STOCKS

News


రికార్డు గరిష్టానికి హెచ్‌యూఎల్‌

Monday 3rd December 2018
Markets_main1543833855.png-22599

ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్) షేర్లు సోమవారం జీవితకాల గరిష్టాన్ని తాకాయి. గ్లాక్సో స్మిత్‌క్లెయిన్‌ కన్జూమర్‌ను విలీనం చేసుకునేందుకు హెచ్‌యూఎల్‌ బోర్డు ఆమోదం తెలపడటం ఇందుకు కారణమైంది. నేడు హెచ్‌యూఎల్ షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ.1,769.50ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. జీఎస్‌కే కన్జూమర్‌ హెల్త్‌కేర్‌ వ్యాపారాన్ని విలీనం చేసుకునేందుకు బోర్డు అనుమతిచ్చినట్లు హెచ్‌యూఎల్‌ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. దీంతో హెచ్‌యూఎల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పలితంగా షేరు ఇంట్రాడేలో 4.80శాతం లాభపడి రూ.1,838.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ స్థాయి హెచ్‌యూఎల్‌ షేరుకు జీవితకాల గరిష్టస్థాయి. ఈ మధ్యకాలంలో నిఫ్టీ-50 సూచీలో జీవితకాల గరిష్టాన్ని తాకిన షేరు హెచ్‌యూఎల్‌ కావడం విశేషం. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న నిఫ్టీ, సెన్సెక్స్‌ సూచీలను లాభాల ముగింపునకు హెచ్‌యూఎల్‌ షేర్ల ర్యాలీయే కారణమని చెప్పవచ్చు. ఈ షేరు చివరకు 4.68శాతం లాభంతో రూ.1,836.00ల వద్ద ముగిసింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1,241.20లు, రూ.1,838.30లుగా నమోదయ్యాయి.


HUL

You may be interested

క్యూ2 జీడీపీలో ఆశ్చర్యం కలిగించే అంశాలు

Tuesday 4th December 2018

సెప్టెంబర్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7.1 శాతంగా నమోదైంది. అంతకుముందు జూన్‌ త్రైమాసికంలో 8.2 శాతం నుంచి ఒకే సారి గణనీయంగా తగ్గుదల నమోదైంది. డీమోనిటైజేషన్‌ తర్వాత గరిష్ట వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలోనే సాధ్యమైంది. గత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌ క్వార్టర్లో నమోదైన 6.3 శాతం వృద్ధి రేటుపైనే నమోదవడం కాస్త ఊరట. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎక్కువ వృద్ధి రేటు

డిసెంబర్‌లో అధిక ఒడిదుడుకులు వుండొచ్చు..!

Monday 3rd December 2018

ముంబై: ప్రస్తుత ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఆ తరువాత మేలో సాధారణ ఎన్నికలు అనేవి మార్కెట్‌ దిశకు అత్యంత కీలక అంశాలని చార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ చీఫ్‌ స్ట్రాటజిస్‌ మజర్‌ మహ్మద్‌ అన్నారు. నిఫ్టీకి 11,000 పాయిం‍ట్లు అనేది ప్రస్తుతం ఏమంత పెద్ద విషయం కాదని వ్యాఖ్యానించిన ఆయన ఈ స్థాయి కేవలం 2-3 శాతం దూరంలోనే ఉందన్నారు. ఇక్కడ అర్థం

Most from this category