STOCKS

News


రోలోవర్స్‌ సంకేతం...12,000 స్థాయికి నిఫ్టీ

Friday 26th April 2019
Markets_main1556273558.png-25371

రోలోవర్స్‌ సంకేతం...12,000 స్థాయికి నిఫ్టీ

ఏప్రిల్‌ నెలలో ఊరించిన నిఫ్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ 12,000 పాయింట్ల స్థాయిని మే నెలలో అందుకోవొచ్చన్న సంకేతాలు నిఫ్టీ ఫ్యూచర్స్‌లో జరిగిన లాంగ్‌ రోలోవర్స్‌ సూచిస్తున్నట్లు సెంట్రమ్‌ బ్రోకింగ్‌ పేర్కొంది. మార్చి నెలలో భారీ ర్యాలీ జరిగిన తర్వాత ఏప్రిల్‌ డెరివేటివ్‌ సిరీస్‌కు భారీగా లాంగ్‌ పొజిషన్లు రోలోవర్‌ అయ్యాయని, అవి అలాగే కొనసాగించిన బుల్స్‌, వాటిని తిరిగి మే సిరీస్‌కు రోలోవర్‌ చేసినట్లు సెంట్రమ్‌ బ్రోకింగ్‌ డెరివేటివ్‌ అనలిస్ట్‌ జే పురోహిత్‌ వివరించారు. మే సిరీస్‌కు 81.49 శాతం పొజిషన్లు రోలోవర్‌ అయ్యాయని, ఇది మూడు నెలల సగటు 62.94 శాతం కంటే అధికమని ఆయన వెల్లడించారు. ఏప్రిల్‌ సిరీస్‌లో నిఫ్టీ 11,856 పాయింట్ల రికార్డు గరిష్టస్థాయిని తాకిన తర్వాత గత కొద్ది సెషన్లలో జరిగిన లాభాల స్వీకరణ కారణంగా అందుకోలేకపోయిన 12,000 పాయింట్ల స్థాయిని ఈ సిరీస్‌లో తాకుతుందన్న అంచనాల్ని పురోహిత్‌ వెలువరించారు. ఏప్రిల్‌ సిరీస్‌లో నిఫ్టీ 0.62 శాతం నామమాత్రపు లాభంతో ముగిసింది. ఏప్రిల్‌ సిరీస్‌లో పటిష్టమైన మద్దతుగా నిలిచిన 11,550 పాయింట్ల స్థాయే ఈ నెల కూడా మద్దతునిస్తుందని, ఆపైన స్థిరపడితే 12,000 పాయింట్ల స్థాయిని త్వరలో అందుకోవడం కష్టమేమీ కాదని పురోహిత్‌ వివరించారు. అయితే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈ నెలలోనే వెలువడనున్నందున, తీవ్ర హెచ్చుతగ్గులు వుంటాయని ఆయన హెచ్చరించారు. 

వీటిలో లాంగ్‌, షార్ట్‌ రోలోవర్స్‌...

అల్రా‍్టటెక్‌ సిమెంట్‌, ఓఎన్‌జీసీ, శ్రీసిమెంట్‌, టీవీఎస్‌ మోటార్‌, మ్యారికో తదితర కౌంటర్లలో లాంగ్‌ రోలోవర్స్‌ జరిగాయని, డీఎల్‌ఎఫ్‌, రిలయన్స్‌ కేపిటల్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, టొరెంట్‌ ఫార్మా. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ తదితరాల్లో షార్ట్‌ రోలోవర్స్‌ జరిగినట్లు పురోహిత్‌ పేర్కొన్నారు.  



You may be interested

మెటల్‌ షేర్ల మెరుపులు

Friday 26th April 2019

ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ షేర్లకు ప్రాతనిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ శుక్రవారం 2శాతం ర్యాలీ చేసింది. నేడు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2,991.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  అలాగే నిన్న క్యూ4 ఫలితాలను ప్రకటించిన టాటాస్టీల్‌ కంపెనీ షేర్లు నేడు 7శాతం ర్యాలీ చేయడం కూడా మెటల్‌ షేర్ల ర్యాలీకి తోడ్పాటునిచ్చింది. జిందాల్‌ స్టీల్‌ 5శాతం, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, హిందాల్కో షేర్లు 2.50శాతం, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, సెయిల్‌ షేర్లు అరశాతం ర్యాలీ

బ్యాంకు నిఫ్టీ 1.65శాతం అప్‌

Friday 26th April 2019

బ్యాంకింగ్ రంగ షేర్ల ర్యాలీతో బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం 1.65 శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన ఈ ఇండెక్స్‌ నేడు 29,764.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేటి ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లు స్థిరమైన ర్యాలీ కారణంగా ఇంట్రాడేలో 1.65శాతం పైగా జంప్‌ చేసి 30037.90 స్థాయిని తాకింది. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్ల లాభపడి ఇండెక్స్‌ ర్యాలీకి సహకరించాయి. మధ్యాహ్నం గం.2:20ని.లకు ఇండెక్స్‌ గత

Most from this category