STOCKS

News


ఎన్నికల ఫలితాల వేళ ఎలా ట్రేడ్‌ చేయాలి?

Tuesday 11th December 2018
Markets_main1544510509.png-22819

ప్రముఖ బ్రోకరేజ్‌లు, అనలిస్టుల సలహాలు
దలాల్‌ స్ట్రీట్‌ మొత్తం ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌ దెబ్బకు సూచీలు సోమవారం 2 శాతం మేర ఢమాల్‌మన్నాయి. మరి మంగళవారం నిజ ఫలితాల వేళ సూచీల స్పందన ఎలాఉంటుందోనని ఇన్వెస్టర్లు ఆందోళనగా ఉన్నారు. వీరి ఆందోళనకు తగ్గట్లే ఆరంభంలో సూచీలు నష్టాలతో ట్రేడయ్యాయి. మధ్యాహ్న సమయానికి కాస్త కోలుకొని ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలా పెట్టుబడులను సంరక్షించుకోవాలో ప్రముఖ అనలిస్టులు, బ్రోకరేజ్‌లు వివిధ సూచనలు చేస్తున్నాయి. 

  • విజయ్‌ కేడియా: మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉంటాయి. కేవలం ఎన్నికల ఫలితాలు పెట్టుబడి నిర్ణయాలను తారుమారు చేయలేవని గ్రహించండి. సరైన మేనేజ్‌మెంట్‌ ఉండి, గత పదిహేనేళ్లుగా మంచి ప్రదర్శన చూపుతున్న కంపెనీ స్టాకును ఎంచుకొని నిశ్చింతగా ఉండండి. 
  • కోటక్‌ రిసెర్చ్‌: ముందు అనుకున్నట్లు బీజేపీ 3-0, 2-1 స్కోరు చేయగలిగి ఉంటే మార్కెట్లో ఒక మోస్తరు ర్యాలీ వచ్చిఉండేది. కానీ తేడాపడడంతో మార్కెట్లు నెగిటివ్‌గా స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కచ్ఛితమైన స్టాప్‌లాస్‌తో ట్రేడింగ్‌ చేయాలి. 
  • కుంజ్‌ బన్సాల్‌: ప్రస్తుత మార్కెట్లో స్వల్పకాలిక నిర్ణయం తీసుకోవడం అతిపెద్ద సాహసం. ఎన్నికల ఫలితాలు అనుకున్నట్లు వచ్చిఉన్నా పెద్ద ర్యాలీ ఉండేది కాదు. వచ్చే ఎర్నింగ్స్‌ సీజన్‌ వరకు మార్కెట్‌ రేంజ్‌బౌండ్‌గా ఉంటుంది. మార్కెట్లు కుదురుకునే వరకు కొత్త నిర్ణయాలు అనవసరం.
  • పంకజ్‌మురార్క: వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు మార్కెట్లలో ఈ ఆటుపోట్లు కొనసాగుతాయి. ఎన్నికలతో సంబంధం లేకుండా పలు కంపెనీలు మంచి వృద్ది నమోదు చేస్తూ కొనసాగుతున్నాయి. ఒకవేళ ఫలితాల కారణంగా కరెక‌్షన్‌ వస్తే ఇలాంటి గ్రోత్‌ కంపెనీలను ఎంచుకొని పెట్టుబడులు పెట్టాలి. 
  • జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రిసెర్చ్‌: ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా టెక్నికల్‌గా మార్కెట్లు నెగిటివ్‌ జోన్‌లో ఉన్నాయి. ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. అందువల్ల ఫలితాలు ఎలా ఉన్నా, స్వల్పకాలానికి కరెక‌్షన్‌ తప్పకపోవచ్చు. అప్పటివరకు వేచిచూడడం మంచిది.
  • షేర్‌ఖాన్‌: అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండడం, ఆర్‌బీఐ గవర్నర్‌ రాజీనామా నేపథ్యంలో మార్కెట్లు అత్యంత బలహీనంగా ఉన్నాయి. ఫలితాలు తేడా కొడితే మార్కెట్లో మరింత పతనం తప్పదు. అయితే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఈ పరిస్థితిని పెట్టుబడులకు అవకాశంగా మలచుకోవాలి. You may be interested

కరిగిన రూపాయి : పెరిగిన పసిడి

Tuesday 11th December 2018

ముంబై:- రూపాయి కరిగిపోవడం పసిడికి బలానిస్తుంది. ఫారెక్స్‌ మార్కెట్లో రాత్రి డాలర్‌ మారకంలో రూపాయి విలువ 50పైసలు కోసుకుపోయింది. ఫలితంగా గతరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి రూ.32వేల పైకి ఎగసింది. చివరికి రూ.567లు లాభపడి రూ.30028లు వద్ద ముగిసింది. అయితే నేటి ట్రేడింగ్‌లో పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణ జరుగుతోంది. ఉదయం గం.11:45ని.లకు ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి రూ.244లు నష్టపోయి రూ.31784.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయంగా స్వల్ప నష్టాలతో:-              డాలర్‌

52 వారాల కనిష్టానికి 200కుపైగా స్టాక్స్‌

Tuesday 11th December 2018

ఎన్‌ఎస్‌ఈలో మంగళవారం మార్నింగ్‌ ట్రేడింగ్‌లో 200కుపైగా స్టాక్స్‌ 52 వారాల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. ఇందులో అబాన్‌ ఆఫ్‌షోర్‌, అరియన్‌ప్రో సొల్యూషన్స్‌, బజాజ్‌ కార్ప్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌, బినాని ఇండస్ట్రీస్‌, సిప్లా, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, జీపీటీ, ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌, హిందుజా వెంచర్స్‌, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, వొడాఫోన్‌ ఐడియా, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్ట్‌, జైన్‌ ఇరిగేషన్‌, లక్స్‌ ఇండస్ట్రీస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎన్‌బీసీసీ, ఎన్‌టీపీసీ, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌

Most from this category