STOCKS

News


భారీ గ్యాప్‌అప్‌...సెన్సెక్స్‌ 276 పాయింట్లు జంప్‌

Monday 7th January 2019
Markets_main1546832418.png-23443

నిఫ్టీ 78 పాయింట్లు అప్‌

ప్రపంచ ట్రెండ్‌ సానుకూలత కారణంగా సోమవారం భారత్‌ మార్కెట్‌ భారీ గ్యాప్‌అప్‌తో మొదలయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఒక్కసారిగా276 పాయింట్ల లాభంతో 35,971 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో 10, 805పాయింట్ల వద్ద మొదలయ్యింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో మెటల్‌ షేర్లు భారీగా జంప్‌చేసాయి. వేదాంత, టాటా స్టీల్‌, హిందాల్కోలు 2-3 శాతం మేర పెరిగాయి. బ్యాంకింగ్‌ షేర్లు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌లు 1-2 శాతం మేర ఎగిసాయి. ఇక విప్రో, బజాజ్‌ ఆటో, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌ షేర్లు స్వల్ప తగ్గుదలతో ప్రారంభమయ్యాయి. 

ఆసియా సూచీలు అప్‌..

వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక ఉద్దీపన ఉపసంహరణ పాలసీ నుంచి వెనక్కుతగ్గే సంకేతాల్ని అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పొవెల్‌ వెల్లడించడంతో గత శుక్రవారం అమెరికా సూచీలు 3 శాతం మేర ర్యాలీ జరిపిన ప్రభావంతో ప్రధాన ఆసియా సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. జపాన్‌ నికాయ్‌ సూచి 3 శాతంపైగా పెరగ్గా, సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌, తైవాన్‌ వెయిటెడ్‌, కొరియా కోస్పిలు 1.5 శాతం మేర పెరిగాయి. గత వారాంతంలో 3 శాతం వరకూ పెరిగిన హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచి తాజాగా మరో 1.5 శాతం జంప్‌చేసింది. చైనా షాంఘై మాత్రం స్వల్పలాభాలతో మొదలయ్యింది. 



You may be interested

బ్యాంకు నిఫ్టీలో ‘రేషియో కాల్‌ స్ప్రెడ్‌ వ్యూహం’

Monday 7th January 2019

నిపుణుల సూచన గతవారం బ్యాంకు నిఫ్టీ వారాంతంలో కోలుకొని పాజిటివ్‌గా ముగిసింది. బ్యాంకునిఫ్టీలో లాంగ్‌ అన్‌వైండింగ్‌ ఎక్కువగా కనిపించింది. ఓపెన్‌ఇంట్రెస్ట్‌ కొత్తగా ఏర్పడినట్లు కనిపించలేదు. ఎంపిక చేసిన బ్యాంకు స్టాకుల్లో లాంగ్స్‌ పెరిగాయి. ఈ పరిస్థితిని గమనిస్తే కొత్త వారానికి బ్యాంకునిఫ్టీలో మరికొంత పుల్‌బ్యాక్‌ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారీ అప్‌మూవ్స్‌ ఉండకపోయినా 27,500 పాయింట్ల వరకు పైకి ఎగిసే ఛాన్సులున్నాయని అంచనా. ఈ సమయంలో బ్యాంకు నిఫ్టీలో రేషియో

10,900 సమీపంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Monday 7th January 2019

అంతర్జాతీయ సానుకూల ట్రెండ్‌ ఫలితంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 10,900 పాయింట్ల స్థాయిని సమీపించింది. వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక ఉద్దీపన ఉపసంహరణ పాలసీ నుంచి వెనక్కుతగ్గే సంకేతాల్ని అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పొవెల్‌ వెల్లడించడంతో ప్రపంచ ప్రధాన మార్కెట్లు పెద్ద ర్యాలీ జరిపిన నేపథ్యంలో భారత్‌లో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్లకు అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.20 గంటలకు110 పాయింట్ల

Most from this category