STOCKS

News


ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ జంప్‌..

Saturday 13th October 2018
Markets_main1539408341.png-21102

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం లాభాల్లో ట్రేడయ్యాయి. దాదాపుగా అన్ని స్టాక్స్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లు ఎక్కువ వ్యాల్యుమ్స్‌తో పెరిగాయి. ఇక వేదాంత ఏడీఆర్‌లో ఎక్కువ వృద్ధి కనిపించింది. ఏడీఆర్‌ పెరుగుదలలో వేదాంత తర్వాతి స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ ఉన్నాయి. 
టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 2.4 శాతం లాభంతో 12.37 డాలర్లకు పెరిగింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 2.31 శాతం వృద్ధితో 9.74 డాలర్లకు చేరింది. విప్రో ఏడీఆర్‌ 2.02 శాతం లాభంతో 5.05 డాలర్లకు పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 3.85 శాతం పెరుగుదలతో 89.49 డాలర్లకి ఎగసింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1.69 శాతం వృద్ధితో 8.43 డాలర్లకి పెరిగింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ 1.78 శాతం లాభంతో 33.17 డాలర్లకి చేరింది. ఇక వేదాంత ఏడీఆర్‌ ఏకంగా 4.03 శాతం పెరుగుదలతో 11.61 డాలర్లకి ఎగసింది. 



You may be interested

నాలుగైదేళ్లలో శ్రీనివాస ఫార్మ్స్‌ ఐపీవో

Saturday 13th October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వచ్చే నాలుగైదేళ్లలో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కి (ఐపీవో) రావాలని శ్రీనివాస ఫార్మ్స్ యోచిస్తోంది. ప్రస్తుతం రూ. 750 కోట్లుగా ఉన్న టర్నోవర్‌ అప్పటికి రూ. 2,000 కోట్లకు చేరగలదని సంస్థ ఎండీ సురేష్‌ చిట్టూరి చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో టర్నోవరు రూ.1,000 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ‘వరల్డ్‌ ఎగ్‌ డే’ సందర్భంగా శుక్రవారమిక్కడ విలేకరులతో ఆయన ఈ విషయాలు చెప్పారు. తాజాగా ఇంటర్నేషనల్‌

ఆసియా మార్కెట్లు జోరు..

Saturday 13th October 2018

ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఆరంభంలో మిశ్రమంగా ప్రారంభమైన ఇండెక్స్‌లు తర్వాత లాభాలను పెంచుకుంటూ వెళ్లాయి. చివరకు జపాన్‌ నికాయ్‌ 225.. 104 పాయింట్ల లాభంతో 22,695 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 535 పాయింట్ల లాభంతో 25,801 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 22 పాయింట్ల లాభంతో 3,069 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌

Most from this category