలో గోల్డెన్‌క్రాస్‌ ఇప్పటికే జరిగిందని, ఈ షేర్లకు నిఫ్టీలో 73 శాతం వెయిటేజి వుందని పేర్కొంది. 



You may be interested

విప్రో లాభం 38 శాతం జంప్‌...

Wednesday 17th April 2019

- క్యూ4లో రూ.2,494 కోట్లు - ఆదాయం రూ.15,006 కోట్లు; 8.9 శాతం అప్‌ న్యూఢిల్లీ: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కం‍పెనీ విప్రో... గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2018-19, క్యూ4)లో కంపెనీ రూ.2,494 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ1,801 కోట్లతో పోలిస్తే 38.4 శాతం ఎగబాకింది. ఇక కంపెనీ మొత్తం ఆదాయం 8.9 శాతం వృద్ధితో రూ.13,769 కోట్ల నుంచి రూ.15,006

నిఫ్టీ రికార్డు ముగింపు...సెన్సెక్స్‌ 370 పాయింట్లు జంప్‌

Tuesday 16th April 2019

ముంబై:- దేశీయ మార్కెట్‌ మంగళవారం రికార్డు ర్యాలీ చేసింది. కంపెనీలు లాభదాయక ఫలితాలతో ఎర్నింగ్‌ సీజన్‌ ప్రారంభించడటం, ఈ ఏడాదిలో వర్షపాతం సాదారణ స్థాయిలో నమోదవుతుందని ఐఎండీ ప్రకటన, దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడం, అంతర్జాతీయంగా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, ఇటీవల దేశీయంగా వెలువడిన వాణిజ్యలోటు ఆశించిన స్థాయిలో నమోదు కావడంతో పాటు సాంకేతిక అంశాలు మద్దతుతో ఇంట్రాడేలో కొనుగోళ్ల పర్వం కొనసాగింది.

Most from this category