STOCKS

News


రాబడుల కంటే పొదుపు ఎంతన్నది ముఖ్యం

Friday 22nd February 2019
Markets_main1550774424.png-24271

చాలా మంది తమ పెట్టుబడులపై అధిక రాబడులు రావాలని కోరుకుంటుంటారు. నిజానికి రాబడుల కంటే మీరు చేసే పెట్టుబడులే కీలకమని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఆర్జన మొదలు పెట్టిన తొలినాళ్లలోనే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి, ఆ తర్వాత అంతే మొత్తాన్ని కొనసాగించినా (ఆదాయం పెరుగుతుంది కనుక) మెరుగైన రాబడులు అందుకోవడానికి మెరుగైన అవకాశాలు ఉంటాయి. కనుక రాబడుల విషయంలో సేవింగ్స్‌ రేటు (పొదుపు రేటు) చాలా కీలకం అవుతుంది. 

 

ఉదాహరణకు... రవి, హరి వీరిద్దరూ ప్రతీ నెలా రూ.50వేల మొత్తాన్ని ఆర్జిస్తున్నారు. ఇందులో రవి ప్రతీ నెలా తన ఆదాయంలో 10 శాతం అంటే 5వేల మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేస్తున్నాడు. దీనిపై అతనికి 15 శాతం రాబడులు వస్తున్నాయి. హరి ప్రతీ నెలా తన ఆదాయం నుంచి 20 శాతాన్ని అంటే 10వేలను ఇన్వెస్ట్‌ చేస్తున్నాడు. ఇతడికి రాబడుల రేటు 8 శాతంగా ఉంది. రవి తక్కువ శాతాన్నే ఇన్వెస్ట్‌ చేస్తున్నా గానీ, అధిక రాబడులను సొంతం చేసుకుంటున్నాడు. కానీ, హరి ఎక్కువ మొత్తాన్నే ఇన్వెస్ట్‌ చేస్తున్నా గానీ, రిస్క్‌ భయంతో సంప్రదాయ సాధనాలనే ఆశ్రయించడం వల్ల రాబడులు 8 శాతం స్థాయిలోనే ఉన్నాయి. వీరిద్దరూ ఇదే రీతిలో 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేస్తే... ఐదేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్లకు ఎవరి వద్ద పెద్ద మొత్తం ఉంటుందో ఊహించండి? ఆశ్చర్యం అనిపించినప్పటికీ... హరి వద్ద ఎక్కువ మొత్తం ఉంది. దీనికి కారణం అధిక సేవింగ్స్‌ రేటు. 

 

ఐదేళ్లకు రవి వద్ద ఫండ్‌ రూ.5.5 లక్షలు... హరివద్ద ఫండ్‌ రూ.9 లక్షలు
పదేళ్లకు రవి వద్ద రూ.20 లక్షలు... హరి వద్ద రూ.27.5 లక్షలు
పదిహేనేళ్లకు రవి వద్ద రూ.54.6 లక్షలు... హరి వద్ద రూ.62.9 లక్షలు. 


వీరిద్దరికీ వేతనంలో ఏటా 10 శాతం చొప్పున వృద్ధి ఉంటుందన్న అంచనా ఆధారంగా, ప్రతీ ఏటా తమ ఆదాయంలో 10 శాతాన్ని ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టుగా వేసిన అంచనాలు ఇవి. ఇక 20 ఏళ్లకు వచ్చే సరికి రవి వద్ద సమకూరే నిధి రూ.1.33 కోట్లు అయితే, హరి వద్ద రూ.1.27 కోట్లు అవుతుంది. 19వ సంవత్సరానికి ఇద్దరి వద్ద సమాన స్థాయిలో రూ.1.11 కోట్లే ఉంటుండగా, ఒక్క ఏడాది తిరిగేసరికి రవి వద్ద ఉన్న మొత్తం స్వలపంగా ఎక్కువ అవుతోంది.  

 

అంతా బాగానే ఉంది... ఎవరైనా అధిక రాబడులే దీర్ఘకాలంలో అధిక సంపదకు దారితీస్తాయంటారు కదా...? అన్న సందేహం మీకు రావచ్చు. నిజమే. కానీ, రాబడులు అన్నవి ఇన్వెస్టర్‌ చేతిలో ఉండేవి కావు. ముఖ్యంగా అధిక రాబడులకు ఎటువంటి హామీ, గ్యారంటీ ఉండవు. కానీ, సంప్రదాయ సాధనాల్లో రాబడులకు హామీ ఉంటుంది. కానీ, ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేయగలగడం అన్నది ఇ‍న్వెస్టర్‌ నియంత్రణలో ఉండే అంశం. కనుక అధిక రాబడులే కాదు, అధిక సేవింగ్స్‌ కూడా సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తుంది. అధిక సేవింగ్స్‌ రేటు ఉంటే, సంప్రదాయ సాధనాల్లో రిస్క్‌ తీసుకోకుండానే ఎక్కువ మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. ముఖ్యంగా ఆర్జన తొలినాళ్లలో ఎక్కువ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేస్తే దీర్ఘకాలానికి అది భారీ మొత్తమే అవుతుంది.You may be interested

మిశ్రమ ప్రారంభం

Friday 22nd February 2019

ప్రపంచమార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం మిశ్రమంగా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 8 పాయింట్ల లాభంతో 35,906 వద్ద 7 పాయింట్ల నష్టంతో 10,783 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పాటు, ఇటీవల దేశీయ మార్కెట్లో నెలకొన్న బలహీన సంకేతాలు మరోసారి తెరపైకి రావడంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. ఉదయం గం.9:30మయంలో సెన్సెక్స్ 50 పాయింట్లు నష్టంతో 35846 వద్ద, నిఫ్టీ 10775ల

తక్కువ ధరల వద్ద ప్రమోటర్ల కొనుగోళ్లు

Friday 22nd February 2019

మార్కెట్‌ పరిణామాలతో కొన్ని స్టాక్స్‌ దారుణంగా పడిపోవడం ఆయా కంపెనీల ప్రమోటర్లను ఆలోచింపజేసింది. దీంతో తక్కువ ధరల వద్ద తమ కంపెనీల్లో వాటాలను పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీల్లో ప్రమోటర్లు వాటాలు పెంచుకున్నారు. ఆ వివరాలను గమనిస్తే...    జనవరి 1 నుంచి సుమారు 150 కంపెనీల ప్రమోటర్లు ఓపెన్‌ మార్కెట్‌లో కొనుగోళ్లు లేదా బైబ్యాక్‌, ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ ద్వారా వాటాలు పెంచుకున్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఉదాహరణకు టాటా

Most from this category