STOCKS

News


ఎన్‌బీఎఫ్‌సీ షేర్లను ఎలా డీల్‌ చేయాలి?

Friday 12th October 2018
Markets_main1539333776.png-21089

నెల రోజులుగా ఎన్‌బీఎఫ్‌సీ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టిన వాళ్లు ఇకపై ఏం చేయాలా? అని సంశయంలో పడిపోయారు. అయితే ఒక సారి ఈ రంగంలో చెలరేగిన తుఫాను చల్లబడ్డతర్వాత కమ్రంగా కోలుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. ముందుగా ఈ రంగాన్ని తీవ్రంగా వేధిస్తున్న లిక్విడిటీ సమస్యకు పరిష్కారం దొరికితే ఈ షేర్లు కోలుకుంటాయని చెబుతున్నారు.

ఇప్పటికే ఈ రంగంలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు ప్రముఖ అనలిస్టులు ఏం చేయాలో సూచనలు ఇస్తున్నారు..
నాణ్యమైనవి ఎంచుకోండి: మంచి రేటింగ్‌ ఉండి, సరైన యాజమాన్యం చేతిలోని ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో పెట్టుబడులు పెట్టి ఉంటే పెద్దగా ఆందోళన పడాల్సిన పనిలేదు. ఈ రంగంలో రికవరీ ఆరంభమైతే నాణ్యమైన స్టాకులే ముందు పైకి వస్తాయి. అధ్వాన్న ఎన్‌బీఎఫ్‌సీల్లో పెట్టుబడులు ఉంటే వీలు చూసుకొని నాణ్యమైన షేర్లకు మారడం ఉత్తమం.
ఆచితూచి వ్యవహరించండి: ఈ రంగంలో పెట్టుబడులు ఉన్న ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఎమ్‌కే గ్లోబల్‌ హెచ్చరిస్తోంది. ఎడా పెడా యావరేజ్‌లు చేయడం, సరైన ఏఎల్‌ఎం(అసెట్‌ లయబిలిటీ మేనేజ్‌మెంట్‌) లేని స్టాకులను ఎంచుకోవడం చేయవద్దని సూచించింది.
హెచ్‌ఎఫ్‌సీలతో జాగ్రత్త: ఎన్‌బీఎఫ్‌సీల్లో హౌస్‌ ఫైనాన్సింగ్‌ కంపెనీలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విభాగంలో పెద్దగా రికవరీ ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మహీంద్రా ఫైనాన్స్‌ లాంటి బహుళార్ధక ఫైనాన్సింగ్‌ వ్యాపారాలున్న ఎన్‌బీఎఫ్‌సీలను ఎంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు. 
ట్రిగ్గర్లను గమనించండి: కొత్త లైసెన్సులు పొందడం, కొనుగోళ్లు, విలీనాల్లాంటివి ఈ రంగంలో పెద్ద ట్రిగ్గర్లుగా పనిచేస్తాయని నిపుణుల అంచనా. ఇలాంటివి జరిగినప్పుడు మంచి ఊపు వస్తుందని, ఆ అవకాశాన్ని ఎగ్జిట్‌కు ఉపయోగించుకోవాలని సూచించారు. 



You may be interested

అనిల్‌ అంబానీ గ్రూప్‌ షేర్ల ర్యాలీ

Friday 12th October 2018

అనిల్‌ అంబానీకి చెందిన ఎడిఎజి(అడాగ్‌) కంపెనీల షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇంట్రాడేలో గ్రూప్‌నకు చెందిన ఐదు కంపెనీల షేర్లు ఒక్క రిలయన్స్‌ డిఫెన్స్‌ మినహా రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ షేర్లు 10 శాతం ర్యాలీ చేశాయి. రిలయన్స్‌ ఇన్‌ఫ్రా:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.305.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 10శాతం పెరిగి రూ.329.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది.

సిమెంట్‌ రంగం.. క్యూ2 ఫలితాల ప్రివ్యూ..

Friday 12th October 2018

సిమెంట్‌ రంగ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (క్యూ2, జూలై-సెప్టెంబర్‌)లోనూ సందడి చేసే అవకాశాలు లేవని కోటక్‌ సెక్యూరిటీస్‌ తన నివేదికలో పేర్కొంది. వార్షికంగా విక్రయాల్లో 13 శాతం వృద్ధి నమోదైనప్పటికీ.. వ్యయాలు పెరుగుతుండటం, ధరల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల లేకపోవడం వల్ల ప్రస్తుత క్వార్టర్‌లోనూ కంపెనీలు చెప్పుకోదగ్గ పనితీరు కనబర్చకపోవచ్చని అంచనా వేసింది. ఏసీసీ, అంబుజా వంటి కంపెనీల ఈబీటా వార్షికంగా 11 శాతం పెరగొచ్చని పేర్కొంది.

Most from this category