STOCKS

News


ఆయిల్‌ షేర్లకు చమురు ధరల సెగలు

Wednesday 5th September 2018
Markets_main1536131634.png-19978

  • 52-వారాలకు హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ షేర్లు

ముంబై:- అంతర్జాతీయంగా ఆకాశాన్ని అంటుతున్న ముడిచమురు ధరలకు, దేశీయంగా పాతాళానికి పతనమవుతున్న రూపాయి విలువ తోడవ్వడంతో ఆయిల్‌ రంగ షేర్లు బుధవారం నష్టాలబాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ బ్యారెల్ క్రూడాయిల్ ధర 79.72 డాలర్లకు చేరుకున్నాయి. ఫలితంగా చమురు కంపెనీల మార్జీన్లు  క్షీణించే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురును అధిక ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ముడిచమురును శుద్ధి చేసి తుది ఉత్పత్తులైన పెట్రోల్‌, డీజీల్‌ను తయారీ చేసేందుకు కంపెనీలు మరికొంత వ్యయాన్ని ఖర్చును భరించాల్సి ఉంటుంది. అయితే కంపెనీలకు తమ తుది ఉత్పత్తులపై ధరను నిర్ణయించే అవకాశం లేకపోవడంతో కంపెనీలు నష్టపోతాయని కేఐఎఫ్‌ఎస్‌ ట్రేడ్‌ క్యాపిటల్‌ ఛీప్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ రితేష్‌ ఆకాశ్‌ అన్నారు. మరోవైపు రూపాయి విలువ తాజాగా 71.79 కనిష్టస్థాయికి చేరుకోవడం కూడా చమురు కంపెనీలకు భారంగా మారింది. పలితంగా నేటి ఇంట్రాడేలో చమురు కంపెనీల షేర్లైన హెచ్‌పీసీఎల్‌, బీఎస్‌ఈఎల్‌ షేర్లు 52వారాల కనిష్టానికి పతనమవగా, ఐఓసీ 1.50శాతం నష్టపోయింది.
హెచ్‌పీసీఎల్‌:- నేటి బీఎస్‌ఈలో రూ.250ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు షేరు కొనుగోలుకు మొగ్గుచూపడంతో షేరు 1.50శాతం నష్టపోయి రూ. 246.30 వద్ద 52-వారాల కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:00లకు షేరు గతముగింపు ధర(రూ.250.05)తో పోలిస్తే 1.22శాతం నష్టంతో రూ.247.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 246.30 రూ.485.20లుగా నమోదయ్యాయి.
బీపీసీఎల్‌:- నేటి బీఎస్‌ఈలో రూ.351.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు షేరు కొనుగోలుకు మొగ్గుచూపడంతో షేరు 1.19శాతం నష్టపోయి రూ.347.00 వద్ద 52-వారాల కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:00లకు షేరు గతముగింపు ధర(రూ.250.05)తో పోలిస్తే 1.00శాతం నష్టంతో రూ.347.70ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.347.00, రూ.550.00లుగా నమోదయ్యాయి.
ఐఓసీ:- నేటి బీఎస్‌ఈలో రూ.153.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు షేరు కొనుగోలుకు మొగ్గుచూపడంతో షేరు 1.50శాతం నష్టపోయి రూ. 150.35 కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:00లకు షేరు గతముగింపు ధర(రూ.152.55)తో పోలిస్తే 1.34శాతం నష్టంతో రూ.150.50ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.150.15, రూ224.08లుగా నమోదయ్యాయి.



You may be interested

మార్కెట్లు అధోముఖం

Wednesday 5th September 2018

బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ నెమ్మదిగా నష్టాల్లోకి జారుకుంది. సెన్సెక్స్‌ 38,000 మార్క్‌కు దిగువున, నిఫ్టీ 11,500 మార్క్‌కు దిగువున ఉన్నాయి. మధ్యాహ్నాం 12:30 సమయంలో సెన్సెక్స్‌ 214 పాయింట్ల నష్టంతో 37,944 వద్ద, నిఫ్టీ 76 పాయింట్ల నష్టంతో 11,444 వద్ద ట్రేడవుతున్నాయి. మిడ్‌క్యాప్స్‌ సహా బ్యాంక్స్‌, ఆటో, ఇన్‌ఫ్రా, ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ, మెటల్స్‌ విభాగాల్లో అమ్మకాలు చోటుచేసుకోవడంతో ఇండెక్స్‌లు పడిపోయాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 11,436 పాయింట్ల

రూపీ క్షీణత.. మెటల్‌, ఐటీ రంగాలకు లబ్ది

Wednesday 5th September 2018

మార్కెట్లు కన్సాలిడేట్‌ అవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్‌ బలమైన డిమాండ్‌ నేపథ్యంలో రూపాయి బలహీనపడటం, క్రూడ్‌ ధరలు పెరగడం వంటి అంశాలు ఇందుకు కారణంగా పేర్కొన్నారు. నిఫ్టీ తన రికార్డ్‌ గరిష్ట స్థాయి నుంచి 200 పాయింట్లకుపైగా పడిపోయిందని తెలిపారు. ఈ ఏడాది 10 శాతం ర్యాలీ చేసిందని, అందువల్ల ప్రస్తుత కన్సాలిడేషన్‌ ఊహించినదేనని పేర్కొన్నారు. రూపాయి మరింత బలహీనపడినా, బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 80-85 డాలర్లకు పెరిగినా

Most from this category