STOCKS

News


మల్టీ‍బ్యాగర్‌ రిటర్నుల కోసం ఏం చేయాలి?

Friday 7th December 2018
Markets_main1544206852.png-22738

మార్కెట్లలో తాము పెట్టిన పెట్టుబడి ఎన్నో రెట్లు వృద్ధి చెందాలని, మల్టీబ్యాగర్‌ రిటర్నులు రాబట్టాలని దాదాపు అందరు ఈక్విటీ ఇన్వెస్టర్ల ఆలోచనల్లో ఉంటుంది. రాకేశ్‌ జున్‌జున్‌వాలా వంటి ఏ కొద్ది మందికో తెలిసిన విద్యగా దీన్ని భావించక్కర్లేదు. కొన్ని సూత్రాలను ఆచరణలో పెడితే మల్టీబ్యాగర్‌ రిటర్నులు మీ సొంతం అవుతాయి. ఇందుకు ఏం చేయాలన్నది, అలాగే, ఓ స్టాక్‌ను ఎప్పుడు విక్రయించాలన్నది వ్యాల్యూ ఇన్వెస్టర్‌ సుమీత్‌ నాగర్‌ తెలియజేశారు. 

 

రాబడుల కోసం 
అధిక కన్విక‌్షన్‌తో కూడిన స్టాక్‌ స్వల్ప కాలంలో మంచి రాబడులను ఇస్తే కంగారు పడి అమ్మేసుకోకుండా ఓపిక వహించాలి. ఓ కంపెనీ కాంపౌండెడ్‌గా వృద్ధి కొనసాగిస్తున్నంత కాలం, దాని విలువలు సహేతుక స్థాయిల్లో ఉన్నంత కాలం పెట్టుబడులను కూడా కొనసాగించాలి. దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ దృష్ట్యా చూసినా ఇది అవసరమే. ఎంత ఎక్కవ కాలం పాటు కొనసాగిస్తే కాంపౌండింగ్‌లో అంత ప్రయోజనం. సరైన కొనుగోలు ధరను గుర్తించడం ఒక్కటే సరిపోదు. ఓ వ్యాపారాన్ని మొత్తం మీద అంచనా వేసి దాని అంతర్గత విలువపై అవగాహనకు రావాలి. కంపెనీ వాస్తవ విలువ కంటే, మార్కెట్‌ క్యాప్‌ తక్కువగా ఉంటే, మీ పెట్టుబడి సురక్షితంగా ఉన్నట్టే. కనుక కొనుగోలు చేసుకోవచ్చు. అంతర్గత విలువ కంటే మార్కెట్‌ క్యాప్‌ ఎక్కువే ఉంటే, సహేతుక ధర కోసం వేచి చూడొచ్చు. సరైన ధర వద్ద విక్రయించడం అన్నది దీర్ఘకాలిక ఇన్వెస్టర్‌కు పరీక్ష వంటిదే. ఓ అద్భుతమైన వ్యాపారంలో పెట్టుబడి పెట్టి, దాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగించినట్టయితే అది కాంపౌండెడ్‌గా వృద్ధి చెందుతుంది. ‘స్టాక్‌ పెట్టుబడులు ఎల్లప్పుడూ’ అనేది తనకు ఇష్టమైనదని వారెన్‌ బఫెట్‌ అంటుంటారు.

 

ఎప్పుడు విక్రయించాలి
పెట్టుబడి పెట్టిన తర్వాత ఓ స్టాక్‌ బాగా పెరిగినట్టయితే, ఫండమెంటల్స్‌ను మించి స్వల్పకాలంలోనే బాగా ర్యాలీ చేసినట్టయితే, ఆ స్థాయి నుంచి రానున్న 3-5 ఏళ్ల పాటు ఆ కంపెనీ ఒకే అంకె రాబడులను మాత్రమే ఇవ్వగలదని అంచనా వేస్తున్నట్టయితే, నిస్సంకోచంగా పెట్టుబడులను తగ్గించుకోవడం లేదా పూర్తిగా అమ్మేసి బయట పడడమే మంచిది. కొన్ని అంచనాల ఆధారంగా ఓ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేయడం సహజంగా చూస్తుంటాం. ఒకవేళ పెట్టుబడి పెట్టిన తర్వాత మీ అంచనాలు తప్పు అయినా, పొరపాటు జరిగినట్టు గుర్తించినా వెంటనే అమ్మేసి బయటకు రావాలి. ఒకవేళ మంచి అంచనాలతో పెట్టుబడులన్నింటినీ ఒకే కంపెనీలో ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. ఆ తర్వాత ఓ అద్భుతమైన పెట్టుబడి అవకాశం లభిస్తే, అందుకోసం కొంత మొత్తాన్ని పెట్టుబడులను నగదుగా మార్చుకోవచ్చు. సైక్లికల్‌ రంగాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే సంబంధిత రంగంలో సైకిల్‌ పూర్తయ్యేలోపే మీ పెట్టుబడులతో బయటకు వచ్చేయాలి.You may be interested

9న నొవోటెల్‌ విజయవాడ ప్రారంభం

Saturday 8th December 2018

పటమట(విజయవాడ తూర్పు): విజయవాడలో వరుణ్‌ గ్రూపు రూ.150 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న నొవోటెల్‌- వరుణ్‌ హోటల్‌ను ఈ నెల 9న ప్రారంభించనున్నట్లు వరుణ్‌ గ్రూపు అధినేత వి.ప్రభు కిషోర్‌ చెప్పారు. 2009లో తాము ఆతిథ్య రంగంలోకి అడుగుపెట్టామని, అప్పటి నుంచి ఎప్పటికప్పుడు మరిన్ని గదులను జత చేసుకుంటూ ముందుకెళుతున్నామని చెప్పారు. శుక్రవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘విజయవాడ హోటల్లో 227 విలాసవంతమైన గదులతోపాటు నాలుగు ఫుడ్‌బేవరేజ్‌ అవుట్‌లెట్లు, ఏడు సమావేశ

నష్టాలను పరిమితం చేసుకోవడమే ప్రధానం

Friday 7th December 2018

కొంచెం లాభం వచ్చిన వెంటనే స్టాక్స్‌ను అమ్మేయడం, కొంచెం నష్టం వస్తే మాత్రం అమ్మేయకుండా చూద్దాంలే అని కొనసాగించడం ఎక్కువ మంది ఇన్వెస్టర్లు చేసే పని ఇది. కానీ, కొన్ని లెక్కలు లేకుండా షేరు మార్కెట్లో డబ్బులు సంపాదించడం కష్టమంటున్నారు శామ్కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమీత్‌ మోది. నష్టాలు రాకుండా చూసుకోవం కంటే, వాటిని పరిమితం చేసుకోవడం అవసరమన్నారు. ఇందుకోసం ఏం చేయాలో కూడా ఆయన సూచించారు.   స్టాప్‌లాస్‌ను  పెట్టుకోవడం చాలా

Most from this category