STOCKS

News


స్మాల్‌ క్యాప్స్‌లో జెమ్స్‌ కోసం చూస్తున్నారా..?

Saturday 17th November 2018
Markets_main1542394303.png-22108

ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ పతనంతో మంచి షేర్లు కూడా ఆకర్షణీయమైన ధరల స్థాయికి వచ్చేశాయి. దీంతో పెట్టుబడి పెట్టేందుకు సరైన స్టాక్స్‌ ఏవంటూ కొందరు అన్వేషించే పనిలో పడ్డారు. సెప్టెంబర్‌ త్రైమాసికం ఫలితాలు మంచి స్టాక్స్‌ ఎంపికకు ఆధారంగా ఉపయోగపడతాయి. మొత్తం మీద ఎక్కువ కంపెనీల ఫలితాలు మెప్పించే విధంగా లేవు. అయితే, మంచి ఫలితాలను ప్రకటించిన కంపెనీలు కూడా ఉన్నాయి. వీటిని గమనిస్తే... కొన్ని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు తమ లాభాల మార్జిన్లను పెంచుకోవడం గమనార్హం. వీటిలో కొన్ని కంపెనీల షేర్లు 50 శాతం వరకూ ర్యాలీ చేశాయి. వీటిని పెట్టుబడులకు మంచి అవకాశాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

 

రాడికోఖైతాన్‌ లిక్కర్‌ రంగంలో ప్రముఖ కంపెనీ. మార్జిన్ల విషయంలో స్థిరమైన వృద్ధిని సెప్టెంబర్‌ త్రైమాసికంలోనూ ప్రదర్శించింది. పన్ను అనంతర లాభాల మార్జిన్‌ 2.6 శాతానికి పెరిగింది. జూన్‌ త్రైమాసికంలో ఇది 2.2 శాతంగానే ఉంది. మార్చి త్రైమాసికంలో 2.1 శాతం, గత డిసెంబర్‌ త్రైమాసికంలో 1.9 శాతంగా ఉండడం గమనార్హం. ఎబిట్డా మార్జిన్‌ వార్షికంగా చూస్తే 3 శాతం వృద్ధితో 17.7 శాతానికి చేరిందని, కొన్ని ప్రాంతాల్లో ధరల పెంపు ఇందుకు దోహదపడిందని ఏస్‌ ఈక్విటీస్‌ తెలిపింది. ముడి పదార్థాల వ్యయాలు కూడా తగ్గినట్టు చెప్పింది. ఈ స్టాక్‌కు కోటక్‌ సెక్యూరిటీస్‌, ఎమ్కే గ్లోబల్‌ బై రేటింగ్‌ ఇచ్చాయి. 

 

డోమినోస్‌ పిజ్జా, డంకిన్‌ డోనట్స్‌ పేరుతో తినుబండారాల దుకాణాలను నిర్వహించే జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ లాభాల మార్జిన్‌ సెప్టెంబర్‌ క్వార్టర్లో 8.8 శాతానికి పుంజుకుంది. జూన్‌ త్రైమాసికంలో ఇది 8.7 శాతం, క్రితం ఏడాది సెప్టెంబర్‌ క్వార్టర్లో 6.7 శాతమే కావడం గమనార్హం. ఎబిట్డా మార్జిన్‌ 5.5 శాతం మేర వార్షికంగా పెరిగింది. స్టోర్‌వారీ అమ్మకాల్లో వృద్ధి ఇందుకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. నూతన స్టోర్ల ప్రారంభం నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన ఆరు నెలల కాలంలో మార్జిన్‌ విస్తరణ ఉండకపోవచ్చని, 2021 ఆర్థిక సంవత్సరం నాటికి మరో అర శాతం మేర మార్జిన్‌ పెరగొచ్చని అంచనా వేసింది. 

 

జేకే పేపర్‌ సంస్థ లాభాల మార్జిన్‌ గడిచిన నాలుగు త్రైమాసికాల కాలంలో 8.4 శాతం నుంచి 14 శాతానికి పెరిగింది. ఉత్పత్తి సామర్థ్యం పెంపుతో కంపెనీ మార్కెట్‌ వాటా పెరుగుతోందని, పేపర్‌ రంగంలో జేకే పేపర్‌ పెట్టుబడికి మంచి ఆప్షన్‌గా ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. గడిచిన ఆరు నెలల కాలంలో ఈ స్టాక్‌ 52 శాతం పెరిగింది. ఇక సిర్పూర్‌ పేపర్‌ మిల్లు కార్యకలాపాలు 2019 ఫిబ్రవరిలో మొదలవుతాయని కంపెనీ ప్రకటించింది. మణప్పురం ఫైనాన్స్‌ సంస్థ మార్జిన్‌ గడిచిన నాలుగు త్రైమాసికాల కాలంలో 2.9 శాతం పెరిగింది. కానీ స్టాక్‌ ఇదే కాలంలో 16 శాతం క్షీణించింది. ఈ స్టాక్‌కు నిర్మల్‌ బంగ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. టార్గెట్‌ ధరను రూ.103కు బదులు రూ.112కు పెంచింది. ఇంకా నోసిల్‌, రత్నమణి మెటల్స్‌ అండ్‌ ట్యూబ్స్‌, డీసీఎం, సన్వారియా కన్జ్యూమర్‌, నాహర్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌, పాలీప్లెక్స్‌ కార్పొరేషన్‌ సంస్థల మార్జిన్లు కూడా పెరిగాయి.
 You may be interested

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Saturday 17th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి లాభాల్లో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 81 పాయింట్ల లాభంతో 10,779 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,687 పాయింట్లతో పోలిస్తే 92 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఇక అమెరికా

మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫండ్‌ పథకాలపై తగ్గిన చార్జీలు

Saturday 17th November 2018

మోతీలాల్‌ ఓస్వాల్‌ అస్సె్‌ట్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహించే మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసే వారికి సంతోష పెట్టే వార్త ఇది. ఈ సంస్థ పలు మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలపై టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో చార్జీలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఒక మ్యూచువల్‌ ఫండ్‌ పథకం పరిధిలో పెట్టుబడుల నిర్వహణకు సంబంధించి ఎదురయ్యే అన్ని రకాల చార్జీలను సంస్థలు టీఈఆర్‌ పేరుతో వసూలు చేస్తుంటాయి. సెబీ ఇటీవల ఫండ్స్‌ పథకాలపై చార్జీలను తగ్గించాలని

Most from this category