STOCKS

News


ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 5% జంప్‌..

Saturday 27th October 2018
Markets_main1540617663.png-21530

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌లు పెరిగితే, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, వేదాంత ఏడీఆర్‌లు క్షీణించాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ ఎక్కువగా పెరిగింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ ఎక్కువగా తగ్గింది. 
టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 0.69 శాతం క్షీణతతో 11.59 డాలర్లకు తగ్గింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 0.99 శాతం తగ్గుదలతో 9.02 డాలర్లకు పడిపోయింది. విప్రో ఏడీఆర్‌ 0.20 శాతం క్షీణతతో 5.11 డాలర్లకు తగ్గింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.81 శాతం క్షీణతతో 90.97 డాలర్లకి దిగివచ్చింది. వేదాంత ఏడీఆర్‌ 0.72 శాతం తగ్గుదలతో 11.07 డాలర్లకి పడిపోయింది. ఇక  ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ అధిక వ్యాల్యూమ్స్‌తో ఏకంగా 4.79 శాతం వృద్ధితో 9.18 డాలర్లకి ఎగసింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ 3.36 శాతం పెరుగుదలతో 33.81 డాలర్లకి చేరింది.   



You may be interested

నవంబర్‌లో రూ.40వేల కోట్ల సెక్యూరిటీల కొనుగోలు: ఆర్‌బీఐ

Saturday 27th October 2018

ముంబై:- ఆర్థిక వ్యవస్థలో నగదు కొరతను తగ్గించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చర్యలకు పూనుకుంది. అందులో భాగంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి ఈ నవంబర్‌లో రూ.40 వేల కోట్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ప్రజలు, వాణిజ్య సంస్థలు, ఇతర విత్తసంస్థల నుంచి నవంబర్‌లో బహిరంగ మార్కెట్ కార్యకలాపాల (ఓఎంవో) ద్వారా ప్రభుత్వానికి చెందిన రూ.40 వేల కోట్ల విలువైన సెక్యూరిటీలను కొనుగోలు చేయనున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

నష్టాల్లోనే అమెరికా మార్కెట్‌

Saturday 27th October 2018

మూడవ త్రైమాసికంలో అమెరికా జీడీపీ వృద్ధి రేటు 3.5 శాతంగా నమోదైనప్పటికీ దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు నిరుత్సాహ ఎర్నింగ్స్‌ను ప్రకటించడంతో అక్కడి మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. ప్రధాన ఇండెక్స్‌లు 1 శాతానికిపైగానే పడిపోయాయి. ఇక నాస్‌డాక్‌ 2 శాతానికిపైగా పతనమైంది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 1.19 శాతం లేదా 296 పాయిం‍ట్ల నష్టంతో 24,688 పాయింట్ల వద్ద ముగిసింది. డౌజోన్స్‌ ఒకానొక సమయంలో 500 పాయింట్లకుపైగా పడిపోయింది. ఎస్‌అండ్‌పీ

Most from this category