STOCKS

News


నిధుల వెల్లువ రానుంది!

Saturday 16th February 2019
Markets_main1550309163.png-24220

దేశీ మార్కెట్‌పై జీటీఐ క్యాపిటల్‌
భారత్‌ మార్కెట్లో పెట్టుబడులకు విదేశీ మదుపరులు చాలా పెద్దమొత్తంలో నిధులు పెట్టుకొని కూర్చొని ఉన్నట్లు జీటీఐ క్యాపిటల్‌ ప్రతినిధి మాధవ్‌ ధార్‌ చెప్పారు. గతేడాది ఎఫ్‌పీఐలు ఇండియా మార్కెట్ ప్రదర్శనతో నిరుత్సాహపడ్డారన్నారు. అయితే క్రమంగా దేశీయ ఎకానమీ బిజినెస్‌ ఫ్రెండ్లీగా, ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీగా మారిపోతోందని గుర్తిస్తున్నారన్నారు. ఇప్పటికింకా సంస్కరణల ఫలాలు పూర్తిగా కనిపించడంలేదని, అందుకే 7 శాతానికి అటుఇటుగా వృద్ధి నమోదవుతోందని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో వృద్ధి మరింత జోరందుకుంటుందని అంచనా వేశారు. ప్రభుత్వ ఏర్పాటు, లిక్విడిటీపై మరింత స్పష్టత వస్తే ఎఫ్‌పీఐల వెల్లువ ఆరంభమవుతుందని తెలిపారు. భారత మార్కెట్లకు, ఎకానమీకి ఇది మంచి సమయమని ఆయన చెప్పారు. అందుకే ఎఫ్‌పీఐల దృష్టిలో భారత్‌ ఉందన్నారు. 
ఇవే కీలకం..
యూఎస్‌మార్కెట్‌కు అనుగుణంగా భారత మార్కెట్‌ కదలికలుంటాయని మాధవ్‌ చెప్పారు. యూఎస్‌లో లాగానే భారత్‌ ఇప్పుడిప్పుడే వృద్ధిలో జోరందుకుంటోందని, ఇదే సమయంలో లిక్విడిటీ ఇబ్బందులు ఆరంభమయ్యాయని చెప్పారు. అందుకే ఫెడ్‌లాగానే ఆర్‌బీఐ కూడా రేట్ల పెంపునకు ముగింపు పలికిందన్నారు. అంతేకాకుండా రేట్ల తగ్గింపు చేపట్టిందని, దీంతో లిక్విడిటీ సమస్య క్రమంగా తగ్గుతుందని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్‌ డల్‌గా ఉందని, ఇలాంటి డల్‌ మార్కెట్లో ఎవరూ అమ్మకాలకు మొగ్గు చూపరని తెలిపారు. ఈ ఏడాది చివరకల్లా మార్కెట్లు పాజిటివ్‌ జోన్‌లో ముగుస్తాయన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కానీ కొందరు ఇన్వెస్టర్లలో బలమైన నమ్మకం ఫలితాల తర్వాతే వస్తుందని చెప్పారు. ఇప్పటివరకు తెచ్చిన సంస్కరణల్లో ఐబీసీ మంచిదని, దీని ఫలితాలు ఇకపై కనిపిస్తాయని చెప్పారు. జీఎస్‌టీ, నోట్లరద్దు ప్రకంపనలు ఆగిపోయాయని, ఇకపై ఎకానమీలో పరుగులే ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. You may be interested

అన్ని రంగాలదీ అదే బాట!

Saturday 16th February 2019

ఒకదాని వెంట ఒకటిగా పతనమవుతున్న షేర్లు దేశీయ మార్కెట్లు ఈ ఏడాది సుదీర్ఘ నష్టాల వారాన్ని నమోదు చేస్తున్నాయి. వరుసగా ఏడు రోజులుగా సూచీలు పతనమవుతున్నాయి. లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ అనే తేడా లేకుండా ఒకదాని వెంట ఒకటిగా అన్ని స్టాకులు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల విశ్వాసం రోజురోజుకీ దెబ్బతింటూ వస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ బాగానే ఉన్నా, ప్రభుత్వం బడ్జెట్లో వినిమయ ప్రోత్సాహక చర్యలు

అమెరికాలో మాంద్యం సంకేతాలు?!

Saturday 16th February 2019

ఒకపక్క ట్రేడ్‌వార్‌ సమసిపోలేదు.. మరోపక్క అంతర్జాతీయంగా వృద్ది నెమ్మదిస్తోంది. ఇవన్నీ కలిసి క్రమంగా యూఎస్‌ ఎకానమీలో మరోమారు మాంద్యాన్ని సృష్టించే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక మాంద్యం తప్పదన్న సంబంధించి సంకేతాలు కనిపిస్తున్నాయని ఎక్కువమంది నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది వృద్ది పాజిటివ్‌గానే ఉంటుందని ఒకపక్క అనలిస్టులంతా అభిప్రాయపడుతున్నారు. కానీ మరోపక్క మాంద్యం ముంచుకొచ్చే అవకాశాలు ఆరేళ్ల గరిష్ఠాలకు చేరాయని గుర్తు చేస్తున్నారు. యూఎస్‌ ఎకానమీ ఇటీవల కాలంలో గత

Most from this category