STOCKS

News


ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 3.50శాతం డౌన్‌

Saturday 26th January 2019
Markets_main1548484299.png-23814

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. వీడియోకాన్‌ గ్రూప్‌నకు ముంజూరు చేసిన రుణాల వివాదంలో ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచ్చార్‌పై సీబీఐ కేసు నమోదు చేయడంతో ఈ బ్యాంకు ఏడీఆర్‌ 3.30శాతం క్షీణించింది. డాక్టర్‌ రెడ్డీస్‌ 1శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.11శాతం నష్టపోయాయి. మరోవైపు డాలర్‌ మారకంలో రూపాయి బలపడంతో ఇన్ఫోసిస్‌ షేరు 1శాతం పెరిగాయి. అలాగే టాటామోటర్స్‌ 1శాతం, విప్రో డీవీఆర్‌లు అరశాతం లాభాల్లో ముగిశాయి.
లాభాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు:-
అమెరికా చరిత్రలోనే సుదీర్ఘమైన 35 రోజుల ప్రభుత్వ ‘షట్‌డౌన్‌’కు ఎట్టకేలకు తాత్కాలిక తెర పడటంతో శుక్రవారం రాత్రి ఆ దేశ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. వచ్చే నెల 15వరకు అంటే మూడు వారాల పాటు తాత్కాలికంగా ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా వెల్లడించారు. ఫలితంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్దతు పలకడంతో శుక్రవారం రాత్రి  డోజోన్స్‌ 183.96 పాయింట్లు(0.75 శాతం) పుంజుకుని 24,737 వద్ద నిలిచింది. ఎస్‌అండ్‌పీ సైతం 22.43 పాయింట్లు(0.85 శాతం) బలపడి 2,664.76 వద్ద ముగిసింది. ఈ బాటలో నాస్‌డాక్‌ మరింత అధికంగా 91.40 పాయింట్లు(1.29 శాతం) ఎగసి 7,164.86 వద్ద స్థిరపడింది.



You may be interested

1300డాలర్ల పైన ముగిసిన పసిడి

Saturday 26th January 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం రాత్రి 1300 డాలర్ల పైన ముగిసింది. అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) కీలక వడ్డీ రేట్లపై తటస్థ విధానాన్ని అవలంభించవచ్చనే అంచనాలతో రాత్రి డాలర్‌ ఇండెక్స్‌ 96స్థాయిని కోల్పోయింది. పసిడి ధరకు వ్యతిరేక దిశలో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ పతనం కూడా పసిడి ర్యాలీకి తోడ్పాటును అందించింది. ఫలితంగా నిన్న రాత్రి అమెరికాలో ఔన్స్‌ పసిడి ధర ఒకానొక దశలో 24.45

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 54 పాయింట్లు జంప్‌

Saturday 26th January 2019

విదేశీ మార్కెట్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం రాత్రి లాభంతో  10,840.50 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 10,786 పాయింట్లతో పోలిస్తే 54 పాయింట్ల లాభంతో ఉంది. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ నష్టంతో ముగిసిన నేపథ్యంలో సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  అమెరికా - చైనా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సఫలవచ్చనే ఆశావహనంతో శుక్రవారం ఆసియా మార్కెట్లు లాభాలతో

Most from this category