జున్జున్వాలాకూ ఒక్క నెలలో రూ.1,300 కోట్ల నష్టాలు!
By Sakshi

సాధారణ ఇన్వెస్టర్లకే కాదు... బిలియనీర్ ఇన్వెస్టర్, ఏస్ ఇన్వెస్టర్‌గా పేరొందిన జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియో సైతం తాజా కరెక్షన్లో నెగెటివ్ (మైనస్) రిటర్నుల్లోకి వెళ్లిపోయింది. కేవలం గత నెల రోజుల్లోనే ఆయన టాప్ 10 హోల్డింగ్స్‌పై రూ.1,300 కోట్ల నష్టాలు (12.3 శాతం) చూపిస్తున్నాయి. అదే ఈ ఏడాది ఇంత వరకు చూస్తే నికరంగా రూ.1,196 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. ఇది 11.4 శాతానికి సమానం. జున్‌జున్‌వాలా టాప్ 10 హోల్డింగ్స్ విలువ ప్రస్తుతానికి రూ.9,272 కోట్లుగా ఉంది. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) స్టాక్ పతనం తాలూకూ ప్రకంపనలు రాకేశ్ జున్జున్వాలానూ తాకాయి. ఆయన పోర్ట్‌ఫోలియోలో దారుణ పనితీరు చూపించిన స్టాక్ ఇది. ఈ ఒక్క స్టాక్ రూపంలోనే ఆయనకు రూ.325 కోట్ల నష్టాలు ఎదురయ్యాయి. ఐఎల్ఎఫ్ఎస్ డిఫాల్ట్ తర్వాత జరిగిన పరిణామాలతో డీహెచ్ఎఫ్ఎల్ స్టాక్ దారుణంగా పడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టైటాన్ కంపెనీలో పెట్టుబడులపై రూ.418 కోట్ల నష్టాలు చూపిస్తున్నాయి. ఈ ఏడాది కీలక సూచీలు నూతన గరిష్టాలను చేరిన తర్వాత... అధిక చమురు ధరలు, రూపాయి బలహీనతతో కరెంటు ఖాతా లోటు పెరుగుతుందన్న భయాలు, ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందన్న ఆందోళనలు, ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం ఇవన్నీ మార్కెట్లను నష్టాలపాలు జేశాయి. దీంతొ నిఫ్టీ గత వారంలోనే ఆరు శాతానికి పైగా క్షీణించింది. క్రిసిల్ ఒక నెలలో ఒక శాతం నష్టపోతే, ఈ ఏడాది ఇప్పటి వరకూ 6.7 శాతం నష్టపోయింది. డెల్టా ఒక నెలలో 16 శాతం, ఈ ఏడాది తొమ్మిది నెలల్లో 27.8 శాతం, దివాన్ హౌసింగ్ ఒక నెలలో 57 శాతం, 9 నెలల్లో 50 శాతం మేర నష్టాలను ఎదుర్కొన్నది. ఎస్కార్ట్స్ ఒక నెలలో 28 శాతం, తొమ్మిది నెలల్లో 18 శాతం నష్టపోయింది. ఫెడరల్ బ్యాంకు ఒక నెలలో 12 శాతం, తొమ్మిది నెలల్లో 35 శాతం, కరూర్ వైశ్యా బ్యాంకు 13 శాతం, 29 శాతం, లుపిన్ 1 శాతం, 1.3 శాతం, ర్యాలీస్ 10 శాతం, 29 శాతం, టైటాన్ 8 శాతం, 4.3 శాతం, వీఐపీ ఇండస్ట్రీస్ 29 శాతం, 23.9 శాతం చొప్పున ఈ నెలలో, ఈ ఏడాదిలో నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇవన్నీ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో ఉన్నవే. టాప్ 10 హోల్డింగ్స్‌ను చూస్తే... టైటాన్ (రూ.5,140 కోట్లు), లుపిన్ (రూ.791 కోట్లు), క్రిసిల్ (రూ.910 కోట్లు), ఎస్కార్ట్స్ (రూ.644 కోట్లు), ర్యాలీస్ (రూ.351 కోట్లు), దివాన్ (రూ.251 కోట్లు), డెల్టా (రూ.446 కోట్లు), ఫెడరల్ బ్యాంకు (రూ.240 కోట్లు), వీఐపీ ఇండస్ట్రీస్ (రూ.227 కోట్లు), కేవీబీ(రూ.273 కోట్లు) ఉన్నాయి. ఈ పది హోల్డింగ్స్‌లోని పెట్టుబడుల విలువ ప్రస్తుతానికి రూ.9,272 కోట్లు.
You may be interested
అక్టోబర్ ఆరంభం అదిరింది.
Monday 1st October 2018మిడ్‌సెషన్ నుంచి పెరిగిన కొనుగోళ్లతో మార్కెట్ సోమవారం భారీగా లాభపడింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకు, ఐటీ, ఫైనాన్స్ రంగాలకు చెందిన షేర్ల ర్యాలీతో సెన్సెక్స్ 300 పాయింట్లను ఆర్జించింది. నిఫ్టీ 11వేల ఎగువన ముగిసింది. సెన్సెక్స్ 299 పాయింట్ల లాభంతో 36,526 వద్ద ముగియగా, నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో 11,008.30 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 1శాతం(247 పాయింట్లు) లాభపడి 25,367 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో
ఎన్బీఎఫ్సీల్లో ఫండ్స్ పెట్టుబడులు.. ఏం పర్వాలేదు..
Monday 1st October 2018ఎన్బీఎఫ్సీ స్టాక్స్‌లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల గురించి భయపడాల్సిన అవసరం లేదంటున్నారు వ్యాల్యురీసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. లిక్విడిటీ సమస్య అనేది ఒక అంశమైతే.. విశ్వాసాన్ని ఏర్పరచడం అనేది మరొక అంశమని తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వంటి ఘటనలు తలెత్తినప్పుడు.. దీని వల్ల ఇతర విభాగాలపై కూడా నెగటివ్ ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అందువల్ల సవాళ్లను అధిగమించేందుకు త్వరితగతిన చర్యలను