హెచ్‌యూఎల్ షేరును ఏంచేద్దాం..?
By Sakshi

ముంబై: హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) షేరు ధర మంగళవారం ఒకదశలో రూ.1,848.95 వద్దకు చేరుకుని జీవితకాల గరిష్టస్థాయిని తిరగరాసింది. అయితే, మార్కెట్ ముగింపు సమయానికి రూ.15 (0.80 శాతం) నష్టపోయి రూ.1,811 వద్ద ముగిసింది. గ్లాక్సో స్మిత్‌క్లయిన్ కన్జ్యూమర్ హెల్త్‌కేర్‌కు (జీఎస్కే) డీల్ ప్రకటన అనంతరం షేరు ధర ఎగసినప్పటికీ.. లాభాల స్వీకరణ కారణంగా ఒక శాతం మేర నష్టాలను నమోదుచేసింది. ఈ నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేరుపై మార్కెట్ విశ్లేషకులు ఏమంటున్నారంటే.. ఎడిల్వీజ్ సెక్యూరిటీస్ ఈ షేరుకు అవుట్పెర్ఫార్మ్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. సెక్టార్ పిక్స్‌లో ఈ షేరును కొనసాగిస్తున్నట్లు తెలిపింది. టార్గెట్ ధరను రూ.2,030 వద్ద ప్రకటించింది. డిసెంబర్ ముగింపు నాటి ధరకు ఇది 10 శాతం అదనం. జీఎస్కే విలీనం వల్ల కంపెనీ ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్ (ఎఫ్ అండ్ ఆర్) ఆదాయం వాటా 18.4 శాతం నుంచి 27.8 శాతానికి పెరగనుందని అంచనావేసింది. ఈ విభాగం ఎబిటా మార్జిన్ 15.6 నుంచి 17.8 శాతానికి వృద్ధి చెందనున్నట్లు వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సర ఈపీఎస్ వృద్ధి అంచనా 4.5 శాతం(వ్యయ నియంత్రణ కలుపకుండా వేసిన అంచనా)గా ఉన్నట్లు తెలిపింది. హెల్త్, ఫుడ్ డ్రింక్స్ విభాగం 2020 అంచనా వృద్ధి 9 శాతంగా వివరించింది. సీఎల్ఎస్ఏ సైతం ఈ షేరుకు అవుట్పెర్ఫార్మ్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. టార్గెట్ ధరను రూ.1,750 నుంచి 2,010 వద్దకు సవరించింది. ఇక యూబీఎస్ న్యూట్రల్ రేటింగ్ ఇచ్చింది. టార్గెట్ ధరను రూ.1,800 వద్ద వెల్లడించింది.
You may be interested
ఎడెల్వీజ్ నుంచి 24 బెట్స్
Wednesday 5th December 2018వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు మన మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఎడెల్వీజ్ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ రీసెర్చ్ మంచి రాబడులకు అవకాశాలున్న 24 స్టాక్స్‌ను ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది. అక్రిసిల్: కాంపోజిట్ క్వార్ట్జ్ కిచెన్ సింక్‌లను ఈ కంపెనీ తయారు చేస్తోంది. వీటికి మంచి వృద్ధి అవకాశాలున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ను చేరుకునేందుకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తోంది.
ఆరురోజుల ర్యాలీకి బ్రేకులు
Tuesday 4th December 2018లాభాల స్వీకరణకు పూనుకున్న ఇన్వెస్టర్లు ఆర్బీఐ విధానం కోసం ఎదురుచూపులు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లలో లాభాల స్వీకరణతో సూచీల ఆరురోజుల ర్యాలీకి మంగళవారం బ్రేక్ పడింది. ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ రేపు(బుధవారం) కీలక వడ్డీరేట్లపై తన విధానాన్ని ప్రకటిస్తున్న తరుణంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ర్యాలీ కొనసాగుతుండంతో నేటి ట్రేడింగ్‌లో కూడా డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత మార్కెట్ సెంటిమెంట్