STOCKS

News


3వారాల గరిష్టానికి ఐసీఐసీఐ బ్యాంకు

Friday 26th April 2019
Markets_main1556268371.png-25369

ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు షేరు శుక్రవారం 3వారాల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.400.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తన సహచర ప్రైవేట్‌ రంగ బ్యాంకు కోటక్‌ యాక్సిక్‌ త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో ఈ బ్యాంకు త్రైమాసిక ఫలితాలు కూడా ఆశించన స్థాయిలో నమోదు కావచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు 2.50శాతం పెరిగి రూ.405ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ ధర షేరు 3వారాల గరిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం గం.2:10ని.లకు షేరు గతముగింపు ధర(రూ.395.40)తో పోలిస్తే 2.35శాతం లాభంతో రూ.404.70ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అలాగే ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ - 50 సూచీలోని టాప్‌-5 గెయినర్లలో 5వ స్థానంలో ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధర వరుసగా రూ.395.40లు రూ.404.80లుగా నమోదయ్యాయి.



You may be interested

బ్యాంకు నిఫ్టీ 1.65శాతం అప్‌

Friday 26th April 2019

బ్యాంకింగ్ రంగ షేర్ల ర్యాలీతో బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం 1.65 శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన ఈ ఇండెక్స్‌ నేడు 29,764.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేటి ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లు స్థిరమైన ర్యాలీ కారణంగా ఇంట్రాడేలో 1.65శాతం పైగా జంప్‌ చేసి 30037.90 స్థాయిని తాకింది. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్ల లాభపడి ఇండెక్స్‌ ర్యాలీకి సహకరించాయి. మధ్యాహ్నం గం.2:20ని.లకు ఇండెక్స్‌ గత

టాటా స్టీల్‌ 6 శాతం జంప్‌

Friday 26th April 2019

గత ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసికపు(జనవరి-మార్చి) ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడంతో టాటా స్టీల్‌ కంపెనీ షేర్లు శుక్రవారం లాభాల బాట పట్టాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.520.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్చి క్వార్టర్‌లో కంపెనీ రూ.2,295.25 నికరలాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.33, 984 కోట్ల నుంచి రూ.42, 914లకు పెరిగింది. ఎబిటా రూ.5,857లు నుంచి రూ.7,184 కోట్లకు పెరిగింది. ఒక్కొక్క ఈక్విటీ

Most from this category