STOCKS

News


సంపద సృష్టికి గొప్ప అవకాశం రాబోతోంది!!

Tuesday 13th November 2018
Markets_main1542097973.png-21952

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో బేర్స్‌, బుల్స్‌ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అక్టోబర్‌లో తొలి మూడు వారాల్లో బేర్స్‌ ఆధిపత్యం కొనసాగించాయి. తర్వాత బుల్స్‌ తిరిగి బేర్స్‌కు పంచ్‌ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. నిఫ్టీ తన గరిష్ట స్థాయి నుంచి దాదాపు 11 శాతంమేర పతనమైంది. లిక్విడిటీ సంక్షోభం, క్రూడ్‌ ఆయిల్‌ ధరల పెరుగుదల, మార్కెట్‌ వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగా ఉండటం, అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం, ఎఫ్‌ఐఐల పెట్టుబడి ఉపసంహరణలు, రూపాయి క్షీణత వంటి అంశాలు ఇందుకు కారణమని కోటక్‌ ఏఎంసీ ఎండీ నీలేశ్‌ షా తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. 
ఎఫ్‌ఐఐలు ఈ ఏడాది నికరంగా దాదాపు రూ.42,000 కోట్ల ఈక్విటీల నుంచి, రూ.58,000 కోట్లను డెట్‌ మార్కెట్‌ నుంచి వెనక్కు తీసుకున్నారని నీలేశ్‌ షా తెలిపారు. అంటే మొత్తంగా దాదాపు రూ.లక్ష కోట్లను ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారని పేర్కొన్నారు. అయితే మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇంకా కొనుగోలు చేస్తూ ఉండటం సానుకూల అంశమని తెలిపారు. ఎఫ్‌ఐఐల ఉపసంహరణలకు కారణాలను పాక్షికంగా అర్ధం చేసుకోవచ్చన్నారు. ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఇండెక్స్‌లో చైనా స్టాక్స్‌ వెయిటేజీ పెరిగిందని, అందువల్ల ఎఫ్‌ఐఐలపై రీబ్యాలెన్స్‌ ఒత్తిడి నెలకొందని తెలిపారు. అలాగే అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల వల్ల వర్ధమాన మార్కెట్లలో ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. వీటికితోడు గ్లోబల్‌గా వడ్డీ రేట్లు పెరగడం వల్ల ఎఫ్‌ఐఐలు వెనక్కు వెళ్లిపోతున్నారని తెలిపారు. అలాగే రానున్న ఎన్నికల సీజన్‌ కూడా ఎఫ్‌ఐఐ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. అయితే వ్యవస్థాగతంగా చూస్తే ఇండియన్‌ ఎకానమీ సరైన మార్గంలో పయనిస్తోందని తెలిపారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు (2018 ఏప్రిల్‌-సెప్టెంబర్‌) వార్షికంగా 15 శాతంమేర పెరిగాయని గుర్తు చేశారు. జీఎస్‌టీ వసూళ్లు అక్టోబర్‌లో రూ.లక్ష కోట్లను దాటాయని తెలిపారు. జీడీపీ వృద్ధి రేటు ఆరోగ్యకరంగా ఉందన్నారు. కన్సూమర్‌ డిమాండ్‌ను సూచించే ఇండికేటర్లు పైస్థాయిల్లో ఉన్నాయని తెలిపారు. దేశంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ మెరుగుపడుతోందని పేర్కొన్నారు. ఈ అంశాలన్నీ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని సూచిస్తున్నాయని తెలిపారు. ఎన్‌పీఏ సమస్య పరిష్కారమౌతోందని, దివాలా చర్యల వల్ల సమస్యలకు పరిష్కారం లభిస్తోందని పేర్కొన్నారు. చైనాపై అమెరికా టారిఫ్‌ల విధింపు వల్ల చాలా రంగాల్లో వృద్ధికి అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. అయితే అవకాశాలు ఇతర దేశాలకు వెళ్లకుండా ఆకర్షించాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని పేర్కొన్నారు. ఇండియన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ పరిశ్రమకు ఇది మంచి ఛాన్స్‌ అని అభిప్రాయపడ్డారు.  
ఇన్వెస్టర్ల కోణంలో చూస్తే.. సంపద సృష్టికి దీర్ఘకాలంలో చాలా అవకాశాలు కనిపిస్తున్నాయని నీలేశ్‌ షా తెలిపారు. అన్నీ సవ్యంగా జరిగితే.. మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రావొచ్చని పేర్కొన్నారు. అయితే స్వల్ప కాలంలో మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉంటాయని తెలిపారు. కరెక‌్షన్‌ సమయంలో నాణ్యమైన స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. You may be interested

వోకార్డ్‌ లిమిటెడ్‌ 8శాతం డౌన్‌ .!

Tuesday 13th November 2018

ఫార్మా రంగానికి చెందిన వోకార్డ్‌ లిమిటెడ్‌ షేరు మంగళవారం 8.50శాతం నష్టపోయింది. అమెరికా కోర్టు వోకార్డ్‌ లిమిటెడ్‌కు చెందిన ‘‘జైటిగా’’ ఔషధంపై పేటెంట్‌ హక్కులను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు తీర్పునిచ్చిందనే వార్తలు వెలుగులోకి రావడంతో షేరు ధర పతనమైంది. వోకార్డ్‌ కంపెనీ ఆదాయం ఆర్జనలో అధికభాగమైన ‘‘జైటిగా’’ జనరిక్‌ ఔషధాన్ని పురుషుల్లో సంక్రమించే ప్రోస్టెట్‌ కాన్సర్‌ చికిత్సలో వినియోగిస్తారు. మరోవైపు నేడు ఫార్మా షేర్లలో వెలువెత్తిన అమ్మకాలు సైతం షేరు క్షీణతకు దోహదపడ్డాయి. నేడు

నాణ్యమైన షేర్లను మాత్రమే చూడండి..!

Tuesday 13th November 2018

కేఆర్‌ చోక్సే సెక్యూరిటీస్‌ ఎండీ దేవేన్‌ చోక్సే వ్యాఖ్య ముంబై: కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ అవుట్‌లుక్‌ పరంగా చూస్తే ఫండమెంటల్స్‌ బలంగా ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థ కూడా బలంగానే ఉన్నట్లు ఫలితాలు సూచిస్తున్నాయని కేఆర్‌ చోక్సే సెక్యూరిటీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దేవేన్‌ చోక్సే అన్నారు. సోమవారం విడుదలైన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు ఆశాజనకంగానే ఉండగా.. జీడీపీ కూడా పర్వాలేదని ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన

Most from this category