STOCKS

News


జీవితకాల గరిష్టానికి చేరువలో ఐసీఐసీఐ బ్యాంక్‌

Tuesday 16th April 2019
Markets_main1555404387.png-25166

ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో జీవితకాల గరిష్టస్థాయికి చేరువులో ట్రేడ్‌ అవుతున్నాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.397.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్‌మెన్ సాచెస్ రానున్న రోజుల్లో ఐసీఐసీఐ బ్యాంకు కార్పోరేట్ వ్యాపార రంగంలో ఆదాయాలను ఆర్జించడంలో తిరుగులేని ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తుందని అభిప్రాయపడింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీ ఆస్తులపై ఆదాయాలు 1.8శాతం, ఈక్విటీలపై ఆదాయం 17శాతం వృద్ధిని సాధిస్తుందని అంచనావేసింది. గతంలో తాము షేరుకు కేటాయించి ‘‘బై’’ రేటింగ్‌ కొనసాగిస్తూ షేరు టార్గెట్‌ ధరను రూ.451లను నుంచి రూ.492కు పెంచుతున్నట్లు ప్రకటించింది. బ్రోకరేజ్‌ సంస్థ షేరు టార్గెట్‌ ధరను పెంచడంతో ఇన్వెస్టర్లు షేరు కొనుగోలుకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు 3.69శాతం లాభపడి రూ.407.25ల ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఏప్రిల్‌ 01వ తేదిన రూ.409ల వద్ద జీవితకాల గరిష్టస్థాయిని నమోదు చేసిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం గం.2:00లకు షేరు గత ముగింపు ధర(రూ.392.75)తో పోలిస్తే 3.50శాతం లాభంతో రూ.406ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 256.50లు, రూ.409.55లుగా నమోదయ్యాయి.



You may be interested

నిఫ్టీ రికార్డు ముగింపు...సెన్సెక్స్‌ 370 పాయింట్లు జంప్‌

Tuesday 16th April 2019

ముంబై:- దేశీయ మార్కెట్‌ మంగళవారం రికార్డు ర్యాలీ చేసింది. కంపెనీలు లాభదాయక ఫలితాలతో ఎర్నింగ్‌ సీజన్‌ ప్రారంభించడటం, ఈ ఏడాదిలో వర్షపాతం సాదారణ స్థాయిలో నమోదవుతుందని ఐఎండీ ప్రకటన, దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడం, అంతర్జాతీయంగా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, ఇటీవల దేశీయంగా వెలువడిన వాణిజ్యలోటు ఆశించిన స్థాయిలో నమోదు కావడంతో పాటు సాంకేతిక అంశాలు మద్దతుతో ఇంట్రాడేలో కొనుగోళ్ల పర్వం కొనసాగింది.

11,800 శిఖరంపై నిఫ్టీ

Tuesday 16th April 2019

మార్కెట్‌ చరిత్రలో మొదటిసారిగా ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచి నిఫ్టీ-50....11,800 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. గతేడాది ఆగస్టులోనూ, ఈ ఏడాది మార్చిలోనూ 11,760 పాయింట్ల స్థాయి వరకూ పెరిగినప్పటికీ, 11,800 పాయింట్ల స్థాయిని అందుకోలేక దిగిపోయింది. అయితే ఈ మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శించిన నిఫ్టీ ఎట్టకేలకు ఈ ప్రధాన స్థాయిని చేరగలిగింది. నిఫ్టీ తాజా ఫీట్‌ సాధించడానికి బ్యాంకింగ్‌ షేర్లు ప్రధానంగా సహకరించాయి. ఈ మధ్యాహ్న సెషన్‌లో

Most from this category