STOCKS

News


ఆల్‌టైం హైకి ఐసీఐసీఐ

Tuesday 12th March 2019
Markets_main1552366336.png-24540

ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో జీవితకాల గరిష్టాన్ని తాకాయి. నేడు బీఎస్‌ఈలో షేరు రూ.370.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేటి మార్కెట్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పలితంగా ట్రేడింగ్‌ ప్రారంభమైన కాసేపటికే 3శాతం లాభపడి రూ.386.70లకు ఎగిసింది. ఈ ధర షేరకు జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఉదయ గం.10:00నిల.కు షేరు గత ముగింపు ధర(రూ.375.9)తో పోలిస్తే 2.69శాతం లాభంతో రూ.387ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.256.50లు, రూ.383.35లుగా నమోదయ్యాయి.
ఆల్‌టైం హైకి చేరువులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- 
సూచీల్లో మరో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు సైతం జీవితకాల గరిష్టానికి చేరువలో ట్రేడ్‌ అవుతున్నాయి. నేడు బీఎస్‌ఈలో రూ.1301ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 2శాతం ర్యాలీ చేసి రూ.1326.10ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. కాగా రిలయన్స్‌ గరిష్టస్థాయి రూ.1328.75ల వద్ద ఉంది. ఉదయ గం.10:00నిల.కు షేరు గత ముగింపు ధర(రూ.1301)తో పోలిస్తే 1.50శాతం లాభంతో రూ.1319.75ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.881.00లు, రూ.1328.75లుగా నమోదయ్యాయి. 



You may be interested

ఈ రంగాలను మరవకండి!

Tuesday 12th March 2019

ఎలారా క్యాపిటల్‌ సూచన సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది వారాలుండగా ఈక్విటీల్లో ర్యాలీ ఆరంభమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు కొన్ని రంగాలు, ఎన్నికల తర్వాత కొన్ని రంగాలు దూసుకుపోతుంటాయి. గత కొన్ని ఎన్నికలను చూస్తే ప్రీ ఎలక‌్షన్‌, పోస్ట్‌ ఎలక‌్షన్‌ ర్యాలీల ట్రెండ్‌ అర్దమవుతుందని ఎలారా క్యాపిటల్‌ తెలిపింది. క్యాపిటల్‌ గూడ్స్‌, బ్యాంక్స్‌, ఆటో, ఎనర్జీ రంగాలు ఎన్నికల ముందు జోరు చూపుతాయని తెలిపింది. 1. క్యాపిటల్‌ గూడ్స్‌: చాలా రోజులుగా క్యాపిటల్‌

మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 12th March 2019

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  టీవీఎస్‌ మోటర్‌:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండవ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.  ఒక రూపాయి ముఖ విలువ కలిగిన  ఒక్కో  షేరుకి రూ. 1.40 వాటాదారులకు ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించనుంది. ఈ కంపెనీ  బోర్డు డైరెక్టర్ల ఆమోదం లభించినట్టు బీఎస్‌ఈ ఫైలింగ్‌ లో  తెలిపింది.    లార్సన్‌ లాబ్స్‌:- మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సిక్లోరోక్వినైన్‌ ఔషధ విక్రయాలకు సంబంధించి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి తుది

Most from this category