STOCKS

News


ఐసీఐసీఐ బ్యాంకులో పెట్టుబడి రెట్టింపు అవుతుందా!?

Saturday 11th August 2018
Markets_main1533926543.png-19151

ఐసీఐసీఐ బ్యాంకు వచ్చే రెండేళ్ల కాలంలో పెట్టుబడులపై నూరు శాతం లాభాన్ని ఇవ్వగలదంటే నమ్మశక్యంగా లేదా..? కానీ, ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ మాత్రం 100 శాతం వరకు లాభం ఇవ్వగలదని భావిస్తోంది. మొండి బకాయిల నుంచి వృద్ధి వైపు అడుగులు పడుతున్న క్రమంలో ఇది సాధ్యమేనంటోంది. ఈ స్టాక్‌లో వచ్చే రెండు మూడు త్రైమాసికాలు ఆటుపోట్లు ఉంటాయని, ఆ తర్వాత రిస్క్‌ రాబడులన్నవి సానుకూలంగా మారతాయని పేర్కొంది. 

 

‘‘మా అంచనాలు నిజమైతే, ఈ స్టాక్‌ (ఐసీఐసీఐ బ్యాంకు)ను వృద్ధికి అవకాశం ఉన్న విలువైన స్టాక్‌గా గుర్తించడం ప్రారంభిస్తారు. ఆస్తుల నాణ్యత పరంగా చూస్తే ప్రొవిజన్లకు నిధుల కేటాయింపునకు మందు ఆపరేటింగ్‌ మార్జిన్‌ (పీపీవోపీ) పుంజుకుంటుంది. రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ కూడా మెరుగుపడుతుంది’’ అని మోర్గాన్‌స్టాన్లీ తన నివేదికలో తెలిపింది. ​ఆస్తుల నాణ్యత మెరుగుపడితే ఇన్వెస్టర్లు ఈ బ్యాంకు వైపు చూస్తారని పేర్కొంది. కంపెనీ ఫలితాలు ఆశాజనక వృద్ధితో వేగాన్ని అందుకుంటాయని, 2019-21లో కోర్‌ పీపీవోపీ అన్నది 21 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. రుణ ఎగవేతల వల్ల అంచనాల కంటే నష్టాలు పెరగడం, నియంత్రణ సంస్థ జరిమానాలు, బలహీన రుణాలు పెరుగుదల వంటివి మోర్గాన్‌ స్టాన్లీ విశ్లేషణ పరంగా రిస్క్‌లు. అయితే, ఐసీఐసీఐ బ్యాంకు పనితీరు చూపని రుణాల (ఎన్‌పీఏలు) పరంగా ఒత్తిళ్ల నుంచి వృద్ధి వైపు అడుగులు వేగంగా వేస్తుందని మోర్గాన్‌ స్టాన్లీ భావిస్తోంది. ఎన్‌పీఎల్‌ సమస్యలు ఉన్నప్పటికీ ఐసీఐసీఐ బ్యాంకు తన రిటైల్‌ ఫ్రాంచైజీని మెరుగుపరుచుకోవడాన్ని గుర్తు చేసింది. ‘‘2019-20 నుంచి రుణాలపై వ్యయాలు తగ్గుతాయి. పీపీవోపీ వృద్ధి 20 శాతానికి పైగా ఉంటుంది. ఆర్‌వోఈ 2020-21లో 14-15 శాతంగా ఉంటుంది. ఇది స్టాక్‌ రీరేటింగ్‌కు దారితీస్తుంది’’అని మోర్గాన్‌ స్టాన్లీ వివరించింది.



You may be interested

జేఎల్‌ఆర్‌కు ట్రేడ్‌వార్‌ సెగ

Saturday 11th August 2018

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) అమ్మకాలు జూలైలో భారీ క్షీణతను నమోదుచేశాయి. ఒడిదుడుకులు అధికంగా ఉండడం, వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు 21.6 శాతం తగ్గి 36,144 యూనిట్లకు పరిమితమైనట్లు ఆ సంస్థ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ ఫెలిక్స్‌ బ్రౌటిగమ్‌ తెలిపారు. జాగ్వార్‌ బ్రాండ్‌ సేల్స్‌ 15.2 శాతం తగ్గి 10,992 యూనిట్లుగా నమోదుకాగా.. ల్యాండ్‌

ఫండ్స్‌లో నాలుగు నిర్ధారకాలు

Friday 10th August 2018

పెట్టుబడులను సులభతరం చేసే వేదికే మ్యూచువల్‌ ఫండ్స్‌. కానీ, 2,000కు పైగా పథకాల నుంచి ఎంపిక చేసుకోవడం అన్నది కొత్త ఇన్వెస్టర్లకు కొరుకుడుపడని అంశమే. ఇటీవలి కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్యలో వేగవంతమైన వృద్ధి కనిపిస్తోంది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే ఆసక్తితో ఉన్న కొత్త ఇన్వెస్టర్లు పథకాల ఎంపిక ముందు నాలుగు అంశాలను అర్థం చేసుకోవాలి. దాంతో ఎంపిక సులభం అవుతుంది. అవేంటన్నది నిపుణులు

Most from this category