STOCKS

News


ద్రవ్యకొరతతో హౌసింగ్‌ ఫైనాన్స్ షేర్ల పతనం

Monday 5th November 2018
Markets_main1541410484.png-21724

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ద్రవ్యత్వ కొరత అంశం మరోసారి తెరపైకి రావడంతో  సోమవారం ఆ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల్లో లిక్విడిటీ కొరత ఇంకా తీరలేదని కార్పోరేట్‌ అఫైర్స్‌ సెక్రటరీ సోమవారం తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులు రుణం ఇచ్చే విషయంలో ఆర్‌బీఐ కొంత నిబంధనలను సడలించినప్పటికి బ్యాంకులు మాత్రం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రుణాల కేటాయింపు విషయంలో వెనకడుగు వేస్తన్నట్లు ఆయన తెలిపారు. ఈ కారణంగా ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలతో పాటు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో ద్రవ్వత్వ కొరత ఏర్పడినట్లు ఆయన తెలిపారు. డిసెంబర్‌ 2018 నాటికి ఎన్‌బీఎఫ్‌సీ/హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు చెల్లించాల్సిన రుణాలు రూ.2లక్షల కోట్లకు చేరుతాయని డిపార్టమెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ ఎఫైర్స్‌(డీఈఏ) అంచనా వేసింది. అయితే ప్రభుత్వం అనుకున్న స్థాయిలో నిధుల సేకరణ పూర్తైతే ఏడాది చివరినాటికి చెల్లించాల్సి రుణాలు రూ.1లక్ష కోట్లకు చేరుతాయని డీఈఏ అంచనా వేసింది. ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్‌సీల్లో అదనపు ద్రవ్యత్వం లేకపోవడంతో మరో ఆరు వారాల్లో ఒక ముఖ్యమైన డిఫాల్ట్ సంభవించవచ్చని, ఉత్పాదక రంగానికి చెందిన ఆర్థిక ప్రగతి ప్రతికూలంగా ప్రభావితమవుతుందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఇటీవల ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ రుణ చెల్లింపుల్లో విఫలం చెందడంతో, లిక్విడిటీపై ఆందోళనలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో హౌసింగ్‌ ఫైనాన్స్‌ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇండియాబుల్‌హౌసింగ్స్‌ ఫైనాన్స్‌, డీఎల్‌ఎఫ్‌ఎల్‌, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 1నుంచి 11శాతం నష్టపోయాయి. ఈ పతనం మరింత కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.



You may be interested

టాటాతో చర్చలు.. జెట్‌ 10% అప్‌

Monday 5th November 2018

జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ధర సోమవారం ఏకంగా 10 శాతానికి పైగా ఎగసింది. టాటా గ్రూప్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ మధ్య రెండో విడత చర్చలు ప్రారంభమైనట్లు మీడియాలో వార్తలు వెలువడటం ఇందుకు కారణం. సీఎన్‌బీసీ-టీవీ18 ప్రకారం.. టాటా గ్రూప్‌.. జెట్‌ ఎయిర్‌వేస్‌లో సంస్థ ప్రమోటర్ల వాటాను, ఇతిహద్‌ వాటాను కొనుగోలు చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ డీల్‌ కుదిరితే.. అప్పుడు

గెయిల్‌ లాభం 55% జంప్‌

Monday 5th November 2018

గెయిల్‌ ఇండియా తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన కంపెనీ నికర లాభం 55 శాతం వృద్ధితో రూ.1,963 కోట్లకు ఎగసింది. మంచి నిర్వహణ పనితీరు ఇందుకు కారణం. మార్కెట్‌ నిపుణులు కంపెనీ నికర లాభం రూ.1,473 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. అంటే కంపెనీ నికర లాభం అంచనాలు మించింది. ఇక గత ఆర్థిక సంవత్సరం ఇదే

Most from this category