STOCKS

News


ఏడాది గరిష్టానికి ఐసీఐసీఐ బ్యాంక్‌

Wednesday 14th November 2018
Markets_main1542182114.png-21997

4నెలల్లో 42శాతం ర్యాలీ చేసిన షేరు
వరుసగా రెండో రోజూ ర్యాలీని కొనసాగిస్తూ ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ బుధవారం తాజాగా 52-వారాల గరిష్టాన్ని తాకింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఐసీఐసీఐ షేరు రూ.365.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనసాగుతున్న ర్యాలీలో భాగంగా ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు ఇంట్రాడేలో రూ.2.50శాతం లాభపడి రూ.369.90స్థాయిని తాకింది. ఈ ధర షేరు ఏడాది గరిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం గం.12:45ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.360.90)తో పోలిస్తే 2శాతం లాభంతో రూ.368.10ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాల విషయంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ చందా కొచ్చర్‌ క్విడ్‌ ప్రో కో కు పాల్పడ్డారన్న వివాదం నేపథ్యంలో ఈ షేరు ఈ జూలై 16న రూ.257ల వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ జూలై - సెప్టెంబర్‌ త్రైమాసికంలో అంచనాలకు మించి ఫలితాలను నమోదు చేయడంతో షేరు ఏడాది కనిష్ట స్థాయి(రూ.257) నుంచి 42శాతం ర్యాలీ చేసింది.



You may be interested

10,000లోపు వివో కొత్త ఫోన్‌!!

Wednesday 14th November 2018

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘వివో’ త్వరలో ‘వై81ఐ’ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకురానుంది. దీని ధర రూ.10,000లోపు ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఇందులోని ప్రత్యేకతలను గమనిస్తే.. 6.22 అంగుళాల స్క్రీన్‌ 3,260 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఫేస్‌ అన్‌లాక్‌ నాచ్‌ డిస్‌ప్లే ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఓఎస్‌ 2 జీబీ ర్యామ్‌ 16 జీబీ మెమరీ మీడియాటెక్‌ ఎంటీ-6761 ప్రాసెసర్‌ 13 ఎంపీ రియర్‌ కెమరా 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా

టోకు ద్రవ్యోల్బణం పెరిగింది..

Wednesday 14th November 2018

అక్టోబర్‌లో 5.28 శాతంగా నమోదు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరింది. 5.28 శాతంగా నమోదయ్యింది. సెప్టెంబర్‌ నెలలో డబ్ల్యూపీఐ 5.13 శాతంగా ఉంది. గతేడాది అక్టోబర్‌ నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 3.68 శాతంగా నమోదయ్యింది. ఆహార పదార్ధాల ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల కారణం టోకు ద్రవ్యోల్బణం ఎగసిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ

Most from this category