News


వ్యాల్యూ స్టాక్స్‌ కోసం అన్వేషిస్తున్నారా...?

Sunday 28th October 2018
Markets_main1540749142.png-21540

దేశీయ స్టాక్‌ మార్కెట్లు కీలకమైన మద్దతు స్థాయిలకు సమీపంలో ఉన్నాయి. గరిష్ట స్థాయిల నుంచి చూస్తే సుమారు 14 శాతం నష్టపోయాయి. అయితే, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌లో ఎక్కువ శాతం, బ్లూచిప్‌ కంపెనీల్లో కొన్ని ఇండెక్స్‌ల కంటే ఎక్కువే నష్టాలను చూవిచూశాయి. దీంతో పెట్టుబడి పెట్టాలనుకునే వారి ముందు... తక్కువ ధరల వద్ద లభిస్తున్న ఎన్నో స్టాక్స్‌ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏ స్టాక్స్‌ను ఎంచుకోవాలన్న సంశయం ఎదురైనా ఆశ్చరపోవక్కర్లేదు. అయితే, ధరలు తగ్గిన అన్ని స్టాక్స్‌ కూడా విలువల పరంగా కొనుగోలుకు అనుకూలమైనవని చెప్పలేం. కనుక నాణ్యతను తెలియజేసే అంశాలను చూడాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. 

 

‘‘స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు స్టాక్‌ మార్కెట్ల పతనానికి కారణం. అధిక ముడి పదార్థాల వ్యయాలు, నిధుల సమీకరణ వ్యయాలు పెరగడం, అధిక చమురు ధరలు, పడిపోతున్న రూపాయి దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడిన కంపెనీల మార్జిన్లు, లాభదాయకపై ప్రభావం చూపిస్తాయి’’ అని ఇండియా నివేష్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ ధర్మేష్‌ కాంత్‌ తెలిపారు. అనిశ్చితితో పాటు ఒడిదుడుకుల మార్కెట్లో నాణ్యమైన స్టాక్స్‌ను నమ్ముకోవడం మంచిదన్నది నిపుణుల సలహా. అధిక స్థాయిలో, స్థిరమైన ఆర్‌వోసీఈ (రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయిడ్‌) ఉండి, ఆపరేటింగ్‌ మార్జిన్‌ పెరుగుతున్నవి లేదా స్థిరంగా ఉన్నవి, సానుకూల నగదు ప్రవాహాలు కలిగిన, తక్కువ రుణాలు కలిగిన వాటిని నాణ్యమైన స్టాక్స్‌గా పేర్కొంటున్నారు. 

 

ఎలారా క్యాపిటల్‌ నాణ్యమైన స్టాక్స్‌ గుర్తింపు విషయంలో చూడాల్సిన కొన్ని అంశాలను సూచించింది. 2018-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి వృద్ధి అంచనాలు, ఆయా కంపెనీల కాస్ట్‌ ఆఫ్‌ ఈక్విటీ కంటే ఎక్కువగా ఉండాలి. అలాగే, ప్రస్తుత సంవత్సరం ఫార్వార్డ్‌ పీఈ అన్నది ఐదేళ్ల సగటు పీఈ కంటే తక్కువ ఉండాలి. స్టాక్‌ ధర 15 శాతం కంటే ఎక్కవే తగ్గి ఉండాలి. గత ఐదేళ్ల కాలంలో స్టాక్‌ ధరలో, ప్రస్తుత ధర సగానికిలోపే ఉండాలి. వీటి ప్రకారం చూసినప్పుడు ఇక్కడ పేర్కొన్న అంశాలన్నింటినీ నెరవేర్చేవి... మారుతి సుజుకి, ఐచర్‌ మోటార్స్‌, సన్‌టీవీ, ఎండ్యురన్స్‌ టెక్‌, వర్ల్‌పూల్‌, వాబ్కో, సోలార్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌కేఎఫ్‌, మహానగర్‌ గ్యాస్‌, డాక్టర్‌ లాల్‌పాథ్‌ల్యాబ్స్‌, టాటా ఎలక్సి, బజాజ్‌ కార్ప్‌, మోన్‌శాంటో, టిమ్‌కెన్‌, వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌, ఇక్రా, జాగరణ్‌ ప్రకాశన్‌, సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ ఉన్నట్టు ఎలారా క్యాపిటల్‌ తెలిపింది.You may be interested

బలమైన హెచ్‌ఎఫ్‌సీలు, ఎన్‌బీఎఫ్‌సీలు పోటీలో నిలబడతాయి: సుదీప్‌ దుగార్‌

Sunday 28th October 2018

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ రుణ చెల్లింపుల్లో విఫలం అయిన తర్వాత మార్కెట్లో లిక్విడిటీ సమస్య విషయమై ఆందోనలు నెలకొనగా... ఈ ప్రభావం హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీలు), ఎన్‌బీఎఫ్‌సీల కంపెనీలపై తీవ్రంగా పడింది. సంబంధిత కంపెనీల షేర్లు భారీగా నష్టపోవం కూడా చూశాం. వాస్తవానికి ఈ కంపెనీల షేర్ల విలువలు గరిష్ట స్థాయికి చేరడం కూడా ఇక్కడ గమనించాల్సిన అంశమని స్టివార్ట్‌ అండ్‌ మ్యాక్‌రిచ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ సుదీప్‌ దుగార్‌

పసిడి రయ్‌.. రయ్‌..

Saturday 27th October 2018

పసిడి ధర శుక్రవారం రాత్రి 3 నెలల గరిష్టం వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి వాతావరణ పరిస్థితులు ఇందుకు కారణమయ్యాయి. రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 6.30 డాలర్లు లాభపడి 1,235.40 వద్ద ముగిసింది. అమెరికాలో దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు ఆశించిన స్థాయిలో ఫలితాలను నమోదు చేయకపోవడంతో అక్కడి మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మరోవైపు డాలర్‌ ఇండెక్స్‌ గరిష్ట స్థాయిల నుంచి తగ్గుదల కూడా పసిడి

Most from this category