STOCKS

News


లాభాల్లో ఆయిల్‌ రంగ షేర్లు

Tuesday 13th November 2018
Markets_main1542084395.png-21917

ముంబై: ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు మంగళవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో 4 శాతం వరకు ర్యాలీ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ ధర 69.47 డాలర్లకు తగ్గిపోవడం, డబ్ల్యూటీఐ క్రూడ్‌ 60 డాలర్ల దిగువకు పడిపోయిన నేపథ్యంలో ఈ రంగ షేర్లు జోరుమీద కొనసాగుతున్నాయి. ముడిచమురు ధరలు వరుసగా 11వ రోజు కూడా తగ్గుదలను నమోదుచేయడంతో హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌) షేరు ధర 4 శాతం లాభపడింది. ఉదయం 9 గంటల 40 నిమిషాల సమయానికి రూ.234.60 వద్దకు చేరింది. క్రితం ముగింపు రూ.225.60తో పోల్చితే రూ.9 లాభపడింది. 

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్‌) సైతం 4 శాతం లాభపడింది. రూ.302.85 వద్దకు చేరింది. నిన్నటి ముగింపుతో పోల్చితే రూ.10 మేర లాభపడింది. 

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) రెండున్నర శాతం లాభపడింది. రూ.139 వద్ద కొనసాగుతోంది. సోమవారం ముగింపు రూ.135తో పోల్చితే రూ.4 లాభపడింది. 
 You may be interested

ఆస్తుల అమ్మక ప్రక్రియను ఆరంభించిన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: భారీ రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు,  ఆస్తుల అమ్మక ప్రక్రియను ఆరంభించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌, ఐఎస్‌ఎస్‌ఎల్‌ సెటిల్‌మెంట్‌ అండ్‌ ట్రాన్సాక్షన్‌ సర్వీసెస్‌లో తనకున్న వాటాలను విక్రయించే ప్రక్రియను మొదలు పెట్టింది. ఆర్ప్‌వుడ్‌ క్యాపిటల్‌, జేఎం ఫైనాన్షియల్‌ సంస్థలను సలహాదారులగా నియమించుకుంది. ఈ మేరకు తాజా ప్రగతిపై కార్పొరేట్‌ వ్యవహారాల శాఖకు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ నివేదికను సమర్పించింది. గ్రూపు సమస్యల పరిష్కారానికి ప్రతిపాదించిన వాటిల్లో ఆస్తుల విక్రయం ద్వారా

రూపాయి అప్‌..

Tuesday 13th November 2018

ఇండియన్‌ రూపాయి మంగళవారం స్వల్పంగా బలపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 10 పైసలు లాభంతో 72.79 వద్ద ప్రారంభమైంది. బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం ఇందుకు కారణం. రిటైల్‌ ద్రవ్యోల్బణం శాంతించడం కూడా సానుకూల ప్రభావం చూపింది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి 72.72 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన సోమవారం ముగింపు స్థాయి 72.89తో పోలిస్తే 0.24 శాతం లాభపడింది. కాగా రూపాయి

Most from this category