STOCKS

News


భారీ గ్యాప్‌అప్‌

Tuesday 12th March 2019
Markets_main1552361277.png-24538

ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల పవనాల ఫలితంగా భారత్‌ సూచీలు శుక్రవారం గ్యాప్‌అప్‌తో ప్రారభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 280 పాయింట్లు జంప్‌చేసి 37,335 పాయింట్ల సమీపంలో ప్రారంభమయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 11,248 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఎన్‌టీపీసీ, హింద్‌ పెట్రో, టాటా మోటార్స్‌, హిందాల్కో, పవర్‌గ్రిడ్‌లు 1-2 శాతం లాభంతో ప్రారంభంకాగా, ఇన్‌ఫ్రాటెల్‌, భారతి ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌లు స్వల్పనష్టాలతో మొదలయ్యాయి.పెట్రోకెమికల్స్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  ఆల్‌టైమ్‌ గరిష్టం అయిన రూ.1329 స్థాయిని సమీపించింది.  బ్యాంక్‌ నిఫ్టీ 200 పాయింట్లకుపైగా పెరిగి 28,200 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఈ సూచీ ఆల్‌టైమ్‌ గరిష్టానికి మరో అరశాతం మాత్రమే దూరంగా వుండటం విశేషం. 

బ్రెగ్జిట్‌ డీల్‌తో ప్రపంచ మార్కెట్ల ర్యాలీ

 బ్రెగ్జిట్‌ డీల్‌లో మార్పులకు యూరోపియన్‌ కమిషన్‌ అంగీకరించడంతో ఈ డీల్‌కు బ్రిటన్‌ పార్లమెంటు ఆమోదం లభిస్తుందన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లు జోరుగా పెరిగాయి. గత  రాత్రి అమెరికా, యూరప్‌ సూచీలు 2 శాతం వరకూ లాభాలతో ముగిసాయి. తాజాగా ఆసియాలో జపాన్‌ నుంచి సింగపూర్‌ వరకూ స్టాక్‌ సూచీలు 1-2 శాతం జంప్‌చేశాయి.



You may be interested

మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 12th March 2019

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  టీవీఎస్‌ మోటర్‌:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండవ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.  ఒక రూపాయి ముఖ విలువ కలిగిన  ఒక్కో  షేరుకి రూ. 1.40 వాటాదారులకు ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించనుంది. ఈ కంపెనీ  బోర్డు డైరెక్టర్ల ఆమోదం లభించినట్టు బీఎస్‌ఈ ఫైలింగ్‌ లో  తెలిపింది.    లార్సన్‌ లాబ్స్‌:- మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సిక్లోరోక్వినైన్‌ ఔషధ విక్రయాలకు సంబంధించి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి తుది

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 33 పాయింట్లు డౌన్‌

Tuesday 12th March 2019

ప్రపంచ మార్కెట్లు నుంచి అందిన సానుకూల పవనాల ఫలితంగా భారత్‌ సూచీలు శుక్రవారం గ్యాప్‌అప్‌తో ప్రారభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 63 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.45 గంటలకు 11,265 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,202 పాయింట్ల వద్ద ముగిసింది. గత  రాత్రి అమెరికా, యూరప్‌ సూచీలు 1 శాతం వరకూ లాభాలతో

Most from this category