News


స్టాక్స్‌లో సంపద కూడబెట్టాలంటే... ఇవి తప్పదు!

Saturday 16th February 2019
Markets_main1550255644.png-24215

అధిక రాబడుల ఆకాంక్షతోనే ఎవరైనా స్టాక్‌ మార్కెట్లో నేరుగా ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. మరి ఆశించిన మేర రాబడులు తెచ్చుకుంటున్న వారు ఎంతమంది...? చాలా తక్కువ మందే ఉంటారు. రాకేష్‌ జున్‌జున్‌వాలా, రమేష్‌ దమానీ, విజయ్‌ కేడియా, డాలీఖన్నా తదితరుల్లా తాము సైతం భారీగా స్టాక్‌ మార్కెట్లో పోగు చేసుకోవాలనుకుంటే... అందుకు సాధారణంగా ఇన్వెస్ట్‌ చేస్తే సరిపోదు మరి. ప్రత్యేక క్వాలిటీలతో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. స్టాక్‌ మార్కెట్లో భారీగా సంపద సృష్టించుకోవాలంటే... ఒక ఇన్వెస్టర్‌ రూ.10 లక్షల పెట్టుబడిని 30 ఏళ్లలో రూ.100 కోట్లుగా మలచాలనుకుంటే... ప్రతీ మూడేళ్లకు పెట్టుబడి రెట్టింపు కావాల్సి ఉంటుందని రమేష్‌ దమానీ ఇటీవల ఓ సందర్భంలో తెలియజేశారు. ఇందుకోసం కాంపౌండెడ్‌గా 24 శాతం వృద్ధి రేటు ఉండాలి. 

 

మరి ఈ స్థాయిలో రాబడులు ఇవ్వాలంటే గొప్ప వ్యాపారంతోనే అది సాధ్యమంటారు దమానీ. అటువంటి వ్యాపారమే మన సంపదను ఎన్నో రెట్లు చేస్తుందని చెబుతారు. ఆర్థిక స్వేచ్ఛ కోసం కాంపౌండింగ్‌ సూత్రాన్నే ఫాలో అయిపోవాలని సూచిస్తారు. చాలా చిన్న వయసులోనే ఇన్వెస్టింగ్‌ ప్రారంభించి, ఈ సూత్రాన్ని అనుసరిస్తే దీర్ఘకాలంలో సంపద సాధ్యమేనంటారు. పెట్టుబడి చిన్న మొత్తమే అయినా 20-30 ఏళ్ల కాలానికి భారీ మొత్తం అవుతుందని గుర్తు చేశారు.  

 

తెలిసిన వ్యాపారంలోనే
మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న కంపెనీల వ్యాపారం గురించి తెలియడం చాలా అవసరం. తాము బాగా అర్థం చేసుకోగల, ఆ వ్యాపారం గురించి తగినంత అవగాహన ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలన్నది దమానీ సూచన. బ్యాంకింగ్‌ రంగానికి చెందిన వారు అయితే, బ్యాంకు స్టాక్స్‌లో... మెడికల్‌ రంగానికి చెందిన వారు ఫార్మా కంపెనీలను పరిశీలించాలని సూచిస్తారు. ఇతరులను చూసి తమకు తెలియని రంగాల్లో ఇన్వెస్ట్‌ చేయడం నిష్ప్రయోజనమని పేర్కొ‍న్నారు. తాను అమెరికా నుంచి తిరిగొచ్చిన అనంతరం టెక్నాలజీ రంగంపై మంచి అవగాహన ఉండడంతో ఆ రంగంలోనే ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేసి మంచి రాబడులు పొందినట్టు వెల్లడించారు. 

 

ఓ షేరు మల్టీబ్యాగర్‌ అవుతుందని గుర్తించేందుకు ఆ కంపెనీ వ్యాపార విలువను అంచనా వేయగల సామర్థ్యం కూడా కావాలంటారు. ‘‘ఇన్ఫోసిస్‌ ఐపీవో ద్వారా రూ.50 కోట్లు సమీకరించింది. ఇప్పుడు ఈ కంపెనీ మార్కెట్‌ విలువ రూ.3 లక్షల కోట్లు. ఓ వ్యాపారం అసలు విలువను గుర్తిస్తే భవిష్యత్తు దృష్ట్యా పెట్టుబడి పెట్టడం సులభం అవుతుంది’’ అని రమేష్‌ దమానీ తెలిపారు. కంపెనీ వృద్ధి అవకాశాలను అంచనా వేయడం కూడా అవసరమే. 

 

ప్రత్యేకంగా ఆలోచించాలి...
అందరిలో ఒకరిలా కాకుండా భిన్నంగా ఆలోచించడం కూడా అవసరమే. ‘‘సంపద్రాయ కంపెనీలు కొంత కాలానికి పాతవైపోతాయి. నూతన తరం కంపెనీలను గుర్తించేందుకు కొత్త తరహా ఆలోచనలు సాయపడతాయి. మారే ధోరణలు స్టాక్‌ మార్కెట్లో భారీ రాబడులను ఇస్తాయి. ముందు నుంచి ఉన్న గ్రాసిమ్‌, బోంబే డైయింగ్‌ మంచి రాబడుల ఇచ్చాయి. ఆ తర్వాత టెక్నాలజీ స్టాక్స్‌ టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ వచ్చాయి. కానీ, భారీ రాబడులను ఇచ్చే స్టాక్స్‌ భిన్న రంగాల నుంచి ఉంటాయి. వాటిని గుర్తించడమే కీలకం’’ అని దమానీ సూచించారు.

 

భారీగా...
ఇక రూ.5,000 లేదా రూ.10,000ను ఓ కంపెనీలో పెట్టేసి భారీగా కూడబెట్టడం అన్నది అసాధ్యమని, గొప్ప వ్యాపారంతో కూడిన కంపెనీని గుర్తించినప్పుడు అందులో దూకుడుగా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారానే భారీ రాబడులు సొంతం చేసుకోవచ్చని సూచించారు. అలాగే, దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేయాలన్నారు. You may be interested

ఐడీబీఐ బ్యాంక్‌కు రూ.12,000 కోట్ల ఎల్‌ఐసీ నిధులు !

Saturday 16th February 2019

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ మరో రూ.12,000 కోట్లు పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో మొండి బకాయిలకు కేటాయింపుల కోసం ఈ స్థాయి పెట్టుబడులను ఎల్‌ఐసీ సమకూరుస్తుందని సమాచారం. ఈ విషయమై ఇటీవలనే ఇరు సంస్థల ఉన్నతాధికారులు ఆర్థిక సేవల విభాగం అధికారులతో సమావేశమయ్యారు. కాగా తాజా పెట్టుబడుల విషయమై ఎల్‌ఐసీ ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.  ఎల్‌ఐసీ పెట్టుబడులు రూ.21,624 కోట్లు  ఐడీబీఐ

రిటైలర్ల ‘స్టార్‌’ బ్యాంకు... ఈ కంపెనీ!

Saturday 16th February 2019

ఒకప్పుడు చిన్న బ్యాంకు... ఇప్పుడు మంచి పనితీరుతో అగ్ర స్థాయి బ్యాంకుగా మారే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అదే సిటీ యూనియన్‌ బ్యాంకు. తమిళనాడులోని కుంభకోణం కేంద్రంగా నడిచే ఈ బ్యాంకు గడిచిన 12 నెలల కాలంలో స్టాక్‌ మార్కెట్లో 27 శాతం రాబడులను ఇచ్చింది. బ్యాంకెక్స్‌ సూచీలో యాక్సిస్‌ బ్యాంకు తర్వాత అత్యధిక రాబడులను ఇచ్చిన బ్యాంకు ఇదే.  ప్రధానంగా చిన్న, మధ్య స్థాయి వ్యాపార సంస్థలకు

Most from this category