STOCKS

News


ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ అప్‌..

Thursday 8th November 2018
Markets_main1541652257.png-21782

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ బుధవారం లాభాల్లో ట్రేడయ్యాయి. ఒక్క విప్రో మినహా మిగతా అన్ని స్టాక్స్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లు ఎక్కువ వ్యాల్యుమ్స్‌తో పెరిగాయి. ఇక వేదాంత ఏడీఆర్‌లో ఎక్కువ వృద్ధి కనిపించింది. విప్రో ఏడీఆర్‌ స్వల్పంగా తగ్గింది.
టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 1.31 శాతం లాభంతో 13.18 డాలర్లకు పెరిగింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 1.37 శాతం వృద్ధితో 9.61 డాలర్లకు చేరింది. విప్రో ఏడీఆర్‌ 0.39 శాతం తగ్గుదలతో 5.14 డాలర్లకు క్షీణించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1.51 శాతం పెరుగుదలతో 92.28 డాలర్లకి ఎగసింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1.35 శాతం వృద్ధితో 9.74 డాలర్లకి పెరిగింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ 0.82 శాతం లాభంతో 34.31 డాలర్లకి చేరింది. ఇక వేదాంత ఏడీఆర్‌ 2.08 శాతం పెరుగుదలతో 12.25 డాలర్లకి ఎగసింది.



You may be interested

తగ్గిన పసిడి

Thursday 8th November 2018

ముంబై:- డాలర్‌ ఇండెక్స్‌ రీకవరీ, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కారణంగా గురువారం పసిడి ధర నష్టాల బాట పట్టింది. ఆసియా ట్రేడింగ్‌లో గురువారం భారత వర్తమానకాలం ప్రకారం మధ్యాహ్నం గం.9.40లకు ఔన్స్‌ పసిడి 5.00 డాలర్లు నష్టపోయి 1,223.70 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రాత్రి అమెరికా మార్కెట్ల లాభాల ముగింపును అందిపుచ్చుకున్న ఆసియా మార్కెట్లు నేటి ట్రేడింగ్‌ ర్యాలీ చేస్తున్నాయి. మరోవైపు డాలర్‌ ఇండెక్స్‌ నాలుగు రోజుల నష్టాల

అమెరికా మార్కెట్ల ర్యాలీ

Thursday 8th November 2018

మధ్యంతర ఎన్నికల ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే వెలువడటంతో అమెరికా మార్కెట్లు బుధవారం ర్యాలీ చేశాయి. ఆర్థిక వ్యవస్థ వృద్ధి జోరును కొనసాగించేందుకు పాలసీ రూపకల్పనలో డెమోక్రాట్స్‌తో కలిసి పనిచేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంకేతాలివ్వడం సానుకూల ప్రభావం చూపింది. ప్రధాన ఇండెక్స్‌లు 2 శాతానిపైగా ఎగశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.13 శాతం లేదా 545 పాయిం‍ట్ల లాభంతో 26,180 పాయింట్ల వద్ద ముగిసింది. యునైటెడ్‌ హెల్త్‌కేర్‌, యాపిల్‌

Most from this category