STOCKS

News


బ్యాంకింగ్‌ షేర్ల జోరు..గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Wednesday 30th January 2019
Markets_main1548820900.png-23884

సెన్సెక్స్‌ 230 పాయింట్లు, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో ప్రారంభం

క్రితం రోజు కొన్ని కార్పొరేట్‌ ఫలితాలు ఇన్వెస్టర్లకు పోత్రాహాన్నివ్వడంతో బుధవారం స్టాక్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 230 పాయింట్ల లాభంతో 35,850 పాయింట్ల వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 10,710 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ మొదలైన కొద్ది నిముషాలకే కొంతవరకూ లాభాల్ని సూచీలు కొల్పోయినా, స్థిరంగా ట్రేడవుతున్నాయి. మంగళవారం బ్లాక్‌బస్టర్‌ ఫలితాల్ని ప్రకటించిన యాక్సిస్‌ బ్యాంక్‌ 4 శాతంపైగా జంప్‌చేసి ఆల్‌టైమ్‌ గరిష్టస్థాయి రూ. 688 వద్దకు చేరింది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఫలితాలు కూడా ఇన్వెస్టర్లను ఆకట్లుకోవడంతో ఈ షేరు 3.5 శాతం పెరిగింది. యస్‌బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌లు 2 శాతం వరకూ ట్రేడింగ్‌ ప్రారంభంలో పెరిగాయి. మరోవైపు బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, అదాని పోర్ట్స్‌, హీరో మోటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 1 శాతం వరకూ నష్టాలతో మొదలయ్యాయి. ఇక గత రాత్రి అమెరికా సూచీలు లాభాలతో ముగియగా,   తాజాగా ఆసియాలో జపాన్‌, తైవాన్‌, చైనా సూచీలు నష్టాల్లోనూ, హాంకాంగ్‌, సింగపూర్‌, కొరియా సూచీలు లాభాల్లోనూ ట్రేడవుతున్నాయి. 



You may be interested

‍బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం నాలుగు రెట్లు

Wednesday 30th January 2019

- క్యూ3లో రూ. 471 కోట్లు - స్వల్పంగా తగ్గిన ఎన్‌పీఏలు న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) నికర లాభం నాలుగు రెట్లు ఎగిసి, రూ. 471 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 112 కోట్లు. మరోవైపు, మూడో త్రైమాసికంలో ఆదాయం రూ. 12,976 కోట్ల నుంచి రూ. 14,563 కోట్లకు పెరిగింది. క్యూ3లో

యాక్సిస్ లాభం రెట్టింపు

Wednesday 30th January 2019

యాక్సిస్ లాభం రెట్టింపు మూడో త్రైమాసికంలో రూ. 1,681 కోట్లు పెరిగిన స్థూల ఎన్‌పీఏలు న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ నికర లాభం రెట్టింపై రూ. 1,681 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇది రూ. 726 కోట్లు. సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 5,604 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.

Most from this category