STOCKS

News


జీవితకాల గరిష్టానికి ఐసీఐసీఐ

Wednesday 9th January 2019
Markets_main1547022235.png-23484

ఐసీఐసీఐ బ్యాంకు షేరు బుధవారం కొత్త జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేసింది. బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ షేరు టార్గెట్‌ ధరను పెంచడం ఇందుకు తోడ్పాటును అందించింది. బ్యాంకు ఆస్తుల నాణ్యతో పాటు, ఆదాయాలు క్రమంగా వృద్ధి చెందాయి. కావున షేరు టార్గెట్‌ ధరను రూ.460ల నుంచి రూ.510లకు పెంచుతున్నాయి. అలాగే ఇదివరకు షేరుకు కేటాయించిన అండర్‌ వెయిట్‌ రేటింగ్‌ను యథాతధంగా కొనసాగిస్తున్నామని మోర్గాన్‌ స్టాన్లీ తన నివేదికలో తెలిపింది. బలమైన ఆస్తుల నాణ్యత వృద్ధి, నికర వడ్డీ మార్జిన్ల పెరుగుదల కారణంగా రానున్న మూడేళ్లలో వార్షిక వృద్ధి రేటు 20శాతం పెరగవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేసింది. అలాగే గడిచిన 3-4 ఏళ్లలో బ్యాంకులో అనేక సానుకూల మార్పులు జరిగాయని ఫలితంగా కరెంట్, సేవింగ్స్‌ అకౌంట్‌ నిష్పత్తి(సీఎస్‌సీఏ) 51శాతం నమోదై బ్యాంకింగ్‌ రంగంలోనే అగ్రస్థానంలో ఉందని బ్రోకరేజ్‌ సంస్థ చెప్పుకొచ్చింది. ‘‘వాల్యూవేషన్‌ ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉంది. విదేశీ వాటా ఇంకా 15 ఏళ్ల కనిష్టంగా ఉందని మోర్గాన్‌ స్లాన్లీ తెలిపింది. నేడు బీఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు అరశాతం లాభంతో రూ.382.10ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్రోకరేజ్‌ సం‍స్థ షేరు టార్గెట్‌ ధరను పెంచిదనే వార్తలతో ఐసీఐసీఐ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. ఫలితంగా షేరు ఇంట్రాడేలో  1శాతం లాభపడి రూ.383.35ల వద్ద షేరు జీవితకాల గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు షేరు గత ముగింపు ధర (రూ.380.2)తో పోలిస్తే 0.25శాతం లాభంతో రూ.381ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 6నెలల కాలంలో షేరు 41శాతం ర్యాలీ చేసింది. ఇక ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.256.50లు రూ.383.35లుగా నమోదయ్యాయి.



You may be interested

టీసీఎస్‌ ఫలితాలపై బ్రోకరేజ్‌ల అంచనాలు

Wednesday 9th January 2019

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌ జనవరి 10న మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా కంపెనీ  బలమైన ఫలితాలనే ప్రకటించవచ్చని బ్రోకరింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. కంపెనీ మొత్తం ఆర్థిక సంవత్సరానికి రెండంకెల వృద్దిని నమోదు చేయవచ్చని, రెవెన్యూ గ్రోత్‌ 1.4- 2.2 శాతం(స్థిర కరెన్సీలెక్కల్లో) ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి.  - గత త్రైమాసికంతో పోలిస్తే రెవెన్యూలో 1.8 శాతం వృద్ది ఉంటుంది- జెఫర్రీస్‌ - ఈ త్రైమాసికంలో ఆర్థిక

ఏడాదికాలానికి టాప్‌ రికమండేషన్లు

Wednesday 9th January 2019

వచ్చే సంవత్సర కాలంలో 15- 100 శాతం రాబడినిచ్చే సత్తా ఉన్న టాప్‌ స్టాక్‌ ఐడియాలను బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. సెంట్రమ్‌ సిఫార్సులు 1. బజాజ్‌ ఆటో: టార్గెట్‌ రూ. 3075. దేశంలో బలమైన ద్వి, త్రి చక్రవాహన ఉత్పత్తిదారు. భారత్‌నుంచి అతిపెద్ద ద్వి, త్రిచక్రవాహన ఎగుమతిదారు. 21 దేశాలకు కంపెనీ తన వాహనాలను ఎగుమతి చేస్తోంది. బలమైన బైక్‌ పోర్టుఫోలియో ఉంది. బీఎస్‌ 4 నిబంధనల అమలు, ట్రాక్టర్‌ విక్రయాలు టాప్‌

Most from this category