STOCKS

News


అర్డినరీ షేర్లు vs డీవీఆర్‌ షేర్లు

Saturday 22nd September 2018
Markets_main1537612989.png-20483

మొట్టమొదటి సారిగా టాటా మోటార్స్‌ 2008లో డిఫరెన్షియల్‌ ఓటింగ్‌ రైట్స్‌ (డీవీఆర్‌) షేర్లను జారీ చేసినప్పుడు వాటిపై చాలా హైప్‌ క్రియేట్‌ అయ్యింది. తర్వాత గుజరాత్‌ ఎన్‌ఆర్‌ఈ కోక్‌, ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, జైన్‌ ఇరిగేషన్‌ వంటి పలు కంపెనీలు డీవీఆర్‌ షేర్లను జారీ చేశాయి. సాధారణంగా డివిడెండ్‌ ఎక్కువగా ఉండటం కారణంగా ఇన్వెస్టర్లు వీటికి ఆకర్షితులౌతారు. అయితే డీవీఆర్‌ షేర్లకు తక్కువ ఓటింగ్‌ రైట్స్‌ ఉంటాయి. భారత్‌లోని వ్యక్తిగత ఇన్వెస్టర్లు కంపెనీల ఏజీఎంలకు, ఓటింగ్‌కు హాజరు కాకపోవచ్చు. అందువల్ల ఎక్కువ డివిండెండ్లు, తక్కువ ధరకు అందుబాటులో ఉండటం వంటివి వీరిని ఆకర్షిస్తుంటాయి. ఆర్డినరీ, డీవీఆర్‌ షేర్లకు మధ్య వ్యత్యాలేంటివో ఒకసారి చూద్దాం.. 
రెండింటికీ ప్రధానంగా రెండు తేడాలుంటాయి. డీవీఆర్‌ షేర్లు.. ఆర్డినరీ షేర్లతో పోలిస్తే తక్కువ ఓటింగ్‌ రైట్స్‌ను కలిగి ఉంటాయి. ఇది కంపెనీలకు కలిసొచ్చే అంశం. ఇవి మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించాలనుకుంటే.. వాటి అధికారాన్ని కోల్పోకుండానే డీవీఆర్‌ షేర్లను జారీ చేసి నిధులు సమీకరించొచ్చు. తక్కువ ఓటింగ్‌ రైట్స్‌కు బదులుగా ఈ షేర్లకు ఎక్కువ డివిడెంట్లు అందిస్తాయి. ఇది చిన్న, రిటైల్‌ ఇన్వెస్టర్లకు సానుకూల అంశం. ఓటింగ్‌లో పాల్గొకుండా ఎక్కువ డివిడెంట్లను పొందగలరు. అలాగే డీవీఆర్‌ షేర్లు దాదాపుగా 30-40 శాతం డిస్కౌంట్‌తో లభిస్తాయి. ఇది మరొక పాజిటివ్‌ అంశం. గత ఐదేళ్లలో చూస్తే టాటా మోటార్స్‌ డీవీఆర్‌, జైన్‌ ఇరిగేషన్‌ డీవీఆర్‌ షేర్లు వాటి ఆర్డినరీ షేర్లతో పోలిస్తే ఔట్‌పర్ఫార్మ్‌ చేశాయి. అయినా కూడా ఇవి 30-40 శాతం డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. 

కంపెనీ        ఆర్డినరీ షేరు    డీవీఆర్‌ షేరు    డీవీఆర్‌ డిస్కౌంట్‌
టాటా మోటార్స్‌    రూ.260    రూ.142    45 శాతం
జైన్‌ ఇరిగేషన్‌    రూ.74        రూ.49        33 శాతం 
(ఎన్‌ఎస్‌ఈ జూలై 24 నాటి ధరలు)

డీవీఆర్‌ షేర్లతో పలు ప్రయోజనాలు ఉన్నా కూడా వీటికి చెప్పుకోదగ్గ ఆదరణ లేదు. ఎందుకో చూద్దాం..
-ఆర్డినరీ షేర్లతో పోలిస్తే డీవీఆర్‌ షేర్లతో లిక్విడిటీ సమస్య ఉంటుంది.
-రెండు షేర్ల మధ్య డివిడెంట్‌ అంతరం తక్కువగా ఉండటం. దీనికోసం ఓటింగ్‌ రైట్స్‌ను వదులుకోవడానికి ఇన్వెస్టర్లు ఇష్టపడకపోవచ్చు.
-ఇన్‌స్టిట్యూషన్‌ ఇన్వెస్టర్లు ఓటింగ్‌ రైట్స్‌ లేకుండా ఇన్వెస్ట్‌ చేయడానికి ఇష్టపడరు. ఇన్ఫోసిస్‌, టాటా అంశాలు తలెత్తినప్పుడు డీవీఆర్‌ షేర్లతో ఎలాంటి లాభం ఉండదు. 


 



You may be interested

షార్టింగ్‌కు ఇది సరైన సమయమా?

Saturday 22nd September 2018

వేచిచూడాలంటున్న నిపుణులు శుక్రవారం దేశీయ సూచీలు ఇన్వెస్టర్లను పీడకల మిగిల్చాయి. ఒక్కసారిగా కుప్పకూలిన సూచీలు పలువురు మదుపరులను దెబ్బతీశాయి. తర్వాత కాస్త కోలుకున్నా, సూచీలు మాత్రం పూర్తి బేర్‌ పట్టులోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం కొత్తగా షార్టు పొజిషన్లు తీసుకోవచ్చా?లేదా? అని పలువురు సంశయంలో ఉన్నారు.. అయితే మార్కెట్ల గమనంపై స్పష్టత వచ్చే వరకు కొత్త పొజిషన్ల జోలికి పోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లు మరి

అవెన్యూస్‌ పేమెంట్స్‌లో వాటా కొనుగోలు చేసిన ఐసీఐసీఐ

Saturday 22nd September 2018

ముంబై:- ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు ఈ-కామర్స్‌ సంస్థ అవెన్యూస్‌ పేమెంట్స్‌లో వాటా కొనుగోలుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా బీ2బీ, బీ2సీ చెల్లింపుల మార్కెట్‌లో సేవలు అందిస్తున్న అవెన్యూస్‌ పేమెంట్స్‌లో 8.9శాతం వాటాను రూ.10కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు శుక్రవారం ఐసీఐసీఐ బ్యాంకు రెగ్యూలేటరీకి సమాచారం ఇచ్చింది. ఈ వాటా కొనుగోలు ప్రక్రియను అక్టోబర్‌ చివరినాటికి పూర్తి చేస్తామని ఐసీఐసీఐ తెలిపింది. వాటా కొనుగోలు 10శాతానికి తక్కువ ఉన్నందున్న రెగ్యూలేటరీల

Most from this category